EPAPER

TDP Success Secrets: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయం.. టీడీపీ స‌క్సెస్ సీక్రెట్స్‌ ఇవే..!

TDP Success Secrets: ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని విజయం.. టీడీపీ స‌క్సెస్ సీక్రెట్స్‌ ఇవే..!

1. కీలక సమయంలో పొత్తులు కుదరడం

సరైన సమయంలో కూటమి దిశగా ఏపీలో అడుగులు పడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తులు కుదరడం టర్నింగ్ పాయింట్ గా మారింది. నిజానికి ఈ కూటమి ఏర్పడుతుందా లేదా అన్న డౌట్లు ఉండేవి. కానీ చంద్రబాబు అరెస్ట్ తర్వాత కూటమి ఏర్పాటు విషయంలో ఒక స్పష్టత వచ్చింది. కూటమిగా రావడంపై జగన్ పదే పదే విమర్శలు గుప్పించడానికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తమకు నష్టం చేస్తుందన్న కారణమే.


2. కూటమి ఏర్పాటులో పవన్ కల్యాణ్ చొరవ
నిజానికి ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఏర్పడుతుందా లేదా అన్న డౌట్లు ఉన్న సమయంలో మొదటి నుంచి ఈ అలయెన్స్ ను నమ్మింది పవన్ కల్యాణే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని డే వన్ నుంచి చెబుతూ వచ్చారు. అన్నట్లుగానే అటు బాబును, ఇటు మోడీ, అమిత్ షాను ఒప్పించి మరీ కూటమి కట్టారు. ఇప్పుడు ఏపీలో ఈ కూటమి ఏకపక్ష విజయం సాధించడంలో పవన్ కల్యాణ్ చొరవ, రాజకీయ వ్యూహం బాగానే పని చేసింది. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఏవైనా ఇవ్వాలనుకుంటే అది పవన్ కల్యాణ్ కే ఇవ్వాలన్న విశ్లేషణలూ ఉన్నాయి.

3. రాజధాని అమరావతి ఇంపాక్ట్
ఇక జగన్ ఓటమికి, టీడీపీ కూటమి విజయంలో కీలకంగా పని చేసింది రాజధాని అంశమే. జగన్ గద్దెనెక్కాక అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేశారు. అప్పుడే మూడు రాజధానులు తెరపైకి తెచ్చారు. ఇక విశాఖ నుంచే పాలన అని దసరా, సంక్రాంతి ఇలా పండగల పేర్లు చెప్పడం తప్పితే మూమెంట్ తీసుకురాలేకపోయారు. అదే సమయంలో అమరావతి రాజధాని వద్దు అని చెప్పి ఆ ప్రాంత ప్రజల మెప్పు కూడా సాధించలేకపోయారు. మరోవైపు టీడీపీ కూటమి మాత్రం రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారని, అన్యాయమంటూ ప్రచారం చేసి సక్సెస్ అయింది.

Also Read: చంద్రబాబుకు బీజేపీ బంపరాఫర్.. భారీ మెజార్టీతో పవన్ కల్యాణ్ విజయం

4. పోలింగ్ కు ముందు అధికారుల మార్పు
బీజేపీతో పొత్తులు కుదుర్చుకోవడం ఏపీలో టీడీపీ-జనసేనకు గేమ్ ఛేంజర్ అయింది. పోలింగ్ కు ముందు ఈసీకి వరుస ఫిర్యాదులు చేయడం, అక్కడి నుంచి సానుకూల నిర్ణయాలు రావడంలో కీలకంగా మారింది. డీజీపీ మారిపోయారు. కీలక అధికారులంతా బదిలీ అయ్యారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీలను ఈసీ పక్కన పెట్టింది. అటు సీఎస్ పరిధిని కూడా చాలా వరకు కట్టడి చేయగలిగారు. దీంతో పోలింగ్ సజావుగా సాగడంలో ఉపయోగపడిందన్న విశ్లేషణ ఉంది. అయినా సరే కొంత అలజడి చెలరేగినా కట్టడి అయింది.

5. వైసీపీ ఆగడాలకు చెక్ పెట్టడంలో సక్సెస్
నిన్నటిదాకా అధికారం వైసీపీ చేతిలో ఉంది. సో ఏదైనా చేయొచ్చనుకునే పరిస్థితిని కూటమి నేతలు మార్చగలిగారు. పోలింగ్ కేంద్రాల్లో, ప్రచార సమయాల్లో పైచేయి సాధించకుండా కట్టడి చేయగలిగారు. అదనపు కంపెనీల బలగాలను మోహరించగలిగేలా చేశారు.

