EPAPER
Kirrak Couples Episode 1

Chandrababu Naidu Press Meet : ఈ ఎన్నికలు చారిత్రాత్మకం.. పాలకులం కాదు.. సేవకులం : చంద్రబాబు

Chandrababu Naidu Press Meet : ఈ ఎన్నికలు చారిత్రాత్మకం.. పాలకులం కాదు.. సేవకులం : చంద్రబాబు

  • నా సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు.
  • ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో, ఇబ్బంది పెట్టారో అన్నీ చూశాం.
  • ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి, ఎన్ని త్యాగాలైనా చేసి భావితరాల భవిష్యత్తుకోసం ముందుకెళ్లాం.
  • చాలా ఎన్నికలు చూశాం. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం. రాజకీయ పార్టీలు, అధికారం అశాశ్వతం.
  • వ్యక్తులు కనుమరుగైతే రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయి.
  • ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలను ఎప్పుడూ చూడలేదు.
  • ఓడితే కుంగిపోలేదు.. గెలిస్తే గంతులేయలేదు.
  • ఈ ఎన్నికల్లో అమెరికాలో ఉన్న వ్యక్తి కూడా లక్షలు ఖర్చుపెట్టి ఓటు వేయడానికి వచ్చారు.
  • కూలిపనులు, పాచిపనులు చేసుకునేవారు కూడా రైళ్లు, బస్సులు ఎక్కి వచ్చి మరీ ఓటేశారు.
  • ఈ కమిట్ మెంట్ ను ఎలా వర్ణించాలో, ఎలా అభినందించాలో అర్థం కావడం లేదు.
  • ఈ ఎన్నికలు సువర్ణాక్షరాలతో లిఖించదగిన హిస్టారికల్ ఎన్నికలు.
  • 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాక పోటీ చేసి 200 సీట్లు గెలిచాం.
  • 1994లో ప్రజా వ్యతిరేకత వల్ల అపోజిషన్ లీడర్ గా ఉండే స్టేటస్ కూడా లేకుండా రిజల్ట్ వచ్చింది.
  • ఈ ఎన్నికల్లో తీర్పు వాటన్నింటికంటే భిన్నం.
  • ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది.
  • అప్పుడూ, ఇప్పుడూ చెప్పేది ఒక్కటే.. ప్రజలు గెలవాలి. రాష్ట్రం నిలబడాలి.
  • ఈ ఎన్నికల్లో 55.38 శాతం ఓట్లు రాగా.. టీడీపీకి 45.60 శాతం, వైసీపీకి 39.37 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
  • చార్మినార్ ఎంఐఎం కంచుకోట. ఆ తర్వాత కుప్పం, సిద్ధిపేట రెండోస్థానానికి పోటీ పడేవి. ఈసారి 94 వేలు, 92 వేలు, మంగళగిరిలో 91 వేలు మెజార్టీ వచ్చాయి.
  • ఇవన్నీ చూశాక.. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం ఏదిపడితే అది చేస్తే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందనిపించింది.
  • గుణపాఠం పాలకులకు కాదు.. అవినీతి, అహంకారంతో ఉండే ఎలాంటి వారికైనా ఇదే జరుగుతుందని ప్రజలు నిరూపించారు.
  • ఐదేళ్లు టీడీపీ కార్యకర్తలు కంటి నిండా నిద్ర లేని పరిస్థితులను ఎదుర్కొన్నారు.
  • మనిషిని హింసించి.. ప్రాణం ఉండాలంటే జై జగన్ అనాలని ఇబ్బంది పెడితే.. జై తెలుగుదేశం, జై చంద్రబాబు అంటూ ప్రాణాలు విడిచారు.
  • ఆ కమిట్మెంట్ తోనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నాం.
  • ఒక్క కార్యకర్తలే కాదు.. మీడియా కూడా ఇబ్బంది పడింది. అవన్నీ తలచుకుంటే ప్రజాస్వామ్యమే సిగ్గుతో తల వంచుకోవాలి.
  • ఇది అధికారం కాదు. ఒక బాధ్యత.. మేము పాలకులం కాదు.. సేవకులం కాదన్న నినాదానికి కట్టుబడి పనిచేస్తాం.
  • మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తాం.
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకే పవన్ కల్యాణ్ కూటమికి బీజం వేశారు. ఇందులో బీజేపీ కూడా భాగస్వామ్యమవ్వడంతో ముగ్గురం కలసి పనిచేశాం.
  • 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్ స్థానాల్లో భాగస్వామ్యంగా పనిచేసి అనూహ్యమైన విజయాన్ని సాధించాం. ఇక్కడి నుంచి బాధ్యతగా ఎలా పనిచేయాలో ప్లాన్ చేసుకుంటాం.
  • వ్యవస్థలు ధ్వంసమయ్యాయి. ఎకానమీ కుప్పకూలిపోయింది. ఎన్ని అప్పులు చేశారో ఇంకా తేలలేదు. తమకు అడ్డే లేదని విర్రవీగారు.
  • అసెంబ్లీ సాక్షిగా నా భార్య, కుటుంబానికి జరిగిన అవమానానికి చాలా బాధపడ్డాను. నాపై బాంబు దాడి జరిగినపుడు కూడా అంత బాధపడలేదు.
  • మళ్లీ గెలిచాకే అసెంబ్లీకి వస్తానని ఆ నాడు చెప్పా. ఇప్పుడు అదే జరిగింది. ప్రజల రుణం తీర్చుకుంటా.
  • ఐదేళ్ల పాలనలో ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎన్ని అప్పులున్నాయో నాలుగైదు రోజుల్లో చూసి అన్నీ వెల్లడిస్తాం – చంద్రబాబు


Tags

Related News

Jagan clarification: మళ్లీ బెంగుళూరుకి జగన్.. పోతే పోనీ అంటూ

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

Big Stories

×