EPAPER

NEP vs NED Highlights, T20 World Cup 2024: అతికష్టమ్మీద గెలిచిన నెదర్లాండ్స్.. నేపాల్ ఓటమి

NEP vs NED Highlights, T20 World Cup 2024: అతికష్టమ్మీద గెలిచిన నెదర్లాండ్స్.. నేపాల్ ఓటమి

Netherlands vs Nepal Highlights T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ లో నేపాల్ తో జరిగిన పోటీలో నెదర్లాండ్స్ పడుతూ లేస్తూ విజయం సాధించింది. వన్డే వరల్డ్ కప్ 2023లో పెద్ద దేశాలతో కలిసి ఆడిన నెదర్లాండ్స్ ఇక్కడ చిన్నజట్టుపై అతికష్టమ్మీద గెలిచింది.


యూఎస్ ఏ లోని టెక్సాస్ లో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన నేపాల్ 19.2 ఓవర్లలో 106 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ 18.4 ఓవర్లు ఆడి.. 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

వివరాల్లోకి వెళితే.. 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెదర్లాండ్స్ ఓపెనర్ మైఖేల్ (1) నిరాశ పరిచాడు. మరో ఓపెనర్ మాక్స్ 48 బంతుల్లో 1 సిక్సర్, 4 ఫోర్ల సాయంతో 54 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జట్టుకి విజయాన్ని అందించాడు. ఫస్ట్ డౌన్ వచ్చిన విక్రమ్ జిత్ (22), సైబ్రాండ్ (14), కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్ (5), బస్ డీ లీడ్ (11 నాటౌట్) వీళ్లందరూ ఓపెనర్ మాక్స్ కి సపోర్ట్ అందించారు.  ఎట్టకేలకు 18.4 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసి ఒడ్డున పడింది.


Also Read: ఈ పిచ్ కి.. ఓ దండం.. న్యూయార్క్ లో మ్యాచ్ లపై నెటిజన్లు

నేపాల్ బౌలింగులో సోంపాల్ 1, దిపేంద్ర సింగ్ 1, అభినాష్ బొహరా 1,  వికెట్లు తీశారు.

అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ ఓపెనర్లు శుభారంభాన్ని ఇవ్వలేదు. కుషాల్ (7), ఆసిఫ్ షేఖ్ (4) త్వరగా అయిపోయారు. అక్కడ నుంచే పతనం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన అనిల్ కుమార్ షా (11)  ఎంతో సేపు నిలవలేదు. అయితే కెప్టెన్ రోహిత్ మాత్రం కొద్దిగా పోరాడాడు. 37 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  గుల్షన్ (14), కరణ్ (17) ఒక మోస్తరుగా ఆడారు. తర్వాత జట్టులో ముగ్గురు డక్ అవుట్ అయ్యారు. మొత్తానికి 19.2 ఓవర్లలో నేపాల్ 106 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

నెదర్లాండ్స్ బౌలింగులో టిమ్ ప్రింగిల్ 3, లోగన్ 3, పాల్ వాన్ 2, బస్ దే లీదే 2 వికెట్లు పడగొట్టారు.

Related News

Rohit Sharma: 2027 వరకు రోహిత్ శర్మనే కెప్టెన్..కాంగ్రెస్ ప్రకటన

Mohammed Shami: మహమ్మద్ షమీది దొంగ ప్రేమ..మాజీ భార్య హాసిన్ సంచలనం!

Ind vs Ban: హైదరాబాద్‌లో భారత్-బంగ్లాదేశ్‌ మ్యాచ్.. నేటి నుంచి టికెట్ల విక్రయం

Ms Dhoni: RCBపై కోపంతో ధోనీ… TV పగలగొట్టేశాడు..క్లారిటీ ఇదే?

Rashid Khan: పెళ్లి చేసుకున్న స్టార్ క్రికెట‌ర్ ర‌షీద్ ఖాన్‌..ఒకే రోజూ 4 గురికి !

T20 World Cup: నేడు మహిళా టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-న్యూజిలాండ్‌ మ్యాచ్‌

Telangana BIG TV Cricket League : తమన్ ఊచకోత.. 34 బంతుల్లో సెంచరీ

×