EPAPER

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Somireddy Chandramohan Reddy: జాక్ పాట్ కొట్టిన సోమిరెడ్డి.. నెక్ట్స్ ప్లానేంటి..?

Somireddy Chandramohan Reddy Win in ap Election 2024: విజయాల కంటే అపజయాలే ఎక్కువ సార్లు ఆయన్ని పలకరించాయి.. ఏడు సార్లు ఎమ్మెల్యే పోటీ చేస్తే ఆయన గెలిచింది మూడు సార్లే.. వరుసగా నాలుగు సార్లు ఓటమి వెక్కిరించింది. అయినా ఆ రాజకీయం దిగ్గజం భయపడలేదు. ప్రత్యర్ధుల వేధింపులకు బెదరలేదు. నమ్ముకున్న పార్టీలోనే కొనసాగుతూ ఎప్పటికప్పుడు సముచిత గౌరవం పొందుతూనే వచ్చారు. వరుస ఓటములు ఎదురైనా నియోజకవర్గాన్ని వదల్దులేదు. ఎక్కడ ఓడిపోయానో అక్కడే గెలవాలని పట్టుదలతో ఆ మాజీ మంత్రి ఈ సారి ఘన విజయం సాధించారు. మళ్లీ మినిస్టర్ రేసులోకి వచ్చేశారు. ఇంతకీ ఆ సీనియర్ ఎవరంటారా?


పోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి.. టీడీపీలో చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులు 1994లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో రెండో సారి చంద్రబాబు కేబినెట్లో పనిచేశారు. ఇక ఆ తర్వాత 20 ఏళ్ల పాటు ఆయన్ని అదృష్టం వెక్కిరిస్తూనే వచ్చింది. 2004 నుంచి 2019 వరకు సర్వేపల్లి ఓటర్లు ఆయన్ని ఓడిస్తూనే వచ్చారు.

నాలుగు సార్లు వరుస ఓటములు చవిచూసిన సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏనాడు విడిచిపెట్టి మరో నియోజకవర్గానికి వెళ్లడం గాని, పార్టీ మార్చడం గాని చేయలేదు. 2012లో వైసీపీ ఎఫెక్ట్‌తో వచ్చిన ఉప ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు కోవూరు నుంచి పోటీ చేసి నల్లపురెడ్డి ప్రసన్న చేతిలో ఓటమి పాలయ్యారు. తిరిగి 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి ఆయనపై గెలుపొందిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రాజకీయంగా వేధించినా వెనుకంజ వేయలేదు.


Also Read: గల్లా వాట్ నెక్స్ట్? రీ ఎంట్రీ ఎప్పుడు?

2014 ఎన్ని కల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వ్యవసాయ శాఖ కట్టబెట్టి.. సోమిరెడ్డి కమిట్‌మెంట్‌ని గౌరవించారు. విపక్షంలో ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూనే వచ్చారు. పార్టీ రాష్ట్రంలో ఓడినా, గెలిచిన జిల్లా స్థాయిలో ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తూ పార్టీ పట్ల తన నిబద్దత చాటుకున్నారు.

సర్వేపల్లి నియోజకవర్గం లో పవర్ ప్రాజెక్టుల టవర్ల ఏర్పాటుకు పరిహారం కింద రైతులకు లక్ష 50 వేల రూపాయలు ఇవ్వడానికి సిద్దం అయింది. అది అన్యాయం అంటూ రైతుల్లో పెద్ద ఎత్తున చైతన్యం తెచ్చి వారి పక్షాన పోరాటం చేశారు. సోమిరెడ్డి పోరాటాలకి దిగివచ్చిన ట్రాన్స్‌కో.. రైతుల భూముల్లో ఒక టవర్ వేస్తే మూడు లక్షల 60వేల రూపాయల చొప్పున పరిహారం ఇచ్చింది. అలాగే కృష్ణపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ తరలిపోకుండా ఆపాలని ఆయన ఉద్యోగుల పక్షాన చేరి ఆందోళనలతో పోర్ట్ అధికారులపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. కంటైనర్ టెర్మి నల్ తరలిపోతే తాను ముందుండి పోరాటం చేస్తానన్న అప్పటి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాత్రం అది తరలిపోయినా ప్రేక్షక పాత్ర వహించి వ్యతిరేకత మూట గట్టుకున్నారు.

Also Read: Balineni Srinivasa Reddy : బాలినేని జంప్ ? పార్టీ మారేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం ?

పొదలకూరు మండలంలో క్యాడ్జ్ క్వారీలను మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి తవ్వించి సొమ్ము చేసుకుంటున్నారని.. దానికి మైనింగ్ పర్మిషన్ లేదంటూ ఆ ప్రాంత వాసులతో కలిసి సోమిరెడ్డి రెండు రోజులు అక్కడే దీక్ష చేపట్టారు. ప్రభగిరిపట్నం కొండలను తవ్వేస్తుంటే ఇది అన్యాయం అంటూ వెంటనే ఆపాలని పోరాటం చేశారు. వెంకటాచలం మండలంలో మైనింగ్ పర్మిషన్ లేకుండానే గ్రావెల్ తవ్వకాలు జరుగుతుంటే తక్షణం వాటిని ఆపాలని ఆందోళన చేయడమే కాకుండా ఉన్నత అధికారులు చర్యలకు దిగేలా ఉద్యమం నిర్వహించారు.

