EPAPER

iOS 18 Feature: గుడ్ న్యూస్‌.. ఐఓఎస్‌ 18 వచ్చేస్తోంది.. ఐఫోన్ ఇక రేసు గుర్రమే..!

iOS 18 Feature: గుడ్ న్యూస్‌.. ఐఓఎస్‌ 18 వచ్చేస్తోంది.. ఐఫోన్ ఇక రేసు గుర్రమే..!

iOS 18 డెవలపర్ బీటా ఈరోజు నుండి developer.apple.comలో Apple డెవలపర్ ప్రోగ్రామ్ ద్వారా అందుబాటులో ఉంది. అలాగే వచ్చే నెలలో beta.apple.comలో Apple బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ ద్వారా పబ్లిక్ బీటా అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా iOS 18 ఈ ఏడాది చివర్లో ఐఫోన్ Xs కోసం ఉచిత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌గా అందుబాటులోకి వస్తుంది. కాగా ఈ iOS 18 ఫీచర్‌లో హోమ్‌ స్క్రీన్‌ కస్టమైజేషన్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీనిద్వారా ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌లోని యాప్ ఐకాన్లను ఒక చోట నుంచి మరో చోటుకు మార్చుకునేలా ఫీచర్‌ను అందించనున్నారు.

అంతేకాకుండా ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్‌లోని వాల్ పేపర్ లేదా కలర్ కాంట్రాస్ట్‌కు సరిపడా ఐకాన్‌ కలర్‌ను ఛేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా యాపిల్ కంపెనీ iOS 18 లో మెసేజెస్ యాప్‌లో కొత్త ‘ట్యాప్‌ బ్యాక్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఈ ఫీచర్ ద్వారా మెసేజ్‌లను షెడ్యూల్ చేసుకోవచ్చు. అంతేగాక టెక్స్ట్ ఫార్మాటింగ్ కూడా చేయవచ్చు. ముఖ్యంగా ఈ iOS 18 లో సేఫ్టీ ప్రైవసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగానే Apple App Lock వంటి అత్యద్భుతమైన ప్రైవసీ కంట్రోల్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్ కేవలం ఐఫోన్ యూజర్ ఫేస్ ID, టచ్ ID లేదా పాస్‌కోడ్‌ని ఉపయోగించి మాత్రమే యాక్సెస్ చేయగలదు. వీటితో పాటు ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ యాప్స్‌ను హైడ్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.


Also Read: ఐఫోన్ 16 ఆగయా.. అదిరిపోయిన ఫీచర్లు!

ఈ కొత్త iOS 18లో యాపిల్‌ వాలెట్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. అలాగే దీంతోపాటు మెయిల్‌ యాప్‌ అనే మరో కొత్త ఫీచర్‌ను అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ ఫోన్ నుంచి మెయిల్స్‌‌ను మరింత సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందంతా ఒకెత్తయితే iOS 18లో అందుబాటులోకి వస్తున్న మరో అదిరిపోయే ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏదన్నా ఉందంటే అది ఫొటోస్ అప్లికేషన్‌ మాత్రమే. ఈ ఫీచర్ ద్వారా ఐఫోన్ యూజర్లు తమ ఫోటోలు, వీడియోలను మరింత పర్‌ఫెక్ట్‌గా మేనేజ్‌ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇష్టమైన ఫోటోలను పిన్ కూడా చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ల కలయిక iOS 18 భద్రత, గోప్యతను మెరుగుపరచడమే కాకుండా iPhone వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుంది.

Tags

Related News

ChatGP: చాట్ జీపీటీతో ఇంట్లో కూర్చొని ఈజీగా డబ్బులు సంపాదించొచ్చు, ఎలాగో తెలుసా?

Amazon Great Indian Festival 2024 Sale: అమెజాన్ న్యూ సేల్ డేట్ ఖరారు.. రూ.38,999లకే ఐఫోన్!

Motorola Edge 50 Neo: ఎడ్జ్ 50 నియో లాంచ్.. ఫీచర్లు మత్తెక్కించాయ్, ఈ ఆఫర్లు మీకోసమే!

Oppo Find X8 series: ఒప్పో దూకుడు.. వరుసగా నాలుగు ఫోన్లు, ఫీచర్లు కెవ్ కేక!

Motorola Edge 50 Neo: మోటో నుంచి కొత్త ఫోన్.. ఊహించని ఫీచర్లు, అద్భుతమైన కెమెరా క్వాలిటీ!

Oppo K Series: సత్తాచాటేందుకు మరో మోడల్ రెడీ.. ఒప్పో నుంచి ఊహించని బడ్జెట్ ఫోన్!

Cheapest Smartphones Under Rs 10000: ఉఫ్ ఉఫ్.. కేవలం రూ.10వేల ధరలోనే 5జీ ఫోన్‌లు, వదిలారో మళ్లీ దొరకవ్!

Big Stories

×