EPAPER

Alzheimers: ఛీ, ఛీ.. ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా

Alzheimers: ఛీ, ఛీ.. ముక్కులో వేలు పెట్టుకుంటున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా

Alzheimers: తరచూ చేతులతో ఏదో ఒక పని చేయడం అలవాటుగా ఉంటుంది. చేతులు ఖాళీగా ఉంటే చాలా మంది దురద వస్తే గొక్కోవడం, లేదా ముక్కులో వేళ్లు పెట్టడం వంటివి చేస్తుంటారు. అయితే ఏం చేసినా సరే కానీ ముక్కులో వేళ్లు పెట్టుకోవడం మాత్రం చూసే వారికి కూడా నచ్చదు. చూసే ప్రతీ ఒక్కరికీ ముక్కులో వేలు పెట్టుకోవడం చూసి ఛీ అంటుంటారు. దీనిని అమర్యాదగా కూడా భావిస్తారు. ముఖ్యంగా పబ్లిక్ లో ఉన్న సమయంలో ఇలా చేస్తే చాలా మంది చిరాకు పడుతుంటారు. అయితే ఇది కేవలం ఇలాంటి సమస్యే కాదని, దీని వల్ల ఆరోగ్యానికి కూడా ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు కారణంగా అల్జీమర్స్ వంటి వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఇటీవల ఓ పరిశోధనలో తేలింది. తాజాగా ఎలుకలపై నిర్వహించిన ఒక అధ్యయనంలో ముక్కు ద్వారా మెదడుకు సాధారణ బ్యాక్టీరియా అయిన క్లామిడియా న్యుమోనియా చేరుతుంది. ఈ మేరకు గిఫ్రిత్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇవి అల్జీమర్స్ వ్యాధికి సంబంధించిన లక్షణాలుగా పరిశోధకులు వెల్లడించారు. ఈ బ్యాక్టీరియాను ఘ్రాణ నాడి ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుందని తెలిపారు.

క్లామిడియా న్యుమోనియా సోకితే ఎలుకల మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రోటీన్ పేరుకుపోయిందని అధ్యయనంలో తేలింది. ఇది అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన లక్షణంగా పరిశోధకులు పేర్కొన్నారు. ముక్కు లోపల ఉండే గాయాల కారణంగా ఈ బ్యాక్టీరియా మెదడుకు వేగంగా వ్యాపిస్తుందని తెలిపారు. అయితే ఇది కేవలం ప్రారంభ దశలోని తేలిందని అన్నారు. ఈ మేరకు ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల మనుషుల్లోను ఈ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ క్రమంలో మనుషులు జాగ్రత్తగా ఉండాలని అన్నారు.


Tags

Related News

Panasa Curry: ఆవపెట్టిన పనస కూర ఇలా వండారంటే ఆ రుచికి ఎవరైనా దాసోహమే, రెసిపీ తెలుసుకోండి

Hibiscus Hair Mask: మందారంలో వీటిని కలిపి ఈ హెయిర్ మాస్క్ ట్రై చేశారంటే.. పట్టులాంటి జుట్టు మీ సొంతం

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

×