EPAPER

Central Ministers Departments: మోదీ టీంలో ఏపీ నుండి ముగ్గురు.. మంత్రులకు ఇచ్చేది ఈ శాఖలేనా..?

Central Ministers Departments: మోదీ టీంలో ఏపీ నుండి ముగ్గురు.. మంత్రులకు ఇచ్చేది ఈ శాఖలేనా..?

Central Ministers from Andhra Pradesh: నిన్న ఢిల్లీలో మోడీ మూడో సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో 71 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణం చేశారు. మోడీ టీంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి అవకాశం దక్కింది. రెండు క్యాబినెట్ మంత్రులు, మూడు సహాయ మంత్రులుగా చోటు దక్కించుకున్నారు. ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రులుగా అవకాశం కల్పించారు. ఏపీ నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస్ వర్మ.. తెలంగాణ నుంచి బండి సంజయ్ సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు.


కీలక శాఖలను బీజేపీ తన దగ్గరే ఉంచుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడుకు కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ఇచ్చే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు కూడా ఈ శాఖ తమకు కావాలని అడినట్టు తెలుస్తోంది. అర్బన్ డెవలప్ మెంట్ మంత్రిత్వ శాఖ సాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి, అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేసే వీలుంటుందని చంద్రబాబు భావిస్తున్నారు.

Also Read: చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజునుంచేనా ఏపీలో మహిళలకు ఫ్రీ బస్సు..?


ఇక.. గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌కు వాటర్ రిసోర్స్ సహాయ మంత్రిత్వ శాఖ కేటాయించనున్నారు. వాటర్ రిసోర్స్ సహాయ మంత్రిత్వ శాఖ సాయంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయొచ్చని టీడీపీ అధినేత భావిస్తున్నారు. నరసాపురం నుంచి గెలిచిన బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిత్వ శాఖ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకునే బీజేపీ అధిష్టానం ఆయనకు ఈ శాఖను కేటాయించినట్టు తెలుస్తోంది.

Tags

Related News

Kadambari Jethwani: బట్టబయలైన కుట్ర.. ఏపీ పోలీసులు నటి జత్వానీని అందుకే అరెస్టు చేశారంటా!

Choreographer: జానీ మాస్టర్ పై పవన్ కళ్యాణ్ యాక్షన్

Alluri Sitharama Raju district: అంబులెన్స్ వెళ్లేందుకు దారిలేక విద్యార్థిని మృతి.. డోలీపై మోసుకెళ్లినా దక్కని ప్రాణం

Tdp office attack case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. ఆ మూడే సమాధానాలు, అదుర్స్ మూవీని తలపిస్తోందా?

Fire Accident: అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం..

IPS Secret Operation Fail: ముంబై నటి కేసు.. లాజిక్ మిస్సయిన ఐపీఎస్‌లు, గత ప్రభుత్వం చుట్టూ ఉచ్చు

Kadambari Jethwani: జత్వానీ కేసులో మరో ముగ్గురు ఐపీఎస్‌లపై వేటు

Big Stories

×