EPAPER

Kutami MLA’s Meeting in VIjayawada: విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం.. ఎల్పీ నేత ఎంపిక, ఆపై..!

Kutami MLA’s Meeting in VIjayawada: విజయవాడలో కూటమి ఎమ్మెల్యేల సమావేశం.. ఎల్పీ నేత ఎంపిక, ఆపై..!

TDP, JSP, BJP MLA’s Meeting in Vijayawada about MLC: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 12న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేవలం రెండురోజులు మాత్రమే ఉండడంతో గెలిచిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. ఈసారి మంత్రి పదవి ఎవరిని వరించబోతోందన్న చర్చ జోరుగా సాగుతోంది.


సోమవారం సాయంత్రం మోదీ కేబినెట్‌లోని శాఖలు కొలిక్కి రానుంది. ఎవరికి ఏయే శాఖలు ఇస్తారనేది తెలియనుంది. ఆయా శాఖలను పరిశీలించిన తర్వాత చంద్రబాబు తన కేబినెట్‌పై ఫోకస్ పెట్టనున్నారు.
ఇందులోభాగంగా కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలోని కన్వెన్షన్ హాలులో సమావేశం కానున్నారు.

ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరగనున్న ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ భేటీలో ఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. బుధవారం ఉదయం దాదాపు పదకొండున్నర గంటల సమయంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పని లోపనిగా ప్రతిపక్ష నేత ఎంపిక జరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.


వైసీపీకి తగిన మెజార్టీ లేకపోవడంతో జనసేనకు ఆ ఛాన్స్ వచ్చింది. మరి జనసేన నుంచి నలుగురైదుగు రు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం సీఎంతో కలిసి 26 మందికి ఛాన్స్ ఉంది. ఆ లెక్కన కొత్త జిల్లాలు 26 ఉన్నాయి. జిల్లాకు ఒకరికి మంత్రిగా ఛాన్స్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: ఏపీ, నాన్ బ్రాండెడ్ లిక్కర్‌కు బ్రేక్, గోడౌన్లకి కింగ్ ఫిషర్ బీర్లు

టీడీపీ నుంచి సీనియర్లు ఈసారి పదవులు ఆశిస్తున్నారు. ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. అలాగే కొత్త ఎన్నికైన మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. లేదంటే రెండున్నర ఏళ్లకు కేబినెట్‌ను మార్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు. దాదాపుగా 22 మంది మంత్రి పదవులు తీసుకోవాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నమాట. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి ఇవ్వవచ్చని అంటున్నారు. మొత్తం సీట్లలో టీడీపీ-135, జనసేన- 21, వైసీపీ-11, బీజేపీ -8 సీట్లలో గెలుపొందాయి.

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రీ.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×