EPAPER

Discount Offers on Tata Motors: కెవ్ కేక.. టాటా కార్లపై రూ.1.25 లక్షల భారీ తగ్గింపు.. ఆఫర్లు ఎప్పటివరకంటే..?

Discount Offers on Tata Motors: కెవ్ కేక.. టాటా కార్లపై రూ.1.25 లక్షల భారీ తగ్గింపు.. ఆఫర్లు ఎప్పటివరకంటే..?

Tata Motors Offering 1.25 Lakhs Discount on MY2023 Models: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ వాహన ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. తన కంపెనీకి చెందిన పలు మోడళ్లపై ఏకంగా రూ.1.25 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. టాటా సఫారీ, హారియర్ MY23తో పాటు మరిన్ని మోడళ్లపై గణనీయమైన తగ్గిపులను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్, CNGతో సహా పవర్‌ట్రెయిన్‌ల వేరియంట్లపై కూడా పలు తగ్గింపులు / ప్రయోజనాలు ఈ నెలలో అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


టాటా సఫారి (ప్రీ-ఫేస్‌లిఫ్ట్)

2023లో తయారు చేయబడిన Tata Safari ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లు రూ. 1.25 లక్షల వరకు తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. మూడు-వరుసల SUV 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో 170hp, 350Nm శక్తిని కలిగి ఉంటుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ను ఇది కలిగి ఉంటుంది.


టాటా హారియర్ (ప్రీ-ఫేస్‌లిఫ్ట్)

టాటా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ Tata Harrierపై ఫ్లాట్ క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ లేదా స్క్రాపేజ్ బోనస్‌తో సహా రూ.1.25 లక్షల తగ్గింపును అందిస్తోంది. ఇది ఐదు-సీట్ల ఫ్లాగ్‌షిప్ SUV సఫారి వలె అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది.

Also Read: డ్రీమ్ ఎడిషన్‌ను తీసుకొచ్చిన మారుతి సుజుకి.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..!

టాటా నెక్సన్ (ప్రీ-ఫేస్‌లిఫ్ట్)

టాటా మోటార్స్ గత సంవత్సరం Tata Nexonను అప్‌డేట్ చేసింది. అయితే డీలర్‌ల వద్ద ఇంకా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇన్వెంటరీ అందుబాటులో ఉన్నందున.. బ్రాండ్ పెట్రోల్ మోడల్‌లపై రూ.90,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. డీజిల్ నెక్సాన్‌లు రూ.75,000 వరకు ప్రయోజనాలను పొందుతాయి.

టాటా టియాగో

Tata Tiago MY23 స్టాక్ పెట్రోల్‌ వేరియంట్‌పై రూ.85,000 వరకు.. అలాగే CNG మోడల్‌లపై రూ.80,000 వరకు విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. టియాగో 1.2-లీటర్, మూడు-సిలిండర్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది పెట్రోల్‌పై నడుస్తున్నప్పుడు 86hp, CNGతో నడుస్తున్నప్పుడు 73hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ సంవత్సరం టాటా మోటార్స్ టాటా టియాగో CNG AMTని పరిచయం చేసింది. ఇది ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో భారతదేశపు మొట్టమొదటి ఫ్యాక్టరీకి అమర్చిన CNG కారుగా పేరుగాంచింది.

టాటా టిగోర్

2023లో తయారు చేయబడిన Tata Tigor CNG, పెట్రోల్ వేరియంట్‌లు రూ.80,000 వరకు ప్రయోజనాలను పొందుతాయి. టాటా కామ్యాక్ట్ సెడాన్ టియాగో మాదిరిగానే అదే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది కూడా ఇటీవలే CNG-ఆటోమేటిక్ వెర్షన్‌ను పొందింది.

టాటా సఫారి (ఫేస్‌లిఫ్ట్)

Also Read: స్పోర్టీ లుక్‌లో ఫిదా చేస్తున్న టాటా ఆల్ట్రోజ్ రేసర్.. బుకింగ్స్ ఓపెన్ అయ్యయండోయ్..!

