EPAPER

Pawan Kalyan: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా.. ?

Pawan Kalyan: ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా.. ?

Pawan Kalyan: సెలబ్రిటీగా ఉన్నవారి జీవితాలేమి పూలపాన్పు కాదు. ఎంత డబ్బు, హోదా ఉన్న మనుషుల ఆలోచనలు వేరు.. వ్యక్తిత్వం వేరుగా ఉంటాయి. చుట్టూ ఎంతమంది ఉన్నా ఒంటరిగా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు.. ఈరోజు ఎన్నికల్లో రికార్డులు సృష్టించిన పవన్ కళ్యాణ్.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినట్లు ఎవరికైనా తెలుసా.. ? కొన్ని లక్షలమంది ముందు ధైర్యంగా వెన్ను విరుచుకొని నిలబడిన ఈ జనసేనాని.. గతంలో అందరి ముందు డ్యాన్స్ చేయలేకపోయాడని తెలుసా.. ? జీవితంలో విజయమే చూడని ఈ అంజనీ పుత్రుడు.. నేడు చరిత్ర సృష్టించాడు.


కొణిదెల కళ్యాణ్ బాబు గురించి చాలామందికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొణిదెల కుటుంబంలో ఆఖరివాడిగా 1971, సెప్టెంబర్ 2 న జన్మించాడు. ఇద్దరు అన్నయ్యలు, ఇద్దరు అక్కలు ఉన్నా కూడా కళ్యాణ్ ఎప్పుడు ఒంటరిగానే ఉండేవాడు. చదువు సరిగ్గా రాలేదు. ఆ సమయంలో ఎంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు.

తన 17 ఏళ్ల వయస్సులో కళ్యాణ్ బాబు మొదటిసారి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్నీ ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.. “నాకు ఉబ్బసం ఉంది. తరచుగా ఆసుపత్రిలో చేరడం వల్ల ఒంటరిగా ఫీలయ్యేవాణ్ణి. నేను సోషల్ పర్సన్ ను కాను. 17 ఏళ్ళ వయసులో, పరీక్షల ఒత్తిడి నా డిప్రెషన్‌ను మరింత పెంచింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మా అన్నయ్య లైసెన్స్‌డ్ రివాల్వర్‌తో నా ప్రాణం తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను.. కానీ, అది గమనించిన మా వదిన సురేఖ, అన్నయ్య నాగబాబు నన్ను కాపాడారు. ఈ విషయం పెద్దన్నయ్య చిరంజీవికి చెప్పారు. ఆయన నన్ను కూర్చోపెట్టి.. ఇలాంటి పనులు చేయకు.. నాకోసం బ్రతుకు.. నువ్వు ఏం చేయకపోయినా పర్లేదు.. కానీ, బ్రతికి ఉండు చాలు అని చెప్పాడు. అప్పటినుంచి నేను పుస్తకాలను చదువుతూ నా ఒత్తిడిని తగ్గించుకున్నాను” అని చెప్పుకొచ్చాడు.


ఇక అలా ఒంటరిగా జీవితం సాగిస్తున్న సమయంలో చిరు.. కళ్యాణ్ బాబును ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అలా 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో తెరంగేట్రం చేసాడు. ఈ సినిమా ద్వారా కళ్యాణ్ బాబు కాస్తా పవన్ కళ్యాణ్ గా మారాడు. సినిమాలోకి వచ్చాకా కూడా పవన్ కు ఆ సిగ్గు, బిడియం పోలేదు. ఎప్పుడు కూడా నలుగురి ముందు నటించడానికి ఇష్టపడేవాడు కాదు పవన్.

ఒకసారి సుస్వాగతం సినిమా సమయంలో.. అందరి ముందు బస్సు ఎక్కి డ్యాన్స్ చేయమని చెప్పడంతో.. అది చేయలేక.. వదిన సురేఖకు కాల్ చేసి.. తనకు నటన వద్దు అని, ఇక్కడే జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. అప్పుడు సురేఖ ధైర్యం చెప్పి పవన్ ను ముందుకు నడిపింది. ఇలా పవన్ చిన్నతనం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటూ వచ్చాడు. అలా ఉండే మనిషి ప్రజల సేవకి అంకితమవ్వడానికి సిద్ధపడ్డాడు.

తన సిగ్గు, బిడియం, భయాన్ని పక్కన పెట్టి ప్రజల మధ్యకు వచ్చాడు. కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న హీరో.. రోడ్లపై చెప్పులు లేకుండా నడిచాడు. తల్లిని, భార్యను అనరాని మాటలు అన్నా కూడా భరించి ప్రజల కోసమా నిలబడ్డాడు. పదేళ్లు శ్రమించి ఈరోజు ఈ హోదాలో నిలబడ్డాడు. సినిమాలను వదిలేసి.. లగ్జరీ లైఫ్ ను వదిలేసి, కుటుంబాన్ని వదిలేసి, అభిమానులను కూడా వదిలి.. ప్రజల సమస్యలే తన సమస్యలు అని పోరాటపటిమతో ముందుకు సాగుతున్నాడు. అధికారం వచ్చాక అహంకారం చూపించకుండా అభివృద్ధి కోసం అడుగులు వేద్దాం అని చెప్పి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు.. కొణిదెల పవన్ కళ్యాణ్ అలియాస్ జనసేనాని. మరి ముందు ముందు ఏపీలో పవన్ ఎలాంటి మంచి కార్యాలను చేసి.. ప్రజల్లో గుండెల్లో ఎలాంటి ముద్ర వేస్తాడో చూడాలి.

Related News

OG: బాబాయ్ కంటే ముందు ఓజీ క‌థ నేను విన్నా – వరుణ్ తేజ్

Jani Master: కొరియోగ్రాఫర్ జానీకి భారీ షాక్.. నేషనల్ అవార్డు రద్దు!

Srinu Vaitla : బ్రూస్ లీ డిజాస్టర్ సినిమా కాదు, ఆ సినిమా మంచి లాభాలను తీసుకువచ్చింది

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

OG Update: పవన్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

Harudu Glimpse: కమ్ బ్యాక్ కోసం సిద్ధమయిన హీరో వెంకట్.. ‘హరుడు’ నుండి గ్లింప్స్ విడుదల

Posani: ఎన్ – కన్వెన్షన్ కూల్చడం కరెక్టే.. పోసాని షాకింగ్ కామెంట్..!

×