EPAPER
Kirrak Couples Episode 1

Match : వదలని వరుణుడు.. భారత్ -కివీస్ రెండో వన్డే రద్దు

Match : వదలని వరుణుడు.. భారత్ -కివీస్ రెండో వన్డే రద్దు

Match : న్యూజిలాండ్ టూర్ లో భారత్ ను వరుణుడు వెంటాడుతున్నాడు. టీ20 సిరీస్ లో తొలి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. ఒక్క బంతి కూడా పడకుండానే ఆ మ్యాచ్ రద్దైంది. వర్షం ముప్పు లేకపోవడంతో రెండో టీ20 లో భారత్ గెలిచింది. ఇక మూడో మ్యాచ్ ను వర్షం వెంటాడంతో మ్యాచ్ నిలిచి పోయింది. డక్ వర్త్ లూయిస్ విధానం ప్రకారం ఇరుజట్ల స్కోర్ సమ కావడంతో మూడో టీ20 మ్యాచ్ అనూహ్యంగా టై అయ్యింది. దీంతో భారత్ టీ20 సిరీస్ ను 1-0తేడాతో కైవసం చేసుకుంది.


ఇప్పుడు వన్డే సిరీస్ లోనూ వరుణుడు వెంటపడుతున్నాడు. తొలిమ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ గెలవాలన్న పట్టుదలతో ఉన్న కివీస్ ఆశలపై నీళ్లు చల్లాడు. అటు భారత్ కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం . ఈ మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. భారత్ స్కోర్ 22 పరుగుల వద్ద మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించింది. ఆ తర్వాత చాలాసేపటికి మ్యాచ్ ను 29 ఓవర్లకు కుదించి ప్రారంభించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమవగానే కెప్టెన్ శిఖర్ ధావన్ పెవిలియన్ చేరాడు. వన్ డౌన్ లో దిగిన సూర్యకుమార్ యాదవ్ 34 పరుగులు ( 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులు) మెరుపులు మెరిపించాడు. అటు మరో ఓపెనర్ శుభమన్ గిల్ 45 పరుగులు ( 42 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సు) కూడా దూకుడు ఆడటంతో భారత్ స్కోర్ 89 పరుగులు ( 12.5 ఓవర్లు) చేరుకుంది. ఈ సమయంలో మళ్లీ వర్షం ఆటంకం కలిగించడంతో మ్యాచ్ పూర్తి నిలిచిపోయింది. వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ ను రద్దు చేశారు.

రెండో వన్డేలో భారత్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. సంజు శాంసన్ స్థానంలో దీపక్ హుడాకు, శార్దుల్ ఠాకూర్ స్థానంలో దీపక్ చహర్ కు అవకాశం కల్పించింది. టీమిండియా చివరి మ్యాచ్ లో ఇదే టీమ్ తో బరిలోకి దిగే అవకాశాలే ఉన్నాయి. ఎందుకంటే దీపక్ హూడాను తీసుకోవడం వల్ల బౌలింగ్ లో మరో ఆఫ్షన్ ఉంటుంది. హుడా బ్యాట్ తో మెరుపులు మెరిపిస్తాడు కాబట్టి అతడికి అవకాశం ఇచ్చింది. తొలి వన్డేలో ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్ధుల్ ఠాకూర్ ను పక్కన పెట్టి దీపక్ చహర్ అవకాశమిచ్చారు.


ఇక మూడో వన్డే కీలకం
నవంబర్ 30న జరిగే చివరి మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. చివరి వన్డే వర్షం వల్ల రద్దైనా, న్యూజిలాండ్ గెలిచినా ఆ జట్టే సిరీస్ కైవసం చేసుకుంటుంది. గత పర్యటనలోనూ భారత్ వన్డే సిరీస్ ను కోల్పోయింది. అప్పడు న్యూజిలాండ్ వన్డే సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.

Tags

Related News

Animal Oil Making: జంతుల కొవ్వుతో నూనె ఎలా తయారు చేస్తారు? కల్తీని ఎలా గుర్తించాలి? ఒళ్లుగగూర్పాటు కలిగించే వాస్తవాలు!

Rhea Singha: ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’.. ఎవరో తెలుసా?

Weather Update: బిగ్ అలర్ట్.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజులు భారీ వర్షాలు

Devara : దేవర ట్రైలర్ వచ్చేసింది.. ఎన్టీఆర్ అంటే ఫైర్.. అదిరిపోయిన విజువల్స్…

Iran coal mine: ఇరాన్‌లో ఘోర విషాదం.. భారీ పేలుడుతో 30 మంది మృతి

Illegal Hookah: పైకి బోర్డు కేఫ్.. లోపలకి వెళ్లి చూస్తే షాక్.. గుట్టు చప్పుడు కాకుండా ఏకంగా!

Nindu Noorella Saavasam Serial Today September 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ, మనోహరి మధ్య చెస్‌ యుద్దం – తనను ఎవ్వరూ ఓడించలేరని అంజు ఫోజులు

Big Stories

×