EPAPER

Movie Shootings Cancelled : రామోజీరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం.. రేపు సినిమా షూటింగ్‌లు బంద్

Movie Shootings Cancelled : రామోజీరావు మృతిపై సినీ ప్రముఖుల సంతాపం.. రేపు సినిమా షూటింగ్‌లు బంద్

Ramoji Rao death news(Celebrity news today): ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) ఇవాళ కన్నుమూశారు. ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హాస్పిటల్‌లో చేర్చారు. అయితే అక్కడ ట్రీట్మెంట్ పొందుతూ.. ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా జూ.ఎన్టీఆర్ సోషల్ మీడియా ద్వారా తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.


రామోజీరావు మృతిపై సంతాపం తెలుపుతూ.. రేపు అనగా ఆదివారం (జూన్ 9)న సినిమా షూటింగ్‌లు నిలిపివేయాలని ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయించింది.

ఎన్టీఆర్


మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. ఆయన మన మధ్య ఇక లేరనేది ఆలోచిస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ‘నిన్ను చూడాలని’ సినిమాతో తనను సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మరవలేను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటే.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చిరంజీవి

ఎన్టీఆర్‌తో పాటు రామోజీరావు అస్తమయంపై మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగింది.. ఓం శాంతి అంటూ తన ట్విట్టర్ (ఎక్స్)లో సంతాపం వ్యక్తం చేశారు.

ఎస్ ఎస్ రాజమౌళి

ఫిల్మ్ సిటీలోని నివాసంలో ఉంచిన రామోజీరావు భౌతిక కాయానికి టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కన్నీటి నివాళి అర్పించారు. ఎంతోమంది కళాకారులకు ఆయన జీవితాన్నిచ్చారని కొనియాడారు. సినీరంగంలో ఆయన అందించిన విశేష సేవలకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ టీం

రామోజీరావు మృతిపై రామ్ చరణ్ అండ్ ‘గేమ్ ఛేంజర్’ టీం సంతాపం వ్యక్తం చేసింది.

రజనీకాంత్

నా గురువు, శ్రేయోభిలాషి రామోజీ రావు మరణవార్త విని నేను చాలా బాధపడ్డాను. జర్నలిజం, సినిమా, రాజకీయాల్లో గొప్ప కింగ్‌మేకర్‌గా చరిత్ర సృష్టించిన వ్యక్తి ఆయన. అతను నా జీవితంలో నాకు మార్గదర్శకుడు, ప్రేరణ. అతని ఆత్మకు శాంతి కలుగుగాక.

నటుడు పృథ్వీ

అలాగే సినీ నటుడు పృథ్వీ రామోజీరావు మృతిపై సంతాపం తెలిపారు. ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు స్వర్గస్థులయ్యారు. చాలా బాధాకరం. వారి సంస్థలో ఈటీవీలో భాగవతం సీరియల్‌లో 9 ఏళ్లు పనిచేశాను. వారు మాకు భోజనం పెట్టినటువంటి మహాను భావుడు. అటువంటి మహానుభావుడు ఎంతోమంది టెక్నీషియన్లకు మంచి అవకాశం ఇచ్చి.. వారి జీవితాలను నిలిబెట్టినటువంటి వ్యక్తి రామోజీరావు లేరు అనే వార్త నిజంగా చాలా బాధకలిగించింది. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.

ఎంఎం కీరవాణి

నా భార్య అంటుంటది.. మనిషి అన్నవాడు బ్రతికితే రామోజీరావులా ఒక్కరోజు అయినా బ్రతకాలని అని. అలాంటి రామోజీరావును కలవడానికి వెళ్లినపుడు.. మీరు ఆస్కార్ తీసుకురండి అని అనగానే నేను ఆశ్యర్యపోయాను. రామోజీరావు ఆస్కార్‌కు ఇంత వ్యాల్యూ ఇస్తున్నారా.. అంటే దానిలో వ్యాల్యూ ఉందని.. దాన్ని ఎలాగైనా తీసుకురావాలి అనే టెన్షన్ నాలో ఎదురైంది. అయితే ఆస్కార్ అవార్డ్స్ అనౌన్స్ చేసే ముందర.. ఎవరి కోసం కాకపోయినా.. రామోజీరావు కోసం అయినా ఇది రావాలి అని అనుకున్నాను. అది వచ్చింది.. వచ్చిన తర్వాత ఇక మామూలే అని అన్నారు.

