EPAPER

T20 Worldcup 2024 IND vs IRE Highlights : వార్ వన్ సైడ్ : తొలిమ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం

T20 Worldcup 2024 IND vs IRE Highlights : వార్ వన్ సైడ్ : తొలిమ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం

IND vs IRE Highlights in T20 World Cup 2024 : టీ 20 ప్రపంచకప్ లో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో వార్ వన్ సైడ్ అయ్యింది. టీమ్ ఇండియా ఘన విజయం సాధించింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ అన్నింటా అద్భుతంగా రాణించి, మంచి రన్ రేట్ తో తొలి విజయాన్ని నమోదు చేసింది. అంతేకాదు ఈ సారి మ్యాచ్ లో సరికొత్త ప్రయోగం చేసింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, విరాట్ రావడం హాట్ ఆఫ్ ది టాపిక్ గా మారింది.


టాస్ గెలిచిన టీమ్ఇండియా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకి ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో టీమ్ ఇండియా 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసి మ్యాచ్ ని ముగించింది.

కాకపోతే పిచ్ ప్రమాదకరంగా ఉండటంతో రోహిత్ శర్మ గాయపడి, రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. ఇక రిషబ్ పంత్ కి రెండు మూడు సార్లు గట్టి దెబ్బలే తగిలాయి. అటు ఐర్లాండ్ బ్యాటర్లకి కూడా గాయాలయ్యాయి. పిచ్ ప్రమాదకరంగా మారడంతో ఆదివారం జరిగే పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.


97 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ ఇండియాలో కొత్త కాంబినేషన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ ఓపెనర్లుగా రావడంతో స్టేడియం అంతా హోరెత్తిపోయింది. టీవీల్లో మ్యాచ్ చూసే ప్రేక్షకులు సైతం ఎంతో ఎక్సయిట్ అయ్యారు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకంటే విరాట్ కొహ్లీ (1) చాలా త్వరగా అయిపోయాడు. అప్పటికే 5 బాల్స్ ఆడి 1 పరుగు చేసిన కొహ్లీ.. లాంగ్ ఆన్ లో థర్డ్ మేన్ కి క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.

Also Read : రిపోర్టర్ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్

మరో ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం.. అంత కఠినమైన పిచ్ పై సైతం తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఇరగదీశాడు. 37 బాల్స్ లో 3 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. బాల్ వచ్చి భుజానికి తగలడంతో తను మైదానం వీడాల్సి వచ్చింది. అప్పటికి టీమ్ ఇండియా విజయానికి దగ్గరగా వచ్చేసింది.

మరోవైపు ఫస్ట్ డౌన్ వచ్చిన రిషబ్ పంత్ ఎంతో సాధికారికంగా ఆడాడు. నిజానికి న్యూయార్క్ పిచ్ పై అందరూ తడబడుతుంటే పంత్ మాత్రం.. అనుభవం ఉన్న వాడిలా చకచకా పరుగులు చేశాడు. 26 బాల్స్ లో 2 సిక్స్ లు, 3 ఫోర్ల సాయంతో 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. 91 పరుగుల వద్ద తను కొట్టిన విన్నింగ్ షాట్.. సిక్స్ చూసి బౌలర్ మెక్ కార్థి ఆశ్చర్యపోయాడు. అనంతరం కళ్లతోటే అభినందించాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడటంతో వచ్చిన సూర్యకుమార్ (2) ఒక షాట్ కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. అయితే వచ్చే పాకిస్తాన్ మ్యాచ్ లో మాత్రం ఇలా ఆడకు బాబూ.. అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. చివర్లో శివమ్ దుబె వచ్చినా.. రిషబ్ పంత్ ఫినిషింగ్ టచ్ ఇచ్చి.. మ్యాచ్ ని ఘనంగా ముగించాడు. మొత్తానికి 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి టీమ్ ఇండియా 97 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.

ఐర్లాండ్ బౌలింగులో మార్క్ అడైర్ 1, బెంజిమిన్ వైట్ 1 వికెట్ పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ ప్రారంభించిన ఐర్లాండ్ జట్టుకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు ఇద్దరూ తక్కువ స్కోరుకే అవుట్ అయ్యారు. నిజానికి ఇలాంటి ప్రమాదకర పిచ్ పై ఇండియన్ బౌలర్లు వేసే బాల్స్ కి ఐర్లాండ్ బ్యాటర్లు భయపడ్డారు. చాలామంది గాయపడ్డారు. నిజానికి బాల్ ఎలా వస్తుందో తెలీక అవస్థలు పడి, వికెట్లు పారేసుకున్నారు.

Also Read : మళ్లీ నోటి దురదను ప్రదర్శించిన పరాగ్.. ఈసారి ఏమన్నాడంటే..?

అలా ఓపెనర్ ఆండ్రూ బల్బిర్నీ (5), మరో ఓపెనర్ కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ (2) వెంటనే అయిపోయారు. వీరిద్దరిని అర్షదీప్ సింగ్ అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన లార్కన్ టక్కర్ (10) పాండ్యా బౌలింగులో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన హ్యారీ టెక్టర్ (4)ని బూమ్రా అవుట్ చేశాడు. ఇలా వికెట్లు సీరియల్ గా పడుతూనే ఉన్నాయి.

కర్టిస్ క్యాంప్ ఫెర్ (12), జార్జి డాక్ రెల్ (3) వెంట వెంటనే అవుట్ అయ్యారు. గారెత్ డెలానీ మాత్రం టీమ్ ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఒంటరిగా కాసేపు పోరాడాడు. 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ ల సాయంతో 26 పరుగులు చేసి, ఆఖరి వికెట్ గా రన్ అవుట్ అయిపోయాడు. లేకపోతే మరిన్ని పరుగులు వచ్చేవే. తర్వాత మార్క్ అడైర్ (3), జాషువా లిటిల్ (14) ఇలా చేయడంతో 16 ఓవర్లలో 96 పరుగుల వద్ద ఐర్లాండ్ కథ ముగిసిపోయింది.

ఈసారి టీమ్ ఇండియా బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు. తనకి న్యూయార్క్ పిచ్ కరెక్టుగా సూట్ అయినట్టుంది. చకచకా వికెట్లు పడుతున్నాయి. సిరాజ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. అక్షర్ పటేల్ తన బౌలింగ్ లోనే అద్భుతమైన క్యాచ్ పట్టాడు. ఇలా అందరూ సమష్టిగా ఆడటంతో టీమ్ ఇండియా సునాయాసంగా విజయం సాధించింది.

టీమ్ ఇండియా బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ 2, సిరాజ్ 1, అక్షర్ 1, బూమ్రా 2 వికెట్లు పడగొట్టారు.

ఐర్లాండ్ తో ఇప్పటివరకు టీమ్ ఇండియా 7 టీ 20 మ్యాచ్ లు ఆడింది. ఇప్పుడు ఆడింది ఎనిమిదో ప్రపంచకప్ మ్యాచ్. వీటన్నింటిలోనూ ఇండియా గెలవడం విశేషం.

Tags

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

×