EPAPER
Kirrak Couples Episode 1

AP Cabinet: ఇవాళే ప్రమాణస్వీకారం.. ఏ క్షణమైనా మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం

AP Cabinet: ఇవాళే ప్రమాణస్వీకారం.. ఏ క్షణమైనా మంత్రివర్గ జాబితా విడుదలయ్యే అవకాశం

AP Cabinet list: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ సమావేశమయ్యారు. తన నివాసానికి వచ్చిన కేంద్రమంత్రులకు చంద్రబాబు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు బాబుతో సమావేశమై.. మంత్రివర్గ కూర్పు, బీజేపీ నుంచి ఎవరికి పదవులు అనేదానిపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ కూర్పు పూర్తయ్యిందని, ఏ క్షణంలోనైనా మంత్రుల జాబితాను చంద్రబాబు.. గవర్నర్ కు పంపనున్నట్లు తెలుస్తోంది. మంత్రులుగా అవకాశం దక్కిన నేతలకు చంద్రబాబే స్వయంగా ఫోన్ చేసి చెప్పనున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నుంచి వచ్చే ఫోన్ కోసం ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రులకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్వాగతం పలికారు.


ఈరోజు ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతోపాటు మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, బండి సంజయ్ తోపాటు పలువురు మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు, ఇతర రంగాలకు చెందిన ప్రముకులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు.

Also Read: ఏపీ రాజకీయాల్లో అరుదైన ఘటన.. జగన్‌కు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు


అయితే, ఇప్పటికే మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ ప్రముఖులు రజినీకాంత్, మెగాస్టార్ చీరంజీవితోపాటు పలువురు ప్రముఖులు ఏపీకి చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చంద్రబాబు.. తన ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా రావాలంటూ తానే స్వయంగా ఫోన్ చేయగా, ఆహ్వానించే ప్రయత్నం చేశారు. అయితే, జగన్ మోహన్ రెడ్డి మాత్రం మాట్లాడేందుకు అందుబాటులోకి రాలేదు. చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండాలని వైసీపీ పార్టీ నిర్ణయించిందని, ఈ నేపథ్యంలోనే జగన్ అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.

Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×