EPAPER

Chandrababu Naidu: చంద్రబాబు చెప్పిన పొలిటికల్ పాలన ఇదేనా..?

Chandrababu Naidu: చంద్రబాబు చెప్పిన పొలిటికల్ పాలన ఇదేనా..?

AP Government Updates: సీఎంగా నారా చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారం కూడా చేయలేదు. బట్ జరగాల్సిన పరిణామాలు జరిగిపోతూనే ఉన్నాయి. నిజానికి ఇవి చాలా కీలక పరిణామాలని చెప్పాలి. జూన్ 4 ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఏపీలో అసలేం జరుగుతుంది? కూటమికి ఏకంగా 164 సీట్లలో గెలిచింది. అందులో ఒక్క టీడీపీ అభ్యర్థులు 135 సీట్లలో విక్టరీ సాధించారు. ఏ క్షణమైతే ఈ రిజల్ట్‌పై ఓ క్లారిటీ వచ్చిందో.. అప్పుడే ఏపీలో మార్పులు మొదలయ్యాయి. సెక్రటేరియట్‌లో తనిఖీలు.. అధికారుల మార్పుపై కసరత్తు.. మంత్రుల చాంబర్లను అత్యంత వేగంగా స్వాధీనం చేసుకోవడం. ఐటీ విభాగంలో సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లను సైతం తనిఖీ చేయడం ఇలా ఇవన్నీ జస్ట్ 24 గంటలలోపే జరిగాయి.


ఆ తర్వాత ఈ పరిణామాలన్ని మరింత స్పీడ్ అయ్యాయి. వీటన్నింటిని చూస్తుంటే చంద్రబాబు చెప్పిన మాటలు అమలవుతున్నట్టు కనిపిస్తుంది. చంద్రబాబు చెప్పిందేంటి.. ఇకపై బ్యూరోకస్రీ పాలన ఉండదు. పొలిటికల్ పాలన ఉంటుందని ఇప్పుడు దీనికి అనుగుణంగానే ఉంది పరిస్థితి.. ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ ఆఫీస్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు.. ఇప్పుడు గనుల శాఖ, రాష్ట్ర ఖనిజాభివృద్ధి శాఖను సీజ్ చేశారు. ఆఫీస్‌లోని అన్ని విభాగాలను పోలీసులు సోదాలు చేసి పూర్తిగా త‌మ‌ స్వాధీనంలోకి తీసుకున్నారు. కీలకమైన ఫైళ్లు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర సమాచారం బయటకు వెళ్లకుండా ఉండేందుకే అన్ని చర్యలు తీసుకుంటన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకునే వరకు ఆఫీసు మూసే ఉండనుంది. దానికి ముందు ఈరెండు సంస్థలకు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా పదవులు నిర్వహిస్త్ఉన్న వెంకట రెడ్డిపై బదిలీ వేటు పడింది..

ఇంతకీ ఈ శాఖలపై ఉన్న ఆరోపణలేంటి? గ‌నుల శాఖ ఆధ్వర్యంలో ఇష్టానుసారంగా బీచ్‌శాండ్‌, బెరైటీస్‌.. ఇసుక, బొగ్గు, ఇతర ఖనిజాల వేలం, టెండర్లు, అమ్మకాలు జ‌రిగాయ‌నేది ఆరోప‌ణ‌లు. వీటన్నింటి వల్ల వేల కోట్ల అవినీతి జరిగిందంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ పెద్దలకు వెంక‌ట‌రెడ్డి భారీగా ల‌బ్ధి చేకూర్చారని చెబుతున్నారు. మరోవైపు ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఎం.మధుసూదనరెడ్డిపై కూడా ప్రభుత్వం వేటు వేసింది. ఆయనకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వకుండా జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్‌లో స్కాం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ స్కామ్‌లో పలువురు మాజీ అధికారులను అరెస్టు చేయించడంతో పాటు చంద్రబాబుపైనా చార్జిషీట్‌ దాఖలు చేశారు. అలాంటి ఈ శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Also Read: నిన్న జవహర్‌రెడ్డి, నేడు ధర్మారెడ్డి, రేపు వాళ్లేనా?

సో.. ఈ పరిణామాలన్ని చూస్తుంటే ప్రమాణస్వీకారం చేసే లోపే పరిస్థితులను చక్కపెట్టే పనిలో బిజీగా ఉన్నారు చంద్రబాబు.. ఇప్పటికే సీఎస్‌ను మార్చేశారు.. ముఖ్యమైన శాఖల అధిపతులుగా ఉన్న ఐఏఎస్‌ల పనితీరుపై రివ్యూ జరుగుతోంది. నిజానికి మనం ముందుగానే చెప్పుకున్నాం.. కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల పదవులకు చెక్‌ పడబోతుందని.. అయితే ఈ విషయాలను చంద్రబాబు డైరెక్ట్‌గా చేయడం లేదు. నిజానికి ఆయనకు ఎలాంటి పవర్స్‌ కూడా లేవు.. ప్రస్తుతానికి కానీ పనులు మాత్రం జరిగిపోవడం ఇక్కడ హైలేట్.. ప్రస్తుత పరిణిమాలు చూస్తుంటే త్వరలోనే సీఐడీ, ఇంటెలిజెన్స్‌లో కూడా అధికారులకు బదిలీలు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే సీఐడీ చీఫ్‌ సంజయ్.. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్‌ PSR ఆంజనేయులు.. సీనియర్ ఐపీఎస్‌ ఆఫీసర్ కొల్లి రఘురామిరెడ్డి.. ఇలా కీలక పదవుల్లో ఉన్న అధికారులు చంద్రబాబును కలిసేందుకు ఆయన ఇంటికి వచ్చినప్పుడు వారేవ్వరికి కూడా అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు చంద్రబాబు.. సో.. ఇది వారు ప్రస్తుతం కొనసాగుతున్న పోస్టులు ఊస్టింగ్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని చెప్పకనే చెబుతోంది.

ఇప్పటికే ప్రభుత్వ సలహాదారులను తప్పించేశారు. టీచర్ల బదిలీలకు బ్రేక్ పడింది. మంత్రుల చాంబర్లను స్వాధీనం చేసుకున్నారు. నేమ్ బోర్డులను తొలగించారు. సో మార్పు అనుకున్నదానికంటే వేగంగా కొనసాగుతోంది అనేది క్లియర్‌ కట్‌గా అర్థమవుతోంది. మరి చంద్రబాబు పొలిటికల్ పాలన ఎలా ఉంటుందనేది ఇప్పటికే కొంచెం కొంచెంగా అర్థమవుతోంది. మరి ఇది ముందు ముందు ఇంకేలా ఉంటుందో చూడాలి మరి.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×