EPAPER

Samsung Galaxy S23 Mobile: 8GB ర్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫోన్‌పై రూ.40 వేల డిస్కౌంట్‌.. ఈ సరుకు వదలకండి..!

Samsung Galaxy S23 Mobile: 8GB ర్యామ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ ఫోన్‌పై రూ.40 వేల డిస్కౌంట్‌.. ఈ సరుకు వదలకండి..!

Rs 40,000 Discount on Samsung Galaxy S23: తక్కువ ధరలో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుక్కోవాలనుకుంటే ఇదే బెస్ట్ ఛాన్స్. ఎందుకంటే మీరు ఊహించని డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ డిస్కౌంట్‌తో సగం ధరకే కొత్త ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనేయొచ్చు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy S23 ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తుంది. అదిరిపోయే ఫీచర్లతో మంచి Samsung ఫోన్ కొనాలనుకుంటే ఇది చాలా మంచి అవకాశం. Flipkartలో 8GB RAM + 128GB స్టోరేజ్ గల Galaxy S23 ఫోన్‌ను డిస్కౌంట్ ఆఫర్లతో ఊహించని ధరకు కొనుక్కోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ల గురించి తెలుసుకుందాం.


Samsung Galaxy S23 Offers

Samsung Galaxy S23 స్మార్ట్‌ఫోన్ అసలు ధర ఫ్లిప్‌కార్ట్‌లో రూ.89,999లకి ఉంది. అయితే ఇప్పుడు 44 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.49,999లకే లిస్ట్ అయింది. అంటే ఏకంగా రూ.40,000 భారీ డిస్కౌంట్ లభిస్తుందన్నమాట. దీంతోపాటు శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్లను పొందొచ్చు. Samsung యాక్సిస్ బ్యాంక్ ఇన్ఫినిట్ క్రెడిట్ కార్డ్, Samsung Axis బ్యాంక్ సిగ్నేచర్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం తగ్గింపు ఉంది.


ఈ బ్యాంక్ ఆఫర్‌తో మరింత తక్కువకు కొనుక్కోవచ్చు. అలాగే నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఉంది. ఫ్లిప్‌కార్ట్ పేజీ ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ కోసం నో-కాస్ట్ EMI నెలకు రూ.5,556 నుండి ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. ఏకంగా రూ.47,100 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ డిస్కౌంట్‌తో రూ.2899కే కొనుక్కోవచ్చు. అయితే ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ పొందాలంటే పాత ఫోన్ మంచి కండీషన్‌లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇంతపెద్ద మొత్తంలో డిస్కౌంట్ పొందుతారు.

Also Read: దీనవ్వ తగ్గేదే లే.. యూత్ అట్రాక్షన్ స్మార్ట్‌ఫోన్ రెడీ.. కెమెరాలో తోపు..!

Samsung Galaxy S23 Specifications

Samsung Galaxy S23 ఫోన్ లావెండర్, గ్రీన్, ఫాంటమ్ బ్లాక్, క్రీమ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో Qualcomm Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంది. కెమెరా గురించి చెప్పాలంటే.. 50MP ప్రధాన కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా, OIS, 3X ఆప్టికల్ జూమ్‌తో కూడిన 10MP టెలిఫోటో కెమెరా వెనుక అందించబడ్డాయి. అలాగే సెల్ఫీ కోసం ఫోన్ ముందు భాగంలో 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది రాత్రి సమయంలో కూడా మంచి ఫోటోలను తీయగలదు. ఇందులో 6.1 అంగుళాల FHD+ స్క్రీన్ ఉంది. దీని రిజల్యూషన్ 1080×2340 పిక్సెల్‌లు. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1750 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ఫోన్ 3900 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 25W ఫాస్ట్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×