EPAPER

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Fire Accident in delhi(Telugu news live today): దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఓ ఫ్యాక్టరీలో శనివారం అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు.


నరేలా ఇండస్ట్రియల్ ఏరియాలోని ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీలో చిక్కుకున్న మొత్తం తొమ్మిది మందిని రక్షించారు.

ఫ్యాక్టరీ యజమానులు అంకిత్, విజయ్ గుప్తా అని పోలీసులు తెలిపారు. వారు రోహిణి ఏరియాలో నివాసం ఉంటున్నారని అన్నారు. ఫ్యాక్టరీలో గ్యాస్ పైప్ లైన్ లీక్ కావడంతో ప్రమాద జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ యజమానులపై పోలీసులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.


Also Read: జమ్ముకశ్మీర్ లో కాల్పులు.. ఒకరు మృతి, సరిహద్దులకు బలగాలు

ఢిల్లీలో మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పి వేస్తున్నాయి. ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

 

Tags

Related News

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Amethi Family Murder: అమేఠీలో కుటుంబాన్ని హత్య చేసిన సైకో.. హత్యకు ముందే పోలీసులకు సమాచారం… అయినా..

Haryana Elections: హర్యానాలో పోలింగ్ మొదలు.. ఆ పార్టీల మధ్యే ప్రధాన పోటీ, ఫలితాలు ఎప్పుడంటే?

Toilet Tax: ఆ రాష్ట్రంలో టాయిలెట్ ట్యాక్స్ అమలు.. ఇది చెత్త పన్ను కంటే చెత్త నిర్ణయం!

×