EPAPER

Sri Reddy Suggestion to Jagan: శ్రీరెడ్డి సూచన, జగనన్నా వాళ్లకి మనకి అదే.. ఎన్నారై వింగ్ కూడా..!

Sri Reddy Suggestion to Jagan: శ్రీరెడ్డి సూచన, జగనన్నా వాళ్లకి మనకి అదే.. ఎన్నారై వింగ్ కూడా..!

Sri Reddy Suggestion to Jagan: నటి శ్రీరెడ్డి రూటు మార్చిందా..? మొన్నటి వరకు టీడీపీపై విరుచుకుపడే ఆమె, తన వాయిస్ మార్చుకున్న ట్లు కనిపిస్తోందా..? ఈసారి ఎన్నికల్లో వైసీపీ ఫెయిల్ అయ్యిందా..? ముమ్మాటికీ అవుననే అంటోంది శ్రీరెడ్డి. వైసీపీ చాలా విషయాల్లో వీక్‌గా ఉందని వివరించింది. ఈ విషయంలో చంద్రబాబు, ఆయన కార్యకర్తలను చూసి సిగ్గుకోవాలంది శ్రీరెడ్డి. ఇంతకీ ఆమెలో వచ్చిన ఈ మార్పుకు కారణమేంటని చర్చించుకోవడం వైసీపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ వంతైంది.


కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు జగన్. అదే ఊపుతో 2019 ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా రికార్డు స్థాయిలో 151 సీట్లను గెలుచుకుంది వైసీపీ. ఈసారి సంక్షేమ పథకాలతో తాము గట్టెక్కించవచ్చని భావించింది. వైసీపీని పదేళ్లపాటు మోసిన కార్యకర్తలను దూరం పెట్టేశారు. దాని ఫలితంగా ఈసారి ఎన్నికల్లో 11 సీట్లు ఇచ్చారు. ఇదంతా ప్రజలు రాసిన స్క్రిప్ట్. ఈసారి ఎన్నికల్లో కార్యకర్తలను దూరం పెట్టేశారు జగన్.

ఈసారి ఎన్నికల్లో వాలంటీర్లు, ఐప్యాక్, దేవుడు, ఓటర్లను మాత్రమే నమ్ముకున్నారు జగన్. ఫలితం తారుమారైంది. దీనిపై నటి శ్రీరెడ్డి మనసులోని ఆవేదనను వ్యక్తంచేసింది. ఈ విషయంలో తాను చెప్పింది జగనన్నా కచ్చితంగా వినాలని రిక్వెస్ట్ చేసింది. టీడీపీ పవర్ గురించి వివరించిందామె. ముఖ్యనేతలు పార్టీని వదిలిపెట్టినా ఆ పార్టీ పట్టించుకోలేదని వెల్లడించింది.


Also Read: విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం, ఎల్పీ నేత ఎంపిక, ఆపై..

టీడీపీ కేవలం కార్యకర్తలను మాత్రమే నమ్ముకుందని తెలిపింది. మళ్లీ నిలబడదామని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని, ఐ టీడీపీ ఎంత స్ట్రాంగ్ మీకు తెలుసా అని ప్రశ్నలు రైజ్ చేశారామె. వాళ్ల దగ్గరున్న టెక్నాలజీ దేశంలోని ఎవరి దగ్గరా లేదని శ్రీరెడ్డి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

ఇక వైసీపీ ఎన్ఆర్ఐ వింగ్ అమెరికా, ఆస్ట్రేలియా విభాగాల నేతలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు. పదేళ్ల పాటు పార్టీని నిలబెట్టిన కార్యకర్తలను దూరం చేసుకోవడమే ఈ పరిస్థితికి కారణమన్నారు. కేవలం వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను దూరం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది నాయకుడి లక్షణం కాదని, వైసీపీ నుంచి నేతలు సర్దుకోవడం మంచిందన్నారు. వైఎస్సార్ వారసుడు జగన్ కాదన్నారు. మొత్తానికి జగన్ వ్యవహారశైలిపై ఒకొక్కరు తమ తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

Tags

Related News

Chandrababu: బుడమేరును ఇష్టారాజ్యంగా కబ్జా చేశారు: చంద్రబాబు

Flood Damage: ఏపీలో వరదల వల్ల ఎంత నష్టం వాటిల్లిందంటే..?

Duvvada Issue: దువ్వాడ ఇంటి వద్ద మళ్లీ ఆందోళన.. ఈసారి ఏం జరిగిందంటే?

Huge Rains: విజయవాడలో మరోసారి వర్ష బీభత్సం.. రానున్న 3 రోజులూ ఏపీలో మళ్లీ భారీ వర్షాలు!

Budameru Floods: బుడమేరు గండి పూడ్చివేత పూర్తి .. పరిశీలించిన మంత్రి నారా లోకేశ్..

YCP Target on Pawan Kalyan: మీడియా ముందు నీతి కబుర్లు చెప్పి.. చాటుగా బిల్లులు పెడుతున్నావా పవన్ కళ్యాణ్

CM Chandrababu: తెలుగు ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు.. తెలిపిన ఏపీ సీఎం

Big Stories

×