EPAPER

JC Prabhakar will resign: బిగ్ బ్రేకింగ్, ఛైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజీనామా!

JC Prabhakar will resign: బిగ్ బ్రేకింగ్, ఛైర్మన్ పదవికి జేసీ ప్రభాకర్‌రెడ్డి రాజీనామా!

JC PrabhakarReddy will resign: టీడీపీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మరో నెల రోజుల్లో ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఆయన ఎందుకు ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు? ఇందుకు కారణమేంటి ఇలా అనేక ప్రశ్నలు తెలుగు తమ్ముళ్లను వెంటాడుతున్నాయి.


తాడిపత్రి అంటే జేసీ ఫ్యామిలీ గుర్తుకు వస్తుంది. ఏళ్ల తరబడి వారిదే అక్కడ హవా. 2019 ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి ఓడిపోయారు. వెంటనే జరిగిన తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. అప్పట్లో జనసేన మద్దతుతో ఆయన ఛైర్మన్ పదవిని దక్కించుకున్నారు. ఏపీలో టీడీపీ గెలుచుకున్న ఏకైన మున్సిపాలిటీ అదొక్కటే.

ఆ సమయంలో టీడీపీ కౌన్సెలర్లకు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులు అప్పగిస్తానని హామీ ఇచ్చారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం ఉదయం జేసీ ప్రభాకర్‌రెడ్డి తన నిర్ణయాన్ని వెల్లడించారు.


ALSO READ: పిన్నెల్లిపై పోలీసుల నిఘా.. అరెస్టుకు రంగం సిద్ధం ?

ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో జేసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్‌రెడ్డి కొడుకు అస్మిత్‌రెడ్డి విజయం సాధించారు. మొత్తానికి రాజకీయ పగ్గాలు కొడుక్కి అప్పగించిన తర్వాత పెద్దాయన తప్పుకుంటున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు.

 

Tags

Related News

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: ఆ విషయంలో వెనక్కి తగ్గం.. సీఎం చంద్రబాబు క్లారిటీ

Perni Nani: నా వెంట్రుక కూడ పీకలేరు.. కోసి కారం పెట్టండి.. మాజీ మంత్రి నాని సెన్సేషనల్ కామెంట్స్

AP Politics: లోకేష్ కి పోటీగా అంబటి.. గ్రీన్ బుక్ ఓపెన్.. పేర్లన్నీ రాస్తున్నా.. ఎవ్వరినీ వదలనంటూ కామెంట్

Swiggy Services Ban: ఏపీలో స్విగ్గీ సేవలు బ్యాన్, హోటల్స్ యాజమాన్యాలు కీలక నిర్ణయం, కారణం తెలుసా?

SIT inquiry: తిరుమల లడ్డూ వివాదం.. ఈ వారం రంగంలోకి సిట్, తొలుత..

Deputy Cm Pawan: పవన్ కల్యాణ్‌కు బిగ్‌షాక్.. కేసు నమోదు, ఎందుకంటే..

Big Stories

×