టాటా గత సంవత్సరం మరింత టెక్నాలజీ, అప్డేటెడ్ డిజైన్‌తో Tata Safariని భారీగా అప్‌డేట్ చేసింది. ఫేస్‌లిఫ్ట్ MY23 మోడల్‌లు రూ.80,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. ఫేస్ లిఫ్ట్ ADAS వంటి ఫీచర్లను అందిస్తుంది.

టాటా హారియర్ (ఫేస్ లిఫ్ట్)

2023లో తయారు చేయబడిన హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లు కూడా జూన్ నెలలో రూ.80,000 వరకు ప్రయోజనాలతో అందించబడుతున్నాయి. ఈ మోడల్‌లోని అప్‌డేట్‌లు సఫారిలో కనిపించే వాటిని పోలి ఉంటాయి. ఐదు సీట్ల SUV ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ వలె అదే పవర్‌ట్రెయిన్‌లతో కొనసాగుతుంది.

టాటా ఆల్ట్రోజ్ Tata Altroz

గత ఏడాది ఉత్పత్తి చేయబడిన పెట్రోల్, డీజిల్ ఆల్ట్రోజ్ మోడల్స్ ఈ నెలలో రూ.65,000 వరకు ప్రయోజనాలతో అందించబడుతున్నాయి. CNG మోడల్‌లు రూ.50,000 వరకు ప్రయోజనాలను పొందుతాయి. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పెట్రోల్ రూపంలో 86hp, 113Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. CNGలో 77hp ఉత్పత్తి చేసే 1.2-లీటర్ అందుబాటులో ఉంది. ఒక 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 110hp, 140Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 90hp, 200Nm శక్తిని విడుదల చేస్తుంది.

Also Read: టాటా కార్లపై ఆఫర్లే ఆఫర్లు.. నెక్సాన్, టియాగో, ఆల్ట్రోజ్, టిగోర్‌‌పై భారీగా డిస్కౌంట్లు..!

టాటా నెక్సన్ (ఫేస్‌లిఫ్ట్)

ప్రీ-ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌తో పాటు, టాటా కొత్త నెక్సాన్‌పై కూడా ప్రయోజనాలను అందిస్తోంది. పెట్రోల్, డీజిల్ మోడల్‌లు రూ.60,000 వరకు ప్రయోజనాలతో అందుబాటులో ఉన్నాయి. Nexon 78 వేరియంట్‌లలో లభిస్తుంది. ఇది 120hp టర్బో-పెట్రోల్, 115hp డీజిల్ ఇంజన్‌లతో అందించబడుతుంది.

Related News

GST: ఎల్ఐసీ ప్రపంచంలోనే 10వ అతిపెద్ద సంస్థ… కానీ,…

సికింద్రాబాద్ నుంచి గోవాకు రైలు.. ఎంజాయ్ పండుగో, ఎప్పటి నుంచంటే..

Indian Railways: సినిమా టికెట్ల తరహాలోనే రైలులో మీకు నచ్చిన సీట్‌ను బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా?

Washing meshine Usage : ఆఫర్లో వాషింగ్ మెషీన్‌ కొంటున్నారా.. దుస్తులే కాదు ఇవి కూడా ఎంచక్కా ఉతికేయొచ్చు!

Railway Employees Diwali Bonus| రైల్వే ఉద్యోగులకు శుభవార్త.. రూ.2029 కోట్ల దీపావళి బోనస్!

VIKALP Yojana: పండుగల వేళ ఈజీగా రైలు టికెట్ పొందే VIKALP స్కీమ్ గురించి మీకు తెలుసా? ఇంతకీ ఈ పథకం ప్రత్యేకత ఏంటంటే?

India’s Slowest Train: 46 కి.మీ దూరం.. 5 గంటల ప్రయాణం, ఈ రైలు ఎంత నెమ్మదిగా వెళ్లినా మీకు విసుగురాదు.. ఎందుకంటే?

×