EPAPER

Huge Discounts on Tata EV’s: లక్షకు పైగా డిస్కౌంట్స్.. అట్రాక్ట్ చేస్తున్న టాటా ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

Huge Discounts on Tata EV’s: లక్షకు పైగా డిస్కౌంట్స్.. అట్రాక్ట్ చేస్తున్న టాటా ఆఫర్లు.. ఓ లుక్కేయండి!

Rs 1.35 Lakhs Discounts on Tata Electric Vehicles: టాటా మోటార్స్‌కి భారతీయ మార్కెట్‌లో మంచి పాపులారిటీ ఉంది. పాపులారిటీ అంటే అలాంటి ఇలాంటిది కాదు.. కొత్త కారు వస్తుందంటే ముందుగానే బుకింగ్స్ ఫుల్ అయిపోయేంత పాపులారిటీ. మరి ఇంత పాపులారిటీ ఉన్నా.. టాటా మోటార్స్ మాత్రం తమ వాహన ప్రియులకు తరచూ తన మోడళ్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంటుంది. అందుకు కారణం.. తమ కంపెనీ మరింత మందికి చేరువయ్యేందుకు. అయితే ఇప్పటికే తన మోడళ్లలో ఎన్నో ఆఫర్లను ప్రకటించిన టాటా మోటార్స్.. తాజాగా ఈ నెలలో అంటే జూన్‌లో మరిన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్స్ సహా ఇతర బెనిఫిట్స్‌ను తీసుకువచ్చింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


టాటా మోటార్స్ ఈ జూన్‌లో తన EV లపై ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, కార్పొరేట్ ఆఫర్‌లు, ‘గ్రీన్ బోనస్’తో సహా ఆకర్షణీయమైన ప్రయోజనాలను అందిస్తోంది. కొత్త Nexon EV, Tiago EV, పంచ్ EV కొనుగోలుపై మంచి డిస్కౌంట్ బెనిఫిట్స్ పొందవచ్చు.

Tata Tiago EV discounts June 2024


Tata Tiago EVలోని MY2023 మోడల్‌లు అన్ని వేరియంట్‌లు ఈ నెలలో రూ.95,000 వరకు తగ్గింపులను పొందుతాయి. ఈ తగ్గింపులు గత నెల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. కాగా MY2024 Tiago EV లాంగ్ రేంజ్ వేరియంట్‌లు గత నెలలో రూ.52,000 నుండి రూ.75,000 వరకు విలువైన ప్రయోజనాలతో అందించబడ్డాయి. మిడ్ రేంజ్ వేరియంట్‌లు రూ.60,000 వరకు విలువైన ప్రయోజనాలను అందించాయి. Tiago EV ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 11.89 లక్షల వరకు ఉంది.

Also Read: టాటా మోటార్స్‌కి ఏమైంది.. డిస్కౌంట్ల జాతరే జాతర.. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీ కొనలేరు..!

Tata Nexon EV discounts June 2024

MY2023 Tata Nexon EV ఈ నెలలో (జూన్) రూ.1.35 లక్షల విలువైన ప్రయోజనాలతో అందుబాటులో ఉంది. ఇది MY2024 Nexon EV క్రియేటివ్ + MR వేరియంట్‌పై మినహా అన్నింటిపై రూ. 85,000 వరకు తగ్గింపుతో అందించబడుతుంది. Nexon EV రూ.14.49 లక్షల నుండి రూ.19.49 లక్షల ధర మధ్య ఉంటుంది. మిడ్ రేంజ్ (MR) వెర్షన్ 30kWh బ్యాటరీని అందిస్తోంది. ఇది ARAI ధృవీకరించబడిన 325km మైలేజీని అందిస్తుంది. Nexon EV LR 465km క్లెయిమ్ చేసిన మైలేజీతో పెద్ద 40.5kWh బ్యాటరీని పొందుతుంది.

Tata Punch EV Discounts June 2024

Tata Punch EV ప్రస్తుతం ఈ నెలలో (జూన్) రూ.10,000 వరకు విలువైన ప్రయోజనాలతో అందించబడుతోంది. ఇది ఏ టాటా EVకైనా అతి తక్కువ అని చెప్పొచ్చ. ఈ ఎలక్ట్రిక్ SUV రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అందులో 25kWh యూనిట్ గరిష్టంగా 315km లేదా 35kWh యూనిట్ క్లెయిమ్ చేసిన 421km మైలేజీని అందిస్తుంది. పంచ్ EV ధర రూ. 10.99 లక్షల నుండి రూ. 15.49 లక్షల వరకు ఉంది. అయితే ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ఇండియా ధరలే.

Also Read: Bajaj CNG Bike: వావ్.. ప్రపంచంలోనే తొలి CNG బైక్.. ఇక పెట్రోల్ అక్కర్లేదు!

అయితే ఇక్కడ గుర్తించుకోవలనిసిన విషయం ఏంటంటే.. డిస్కౌంట్‌లు నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి. అంతేకాకుండా స్టాక్ ఉండేంతవరకు మాత్రమే ఈ డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తాయి. పూర్తి వివరాలకు సమీపంలోని షోరూమ్‌లను సంప్రదించాలి.

Tags

Related News

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

iPhone Craze: ఐఫోన్ పిచ్చెక్కిస్తోందా? భారతీయుల స్వేచ్ఛ హరీ.. ఎలాగో తెలుసా?

Onion Export Restrictions: ఉల్లి రైతులకు శుభవార్త.. ఎన్నికల దృష్ట్యా ఎగుమతులపై ఆంక్షలు తొలగించిన కేంద్రం..

Vande Bharat Metro Train: వందే భారత్ ‘మెట్రో రైల్’ వచ్చేస్తోంది.. టికెట్ రేట్ మరీ అంత తక్కువా?

Govt Schemes Interest rate up to 8.2%: అత్యధిక వడ్డీ చెల్లించే ప్రభుత్వ పథకాలివే.. పెట్టుబడి పూర్తిగా సురక్షితం..

Gold and Silver Price: బంగారంతో పోటీ పడుతున్న వెండి.. మళ్లీ లక్షకు చేరువలో.. ఇలాగైతే కొనేదెలా ?

Zomato Food Delivery on Train : ఇకపై రైలు ప్రయాణంలోనూ మీకిష్టమైన ఆహారం.. ట్రైన్ లో జొమాటో డెలివరీ!

Big Stories

×