EPAPER

Ramojirao Produced Movies : సినీ రంగంలో రామోజీరావు మార్క్.. అలాంటి సినిమాలు మళ్లీరావు

Ramojirao Produced Movies : సినీ రంగంలో రామోజీరావు మార్క్.. అలాంటి సినిమాలు మళ్లీరావు

Ramojirao Produced Movies : పాత్రికేయరంగంలోనే కాదు.. సినిమా రంగంలోనూ తనదైన ముద్రవేసిన రామోజీరావు మరణంపై సినీప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. మయూరి సంస్థ ద్వారా ఎన్నో అద్భుత చిత్రాలు నిర్మించటం సహా ఫిల్మ్‌సిటీ ఏర్పాటుతో.. సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారని ఫిలింఛాంబర్‌ సభ్యులు వెల్లడించారు. ప్రతిఘటన, మయూరి, ఆనందం వంటి సినిమాలను నిర్మించారని గుర్తు చేశారు. 2000 సంవత్సరంలో నిర్మించిన నువ్వేకావాలి సినిమాతో ఫిల్మ్‌ఫేర్ అవార్డు కైవసం చేసుకున్నారు.


1984లో సినిమారంగంలో అడుగుపెట్టిన రామోజీరావు.. పలు సందేశాత్మక చిత్రాలు నిర్మించారు. ప్రేమ కథాంశంగా తెరకెక్కిన శ్రీవారికి ప్రేమలేఖ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. కథాపరంగానే కాకుండా మ్యూజికల్ హిట్‌ను తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చింది. తర్వాత కాలంలో వచ్చిన ప్రతిఘటన.. మహిళ శక్తిని చాటి చెప్పింది. ఆ సినిమాలో ఈ దుర్యోదన దుశ్శాసన అనే పాటలో యువతకు మెసేజ్‌ ఇచ్చారు. ఆడది అంటే ఆటబొమ్మ కాదని.. అమ్మదనంలోకి గొప్పతనాన్ని చక్కగా వివరించారు.

నిజజీవితం ఆధారంగా మయూరి పేరుతో తెరకెక్కించిన మయూరి చిత్రం.. ఘనవిజయం సాధించింది. సుధాచంద్రన్ కథాంశాన్ని తెరకెక్కిన సినిమాలో.. ఆమెనే హీరోయిన్‌గా నటింపజేశారు. కాళ్లు పోగొట్టుకున్న యువతి.. నాట్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎదిగిన విధానాన్ని అందులో చూపించారు. తర్వాత కాలంలో ప్రేమించు.. పెళ్లాడు, ఓ భార్య కథ వంటి హాస్య సినిమాలు అలరించాయి.


Also Read : దేశంలోనే ప్రథమం.. అధికార లాంఛనాలతో రామోజీ అంత్యక్రియలు..

మౌనపోరాటం సినిమాతో సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొన్ని అంశాలను చూపిస్తూ.. మహిళల పోరాటాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు తీయటంలో రామోజీరావు ధైర్యాన్ని మెచ్చుకోవాలి. లాభంతో పనిలేకుండా.. సందేశాత్మక చిత్రాలు తీయటంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నారు. ఓ వైపు మెసేజ్ ఓరియంట్ సినిమాలు తీస్తూనే.. కుటుంబ కథాంశాల సినిమాలనూ ఆయన నిర్మించారు. జడ్జిమెంట్, మనసు మమత, అమ్మ సినిమాలు ఈ కోవలోకే వస్తాయి.

అశ్వని నాచప్ప కథాంశాన్ని ప్రజలకు తెలిపేలా అశ్విని సినిమాను రామోజీరావు తెరకెక్కించారు. పీపుల్స్ ఎన్‌కౌంటర్ వంటి విప్లవాత్మక చిత్రాల ద్వారా వైవిధ్యం చూపించారు. చిత్రం, నువ్వే కావాలి సినిమాలు కథాంశంతో పాటు మ్యూజికల్‌ గానూ సూపర్ హిట్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను హీరోగా పరిచయం చేస్తూ నిన్ను చూడాలని సినిమా తెరకెక్కగా తర్వాతకాలంలో ఆయన.. జాతీయస్థాయి నటుడిగా ఎదిగారు.

ఆకాశ వీధిలో, ఆనందం, ఇష్టం, ఒక రాజు-ఒక రాణి, నచ్చావులే, నిన్ను కలిశాక.. బెట్టింగ్ బంగార్రాజు బీరువా, దాగుడుమూతలు దండాకోర్ వంటి సినిమాలు.. నిర్మాతగా రామోజీరావులోని ప్రత్యేకతను బయటపెట్టాయనటం అతిశయోక్తి కాదు. ఆయన చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గాను రేపు సినిమా షూటింగ్‌లకు సెలవు ప్రకటించినట్లు ఫిలిం చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ప్రకటించారు.

Tags

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×