ఒకవైపు సర్వేపల్లి ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే, పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. అలాగే జిల్లాలో పార్టీ శ్రేణులకి అండగా ఉంటూ.. జిల్లాలో పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని అధికార పార్టీ వల్ల ఇబ్బందులు పడితే అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పేవారు సోమిరెడ్డి.. అధికారం ఉన్నా, లేకపోయినా తాను సర్వేపల్లి ప్రజల వెంటే ఉంటానంటూ తన జీవితం సర్వేపల్లి కి అంకితం అని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో గడపగడపకు వెళ్లి తాను నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని తనను అతి తక్కువ ఓట్లతో ప్రజలు ఓడిస్తున్నారని, ఎందుకో అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: పుష్ప కి శిల్ప స్ట్రోక్.. ఫైర్ అవుతున్న బెట్టింగ్‌బాబులు

2019లో టీడీపీ ఘోర పరాభవం దృష్ట్యా ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్‌ ఇవ్వాలని భావించింది టీడీపీ అధిష్టానం.. ఆ క్రమంలో మూడుసార్లు వరుసగ ఓడిపోయిన వారికి టికెట్‌ ఇవ్వబోమని నారా లోకేశ్‌ ఫ్రకటించారు. దాంతో సోమిరెడ్డి టికెట్‌పై అయోమయం నెలకొంది. తొలి రెండు జాబితాల్లో ఆయన పేరును ప్రకటించలేదు. చంద్రబాబుతో ఉన్న అనుబంధంతో సోమిరెడ్డి కోడలు శృతికి టికెట్‌ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ సోమిరెడ్డి చక్రం తిప్పారు. వైసీపీ అభ్యర్థి కాకాణి ని ఎదుర్కోవాలంటే ఆమె అనుభవం సరిపోదని.. తానైతేనే కరెక్ట్‌ అని అధిష్ఠానానికి నమ్మకం కలిగించారు.

టిక్కెట్ ప్రకటన ఆలస్యమైనా.. టిక్కెట్ తనకే వస్తుందన్న ధైర్యంతో తన ప్రచారాన్ని ఏ రోజు ఆపలేదు. అధికారిక ప్రకటన రాకపోయినా ప్రజల్లోకి వెళ్లి పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రజలకు వివరించారు. టికెట్ కన్ఫామ్ అయ్యాక ఆయన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. తన కుమారుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి రెడ్డి, కుమార్తె సింధు లతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఆయన తగ్గలేదు. ఓటర్ల వద్దకు వెళ్లి తనకు చంద్రబాబు నాయుడు చివరి అవకాశం ఇచ్చారని ఈ ఒక్కసారి తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లు ను ప్రాధేయపడ్డారు.

Also Read: Kodali Nani Comments : పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు కొడాలి నాని విమర్శలు.. ఈ మార్పు దేనికి సంకేతం ?

కుటుంబ సభ్యులు సైతం సోమిరెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ చొచ్చుకుని వెళ్లారు. అధికార పార్టీపై భయంతో ఓటర్లు ఆయన ప్రచారంలో అంతగా పాల్గొనక పోయినా.. ఎన్నికల్లో మాత్రం ఆయనకు ఓటు వేసి ఘనంగా గెలిపించారు. 16,288 ఓట్ల ఆధిక్యంతో సర్వేపల్లిలో సోమిరెడ్డి 20 ఏళ్ల తర్వాత విక్టరీ కొట్టారు. ఓడిపోయినప్పుడే మంత్రి పదవి ఇచ్చిన చంద్రబాబు.. ఈ సారి కూడా ఖచ్చితంగా కేబినెట్‌లోకి తీసుకుని కీలక శాఖ బాధ్యతలు కట్టబెడతారని సోమిరెడ్డి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Kadapa Reddamma: జగన్ అడ్డాలో టీడీపీ అభ్యర్థి విజయం.. కడప రెడ్డమ్మ అంటూ చంద్రబాబు కితాబు!

Jagan Record : ప్రతిపక్ష హోదా పోగొట్టుకుని జగన్ రికార్డ్.. టీమ్ 11 ఆడుదాం ఆంధ్ర

BIG TV Exit Polls Survey: జనం నాడి పట్టుకున్న బిగ్ టీవీ ఎగ్జిట్ పోల్స్.. ఆ పార్టీ నేతల్లో వణుకు

Nellore Constituency: నెల్లూరు లో షాకింగ్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

Chandrababu Majority In Kuppam: కుప్పంలో చంద్రబాబు మెజార్టీ ఎంతంటే..?

Tough Fight In Vizag: బొత్స ఝాన్సీని ఢీకొట్టే సత్తా.. బాలయ్య అల్లుడు శ్రీ భరత్ కి ఉందా..

×