EPAPER

Upcoming Smartphones: సాయిరామ్.. ఒప్పో, రెడ్‌మీ నుంచి కుప్పలు కుప్పలుగా ఫోన్లు.. మెంటల్ ఎక్కిపోద్ది!

Upcoming Smartphones: సాయిరామ్.. ఒప్పో, రెడ్‌మీ నుంచి కుప్పలు కుప్పలుగా ఫోన్లు.. మెంటల్ ఎక్కిపోద్ది!

Upcoming Smartphones in June: దేశీయ టెక్ మార్కెట్‌లో స్మార్ట్‌ఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే జూన్ నెల రానున్న రోజుల్లో కొత్తకొత్త ఫోన్‌లు కుప్పలు కుప్పలుగా రాబోతున్నాయి. వీటి కారణంగా మార్కెట్‌లో ఒక్కసారిగా కొనుగోలుదారులతో బిజిబిజీగా మారనుంది. Xiaomi, Oppo తమ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో లాంచ్ చేయనుండగా హానర్ కొత్త ఫ్లిప్ స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లిస్ట్‌లో ఏ మోడల్‌లు ఉన్నాయి. వాటి ధరలు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.


Xiaomi 14 Civi
Xiaomi 14 Civi జూన్ 12న భారతదేశంలో లాంచ్ కానుంది. ఇది వచ్చే వారం బుధవారం భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రానుంది. ఇది Xiaomi Civi 4 Pro రీబ్రాండెడ్ మోడల్. ఈ స్మార్ట్‌ఫోన్‌కు Qualcomm Snapdragon 8s Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్ మెయిన్ అట్రాక్షన్‌గా నిలిస్తుంది. ఇందులో లైకా కెమెరాను కంపెనీ తీసుకురానుంది.

Xiaomi 14 Civiలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ 2X టెలిఫోటో షూటర్ కూడా ఉంటుంది. మూడవ సెన్సార్ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్‌గా ఉంటుంది. కంపెనీ సెల్ఫీ కోసం రెండు 32 మెగాపిక్సెల్ కెమెరాలను తీసుకురానుంది. ఇందులోని మెయిన్ సెన్సార్ 32MP ఆటోఫోకస్ లెన్స్. సెకండరీ కెమెరా 32MP అల్ట్రావైడ్ కెమెరాగా ఉంటుంది. ఈ ఫోన్ ధర దాదాపు రూ.50 వేలు ఉంటుందని సమాచారం.


Also Read: బ్లాక్ బస్టర్ డీల్.. సామ్‌సంగ్ 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. లూట్ రా మావా బ్రో!

Oppo F27 Pro Plus
Oppo F27 Pro Plus జూన్ 13న ఇండియాలో లాంచ్ అవుతుంది. వచ్చే గురువారం దీన్ని కంపెనీ విడుదల చేయనుంది. ఈ ఫోన్ Oppo A3 Pro రీబ్రాండెడ్ వెర్షన్‌గా రానుంది. ఫోన్‌లో 6.7 అంగుళాల FullHD ప్లస్ OLED ప్యానెల్ ఉంటుంది. కర్వ్ డిజైన్ డిస్‌ప్లేలో కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో రాబోతోంది. కంపెనీ IP69 రేటింగ్‌ సపోర్ట్‌తో ఫోన్‌ను తీసుకురానుంది. దేశంలో ఈ రేటింగ్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే.

Oppo F27 Pro Plus స్మార్ట్‌ఫోన్‌లో 64MP బ్యాక్ మెయిన్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీతో రావచ్చు. దీనితో కంపెనీ 67W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్‌ను అందిస్తోంది. ఇది వైర్డు ఛార్జింగ్ ఫీచర్ అవుతుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ గురించి ఇంకా సమాచారం అందుబాటులో లేదు.

Also Read: భయ్యా ఇదేంది భయ్యా.. ఐఫోన్లు, వన్‌ప్లస్ ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లు.. రచ్చ రచ్చే!

Honor Magic V Flip
హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ అనేది కంపెనీకి చెందిన ఫ్లిప్ మొబైల్ ఫోన్. ఇది జూన్ 13న చైనాలో లాంచ్ కానుంది. ఇది కంపెనీ మొదటి  క్లామ్‌షెల్ ఫోన్. ఇప్పటివరకు లాంచ్ చేసిన ఫ్లిప్ ఫోన్లలో అతి పెద్ద కవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఫోన్ బ్లాక్, వైట్, రోజ్ వంటి కలర్స్‌లో రానుంది. ఇది 4,800mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.66W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది.

Tags

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×