EPAPER

IND Vs PAK Match Weather Report: ఇండో-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి..

IND Vs PAK Match Weather Report: ఇండో-పాక్ మ్యాచ్ కు వర్షం అడ్డంకి..

Rain Threat Over India Vs Pakistan Match: అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి గా మారనుందనే వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. టీ 20 ప్రపంచకప్ లో జరగనున్న మ్యాచ్ లన్నీ ఒకెత్తు-ఈ ఒక్క మ్యాచ్ ఒక ఎత్తు అని అందరూ అనుకుంటుంటే, వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది.


ఆదివారం నాడు (జూన్ 9) జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే న్యూయార్క్ లో టిక్కెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. బ్లాక్ లో కూడా లక్షల రూపాయలు పెట్టి అభిమానులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో న్యూయార్క్ లోని ఆక్యూ వెదర్ రిపోర్ట్.. తాజా వార్త చెప్పడంతో అభిమానులందరూ హతాశయులవుతున్నారు.

భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అమెరికాలో అయితే ఉదయం 10.30కు ప్రారంభం అవుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే, ఇరుజట్లకు చెరొక పాయింట్ కేటాయిస్తారు.


Also Read: Jasprit Bumrah Bowling : అట్లుంటది.. మనోడితోని..! : గేమ్ ఛేంజర్ అతడే!

ఇప్పటికే టీమ్ ఇండియా ఒక మ్యాచ్ గెలిచింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకపక్షంగా విజయం సాధించిన టీమ్ ఇండియా కొత్త ఉత్సాహంతో పాకిస్తాన్ తో మ్యాచ్ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓటమిపాలైంది. వారు కసితో ఆడేందుకు రెడీ అవుతున్నారు. ఎందుకంటే యూఎస్ఏతో ఓటమిని, ఇండియాపై గెలిచి తీర్చుకోవాలని చూస్తున్నారు.

ప్రస్తుతం టీ 20 ప్రపంచకప్ లో వర్షం వల్ల ఇంగ్లండ్ వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ రద్దు అయ్యింది. ఆ ఒక్క మ్యాచ్ తప్ప, మరో మ్యాచ్ కి వర్షం ఆటంకం కలిగించలేదు. అందువల్ల అభిమానులు అందరూ ధైర్యంగానే ఉన్నారు. అలాంటిదేమీ జరగదు, అలాంటిదేమీ జరగదు…అని మనసుకు సర్దిచెప్పుకుంటున్నారు. ఎవరైనా నెట్టింట్లో పోస్టులు పెడితే సీరియస్ అవుతున్నారు.

Also Read: తీవ్ర ఒత్తిడిలో పాకిస్తాన్.. భారత్‌కు పోటీ ఇస్తుందా?

మరోవైపు బెట్టింగు రాయుళ్లు కంగారు పడుతున్నారు. ఇప్పటికే కోట్ల రూపాయల బెట్టింగులకు రంగం సిద్ధమైపోయింది. ఎందుకంటే ఏ మ్యాచ్ కి లేనంత హైఓల్టేజ్ ఇండియా-పాక్ మ్యాచ్ కే ఉంటుంది. ప్రతి ఓవర్ కి బెట్టింగు జరుగుతుంటుంది. సిక్సు, ఫోర్లు, వికెట్లు ఇలా ప్రతీ అంశంలో బెట్టింగ్ బాల్ టు బాల్ కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. అందువల్ల అందరూ మ్యాచ్ కోసం టెన్షన్ టెన్షన్ గా చూస్తున్నారు.

నిజానికి ఇండియా-పాక్ మ్యాచ్ అంటే రెండు క్రికెట్ జట్ల మధ్య కాదు రెండు దేశాల మధ్య పోటీ అన్నట్టు ఫీలవుతారు. అందుకనే వరుణదేవుడికి అప్పుడే అందరూ దండాలు పెడుతున్నారు. మొక్కులు కూడా మొక్కుతున్నారు. మ్యాచ్ సక్రమంగా జరిగేలా చూడమని వేడుకుంటున్నారు.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×