EPAPER
Kirrak Couples Episode 1

Vivo X Fold 3 Pro India launch today: ఓరి బాబోయ్.. ఇదేక్కడి ఫోన్ రా నాయనా.. కెమెరా, బ్యాటరీ, ఫీచర్లు చంపేశాయ్..!

Vivo X Fold 3 Pro India launch today: ఓరి బాబోయ్.. ఇదేక్కడి ఫోన్ రా నాయనా.. కెమెరా, బ్యాటరీ, ఫీచర్లు చంపేశాయ్..!

Vivo X Fold 3 Pro Price In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో మార్కెట్‌లో తన హవా కొనసాగిస్తోంది. కొత్త కొత్త మోడళ్లను పరిచయం చేస్తూ.. ఫోన్ ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ఇందులో భాగంగానే Vivo ఈరోజు పెద్ద లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్‌లో భారతదేశంలో ‘Vivo X Fold 3 Pro’ మొబైల్‌‌‌ని విడుదల చేస్తుంది. Vivo X ఫోల్డ్ 3 కంపెనీ నుండి భారతదేశంలో అందుబాటులోకి రానున్న మొదటి ఫోల్డబుల్ ఫోన్.


కంపెనీ ఇప్పటివరకు తన ఫోల్డబుల్ ఫోన్‌ను ప్రత్యేకంగా చైనాలో మాత్రమే ప్రారంభించింది. Vivo X ఫోల్డ్ 3 ప్రో ఈ సంవత్సరం మార్చిలో చైనాలో ప్రారంభమైంది. అయితే ఇవాళ Vivo X Fold 3 ఫోన్ భారతీయ ప్రియులకు అందుబాటులో వచ్చేస్తోంది. ఇప్పడు ఈ ఫోన్ లాంచ్ సమయం, లాంచ్ ఈవెంట్‌, అంచనా ధరతో సహా మరిన్ని వివరాలు తెలుసుకుందాం..

Vivo X Fold 3 Pro ఇండియా లాంచ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. వివో అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో లాంచ్ ఈవెంట్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. Vivo X ఫోల్డ్ 3 ప్రో ఇండియా ధర విషయానికొస్తే.. భారతదేశంలో Vivo X ఫోల్డ్ 3 ప్రో ధర సుమారు రూ. 1 లక్ష నుండి ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ సోలార్ వైట్, ఎక్లిప్స్ బ్లాక్ షేడ్స్‌లో రావచ్చు. దీనిని Vivo అధికారిక వెబ్‌సైట్, Flipkartతో సహా ఇతర రిటైల్ షాప్‌లలో కొనుక్కోవచ్చు.


Also Read: వివో నుంచి తొలి మ.. మ.. మ.. మడతపెట్టే ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..?

Vivo X ఫోల్డ్ 3 ప్రో స్పెసిఫికేషన్‌లు

Vivo X ఫోల్డ్ 3 ప్రో 4,500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది 2480×2200 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 8.03-అంగుళాల AMOLED LTPO ప్రైమరీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే డాల్బీ విజన్, HDR10+కి మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది Qualcomm Snapdragon 8 Gen 3 SoC ప్రాసెసర్‌ నుండి శక్తిని పొందుతుంది. ఈ ఫోన్ 16GB RAM + 1TB UFS 4.0 స్టోరేజ్ వరకు ప్యాక్ చేయబడుతుంది.

100W వైర్డు, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. Vivo X ఫోల్డ్ 3 ప్రోలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రావైడ్ లెన్స్, 64MP టెలిఫోటో షూటర్ ఉన్నాయి. ఇది సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం ముందు భాగంలో 32MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 14-ఆధారిత Orgin OSని బాక్స్ వెలుపల రన్ చేసే అవకాశం ఉంది.

Tags

Related News

Best Budget Laptops Under Rs 15000: చీపెస్ట్ ల్యాప్‌టాప్స్.. 5జీ ఫోన్ ధరకే కొనేయొచ్చు, ఫీచర్లు అదిరిపోయాయ్!

Cheapest Drone Cameras: అస్సలు ఊహించలేరు.. కీప్యాడ్ ఫోన్ ధరకే డ్రోన్ కెమెరా, క్వాలిటీలో తోపు!

Lava Festive Season Sale 2024: స్మార్ట్‌ఫోన్ల జాతర.. కేవలం రూ.6,699లకే కొత్త మొబైల్, ఇదే కదా కావాల్సింది!

Infinix Zero Flip: ఇండియాలో బడ్జెట్ ఫ్లిప్ ఫోన్ త్వరలోనే లాంచ్..శాంసంగ్ కంటే సగం ధరకే ఇన్‌ఫినిక్స్ జీరో ఫ్లిప్

OnePlus Diwali Sale: వన్‌ప్లస్ దీపావళి ఆఫర్.. వీటిపై కొప్పలు తెప్పలు డిస్కౌంట్లు, అస్సలు వదలొద్దు!

Samsung Galaxy S24 FE: శాంసంగ్ పరుగులు.. అధునాతన ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్ వచ్చేస్తున్నాయ్!

OnePlus 13: 24 GB ర్యామ్, స్నాప్‌డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్‌‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్.. ఫీచర్లు కెవ్ కేక!

Big Stories

×