EPAPER

Kishan Reddy, Bandi in Union Cabinet: మోడీ క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికీ అవకాశం.. మరి శాఖల మాటేంటి..?

Kishan Reddy, Bandi in Union Cabinet: మోడీ క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరికీ అవకాశం.. మరి శాఖల మాటేంటి..?

Kishan, Bandi Sanjay are in Union Cabinet from Telangana: ప్రధాని నరేంద్రమోడీ కొత్త కేబినెట్‌లో చాలామంది సీనియర్లను పక్కన బెట్టారు. కొత్తగా కొంతమందిని మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకున్నారు. త్వరలో బీహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు పెద్ద పీఠ వేసినట్టు కనిపిస్తోంది.


తెలంగాణ నుంచి ఈసారి సీనియర్ నేతలకు అదృష్టం వరించింది. ఒకరు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కాగా, మరొకరు బండి సంజయ్. చాలామంది సీనియర్లను పక్కన పెట్టిన బీజేపీ హైకమాండ్, పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి మళ్లీ ఛాన్స్ ఇచ్చారు. గతంలో మాట ఇచ్చిన ప్రకారం బండి సంజయ్‌ని కొత్తగా కేబినెట్‌లోకి తీసుకొచ్చారు.

తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి  తీసుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కి ఎలాంటి శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కిషన్‌రెడ్డి ప్రాధాన్యత లేని శాఖ ఇచ్చారని తెలంగాణ కమలం పార్టీ నేతలు నొచ్చుకున్నారు. ఈసారి ఇద్దర్ని మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఎలాంటి శాఖలు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.


Also Read: మోదీ ప్రమాణ స్వీకారానికి కేసీఆర్ వెళ్తారా? లేకపోతే..

అంతేకాదు ఏపీలోని ఇద్దరు టీడీపీ ఎంపీలతోపాటు ఓ బీజేపీ నేతకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకునే శాఖలు ఇస్తారా? బొగ్గు, విద్యుత్ వంటి శాఖలతో మమ అనిపిస్తారా? అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది.

ఇప్పుడేకాదు.. ఉమ్మడి ఏపీలో కూడా పెద్దగా ప్రయార్టీ లేని శాఖలు కేంద్రంలోని కొలువుదీరిన ప్రభుత్వాలు ఇచ్చేవి. మూడోసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటుకు ఏపీతోపాటు తెలంగాణలు కీలకపాత్ర పోషించాయి. అంతేకాదు ఏకంగా 29 మంది ఎంపీలు గెలిచారు. మరి నేతలు చెప్పుకోవడానికి బలమైన శాఖలు ఇస్తారా? లేదా అన్నది కొద్దిగంటల్లో తేలిపోనుంది.

Tags

Related News

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Ys jagan: బాబుపై జగన్ వెటకారం..కాస్త ఎక్కువైంది గురూ

Tejaswini Nandamuri: బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని గురించి తెలుసా?

Roja: జగన్ పార్టీ నుంచి రోజా జంప్? ఇదిగో ఇలా ప్రత్యక్షమై క్లారిటీ ఇచ్చేశారుగా!

Kondareddypalli:పూర్తి సోలార్ మయంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం

Chitrapuri colony: ఖాజాగూడ చిత్రపురి కమిటీలో 21 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు

Adani group: బంగ్లాదేశ్ జుట్టు ఆదానీ చేతిలో.. అదెలా?

Big Stories

×