EPAPER

IAS Officers Transfers : న్యూ సీఎస్ ఆన్ డ్యూటీ.. ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ

IAS Officers Transfers : న్యూ సీఎస్ ఆన్ డ్యూటీ.. ముగ్గురు ఐఏఎస్ అధికారుల బదిలీ

CMO Officers Transferred in AP(Andhra pradesh today news): ఏపీ నూతన సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన రోజునే నీరభ్ కుమార్ ప్రసాద్ ముగ్గురు ఐఏఎస్ అధికారులపై బదిలీ వేటు వేశారు. ఏపీ సీఎంఓలో పనిచేసిన ముగ్గురు అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పూనం మాలకొండయ్య, ముత్యాలరాజు, నారాయణ భరత్ గుప్తాలను బదిలీ చేశారు. ముగ్గురూ జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు.


ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి పార్టీలు అనూహ్య విజయం సాధించడంతో.. అధికారుల బదిలీలు సాధారణమయ్యాయి. గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసిన వారిని ఒక్కొక్కరుగా బదిలీ చేస్తున్నారు ఉన్నతాధికారులు. సీఎస్ జవహర్ రెడ్డి నిన్నటి నుంచి సెలవుపై వెళ్లారు. ఈ నెలాఖరులోపు ఆయన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో శుక్రవారం నీరభ్ కుమార్ ప్రసాద్ నియమితులయ్యారు. ఏపీ సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు.కొత్త సీఎస్ బదిలీతో సెలవుపై ఉన్న జవహర్ రెడ్డిని బదిలీ చేశారు.

సీఎస్ నీరభ్ కుమార్ 1987 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన సెక్రటరీగా పనిచేస్తున్నారు. కాగా.. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లడానికి ముందు చంద్రబాబునాయుడిని కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన కోసం రెండు గంటల సమయం వేచిచూడగా.. రెండు నిమిషాలు కూడా మాట్లాడకుండా పంపించేశారు చంద్రబాబు నాయుడు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంకెంతమంది ఐఏఎస్ లు, ఐపీఎస్ ల బదిలీలు జరుగుతాయో చూడాలి.


 

Tags

Related News

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Kalasha Naidu: ‘బిగ్ బాస్’ నూతన్ నాయుడు కూతురికి ప్రతిష్టాత్మక అవార్డు, 11 ఏళ్లకే సమాజ సేవ.. సెల్యూట్ కలశా!

AP Ministers: నూతన విచారణ కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. హోం మంత్రి వంగలపూడి అనిత

Big Stories

×