పవన్ కల్యాణ్

బహుముఖ ప్రజ్ఞాశాలి రామోజీ రావు అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు.
అక్షర యోధుడు రామోజీ రావు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారని తెలిసాక కోలుకొంటారని భావించాను. రామోజీ రావు ఇక లేరనే వార్త ఆవేదన కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను. రామోజీరావు స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే.

అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. ప్రజా పక్షం వహిస్తూ వాస్తవాలను వెల్లడిస్తూ, జన చైతన్యాన్ని కలిగించారు. వర్తమాన రాజకీయాలపై, పాలన తీరుతెన్నులపై నిష్కర్షగా వార్తలను అందించడమే కాదు.. ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం రామోజీరావు దక్షతను తెలియచేసింది. ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు. పత్రికాధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా, స్టూడియో నిర్వాహకులుగా, వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు.

రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ను వేదికగా చేశారు. మీడియా మొఘల్ గా రామోజీరావు అలుపెరుగని పోరాటం చేశారు. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్ళడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు. అక్షర యోధుడు రామోజీ రావు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలచి వేస్తోంది. ఆయన స్పూర్తిని నవతరం పాత్రికేయులు అందిపుచ్చుకోవాలి. రామోజీరావు కుటుంబానికి నా తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

బాలకృష్ణ

రామోజీ రావు మరణవార్త విని చాలా బాధపడ్డాను. ఆయన దూరదృష్టితో కూడిన నాయకత్వం వహించారు. మీడియా, వినోదం, జర్నలిజం రంగాలకు చేసిన అపారమైన కృషి మన సమాజంలో చెరగని ముద్ర వేసింది. రామోజీ రావు నిజమైన మార్గదర్శకుడు, ఆయన వారసత్వం రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది. శ్రేష్ఠత పట్ల అతని అంకితభావం. రామోజీ ఫిల్మ్ సిటీ వెనుక దూరదృష్టి ఉన్న వ్యక్తిగా, రామోజీ రావు వినూత్న స్ఫూర్తి, సృజనాత్మకతకు కేంద్రంగా.. సినిమా నైపుణ్యానికి ప్రధాన గమ్యస్థానంగా మార్చింది.
నా కుటుంబం, నా తరపున, నేను అతని కుటుంబ సభ్యులకు, ప్రియమైనవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలుగుగాక.

మంచు విష్ణు

నటుడు మంచు విష్ణు రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘నేను అతనిని కలుసుకునే అదృష్టం కలిగి ఉన్న ప్రతిసారీ అది ఒక లోతైన జీవిత నేర్చుకునే పాఠం. అతని తెలివి, ధైర్యం, నీతి నాపై చెరగని ముద్ర వేసింది. సినిమా పరిశ్రమకు కూడా ఆయన ఎప్పుడూ అండగా నిలిచారు. అతను జర్నలిజం, వినోదంలో అసమానమైన ప్రమాణాలను నెలకొల్పిన సామ్రాజ్యాన్ని నిర్మించాడు. భారతదేశం తన గొప్ప మీడియా బ్యారన్‌లలో ఒకరిని కోల్పోయింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని.. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతి’’ తెలియజేస్తున్నాను.

రాఘవేంద్రరావు, ఇళయరాజా, మోహన్ బాబు, మంచు లక్ష్మి, కల్యాణ్ రామ్, మురళీ మోహన్, తదితర సినీ ప్రముఖులు రామోజీరావు పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×