Motorola ఇటీవల బడ్జెట్ విభాగంలో కొత్త స్మార్ట్‌ఫోన్ ‘Moto G04s’ని విడుదల చేసింది

కంపెనీ దీనిని ఒకే ఒక్క వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.

సామాన్యులను దృష్టిలో పెట్టుకొని మోటో ఈ ఫోన్‌ను కేవలం రూ.6,999లకే రిలీజ్ చేసింది.

ఈ ఫోన్‌ ఫస్ట్ సేల్ ఇవాళ (జూన్ 5, 2024) షురూ అయింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్‌ను కొనుక్కోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్ 90 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల IPS LCD HiD HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే UNISOC T606 ప్రాసెసర్‌తో వస్తుంది.

Motorola కొత్త ఫోన్‌ 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. ఇందులో 5MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంది.

Moto g04sకు శక్తినివ్వడానికి ఇది 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 15W ఛార్జింగ్ సామర్ధ్యంతో వస్తుంది.

కనెక్టివిటీ కోసం Moto G04sలో GPS, NFC, USB టైప్ C, Wi-Fi వంటివి ఉన్నాయి.

కంపెనీ ఒకే వేరియంట్ 4GB RAM + 64GB స్టోరేజ్‌ను అందించింది. అంతేకాకుండా దీనిని 1TB వరకు ఎక్స్‌పెండ్ చేసుకోవచ్చు.