EPAPER

Rohit Sharma: రిపోర్టర్ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్

Rohit Sharma: రిపోర్టర్ ప్రశ్నకు అసహనం వ్యక్తం చేసిన కెప్టెన్ రోహిత్

Rohit Sharma:టీ20 వరల్డ్‌కప్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో తొలి సమరానికి సిద్ధమైంది. గ్రూప్-ఏలో భాగంగా భారత జట్టు.. ఐర్లాండ్‌తో ఢీకొట్టనుంది. న్యూయార్క్ వేదికగా నాసా కంట్రీ అంతర్జాతీయ మైదానంలో భారత కాలమాన ప్రకారం.. రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌కు ముందు భారత కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. మీడియా సమావేశంలో ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా మాట్లాడాడు.


వార్మప్ మ్యాచ్‌లో ఏమైందంటే?

భారత్‌, బంగ్లాదేశ్ జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతుండగా.. ఓ అభిమాని నేరుగా మైదానంలోకి చొరబడ్డాడు. ఈ సమయంలో ఆ అభిమాని రోహిత్ దగ్గరకు వెళ్లే సరికే.. భద్రతా సిబ్బంది వచ్చి అతడిని పట్టుకున్నారు. నిబంధనులు ఉల్లంఘించి మైదానంలోకి వచ్చిన ఆ అభిమాని ఎక్కడ తప్పించుకుంటారనే కోణంలో భద్రతా సిబ్బంది మీదపై పడి ఉక్కిరిబిక్కిరి చేయసాగారు. అక్కడే ఉన్న రోహిత్.. ఇబ్బంది పెట్టకండి.. కొంచెం సున్నితంగా వ్యవహరించి తీసుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మీడియా సమావేశంలో ప్రస్తావన తీసుకొచ్చాడు.


Also Read: ఇక్కడ 140 పరుగులు చేసినా గొప్పే: రోహిత్

అందరి భద్రత ముఖ్యం..

మీరు మైదానంలో ఉండగా ఓ అభిమాని దూసుకురావడం, వెంటనే భద్రతా సిబ్బంది అతడిని పట్టుకోవడం, వదిలేయాలని మీరు సూచించడం..ఆ సమయంలో మీరు ఎమోషనల్‌కు గురయ్యారా? అని సదరు జర్నలిస్ట్ రోహిత్‌ను ప్రశ్నించాడు. దీనికి రోహిత్.. మీరు అడిగిన ప్రశ్నతోపాటు ఆ సంఘటన రెండూ తప్పే అన్నారు. మైదానంలో ఆటగాళ్లకు భద్రత చాలా ముఖ్యం. ఈ సమయంలో అభిమానులు లోపలికి రావడం తప్పు. అయితే ఆటగాళ్లతోపాటు ప్రేక్షకుల భద్రతా కూడా ముఖ్యమైంది. కానీ మైదానంలో ఆడుతున్న ఆటగాళ్లకు చాలా నియమ, నిబంధనులు ఉంటాయి. వీటిని అభిమానులు అర్థం చేసుకోవాలి. అంతేకానీ, ఇష్టానుసారంగా మైదానంలోకి రాకూడదన్నారు. ఈ విషయంలో ఆటగాళ్లు లక్ష్యం వైపు ఆలోచిస్తుంటారని చెప్పాడు.

Related News

India vs Bangladesh Test Match: అదరగొట్టిన భారత్.. 149కే బంగ్లా ఆలౌట్

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Big Stories

×