6. నిరుద్యోగుల్లో అసంతృప్తి
నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి కూడా టీడీపీ కూటమి విజయంలో కీలక పాత్ర పోషించింది. ఎంత సేపూ బటన్లు నొక్కడం, డైరెక్ట్ ట్రాన్స్ ఫర్ చేస్తున్నా అని చెప్పడం తప్పితే ఉపాధి కల్పన, సరైన నోటిఫికేషన్లు వేయకపోవడం, పరిశ్రమలు తీసుకొచ్చి ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించే విషయంపై జగన్ ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం మైనస్ గా మారింది. సో నిరుద్యోగులు, వారి కుటుంబాలన్నీ టీడీపీకే ఓట్లు వేశాయి. అదే ఫలితాల్లో రిఫ్లెక్ట్ అయింది.

7. చంద్రబాబు-పవన్ సూపర్ సిక్స్ హామీలు
షెడ్యూల్ రాక ముందే టీడీపీ కూటమి చేసిన పని సూపర్ సిక్స్ హామీలను జనంలో చర్చకు పెట్టడం. తెలంగాణలో ఎలాగైతే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చి వాటిని విస్తృతంగా ప్రచారం చేసిందో.. ఏపీలోనూ చంద్రబాబు ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. సూపర్ సిక్స్ హామీలకు, తెలంగాణల కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చాలా పోలికలు ఉన్నాయి. అవి జనాన్ని ఆకర్షించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కీలకంగా పని చేసి ఉండొచ్చంటున్నారు.

8. లాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రచారం
క్లైమాక్స్ లో లాండ్ టైటిలింగ్ యాక్ట్ చుట్టూ టీడీపీ, జనసేన చేసిన ప్రచారం చాలా వరకు కలిసి వచ్చింది. జగన్ వస్తే భూములు లాక్కుంటాడు అని, పేపర్లు చించేయడం, జనం ముందే ప్రతిపాదిత యాక్ట్ పేపర్లను కాల్చేయడం ఇవన్నీ ఇంపాక్ట్ చూపించాయి. పైగా జనం కూడా తమ భూములకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆలోచన చేశారు. ఇదే కాదు.. కొత్త యాక్ట్ లో పాస్ బుక్ లపై ప్రభుత్వ చిహ్నం ఉండాల్సింది పోయి జగన్ ఫోటోలు ఉండడం ఏంటన్నది కూడా జనాన్ని ఆలోచింపజేసింది. తమ శాశ్వత ఆస్తులపై ఐదేళ్లు పాలించే నేత ఫోటో ఏంటన్నది కూడా కీలకంగా మారింది. అప్పటికే వైసీపీ నేతల భూ కబ్జాలతో విసిగిపోయి జనాలు మరోసారి అధికారం కట్టబెడితే ఉన్నది కూడా ఊడ్చుకెళ్తారన్న భయంతో టీడీపీ కూటమికే పట్టం కట్టారన్న విశ్లేషణ ఉంది.

Also Read: సైకిల్ జోరు.. వైసీపీ బేజారు.. గెలిచిన అభ్యర్థుల లిస్ట్ ఇదే

9. బాబు బెటర్ గవర్నెన్స్ ఇస్తారన్న నమ్మకం
ఇక టీడీపీ కూటమి ఘన విజయానికి మరో కారణం చంద్రబాబు సుదీర్ఘ పాలనా అనుభవం. జగన్ ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ మొత్తం ట్రాక్ తప్పిపోయిందని, చాలా విధ్వంసం జరిగిందని టీడీపీ జనసేన ప్రచారం చేశాయి. ఇప్పుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు వస్తేనే రాష్ట్రం గాడిన పడుతుందని చేసిన ప్రచారం వర్కవుట్ అయింది. పైగా చంద్రబాబుకు సీఎంగా పని చేసిన అనుభవం చాలా ఉండడంతో ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో బెటర్ గవర్నెన్స్ వస్తుందని జనం నమ్మారు.

10. చంద్రబాబు అరెస్ట్ తో సానుభూతి
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుపాలు చేయడం వైసీపీకి చాలా మైనస్ అయింది. బాబును ఒక్కరోజైనా జైలులో పెట్టాలన్న ఉద్దేశం తప్ప.. కేసులో మెరిట్స్ ఏమీ లేవని జనం నిర్ధారణకు వచ్చారు. ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న బాబు స్కాములు చేయడం ఏంటన్న ప్రశ్నలు జనంలోనూ వచ్చాయి. ఇది రాజకీయ ప్రతీకారంలో పెట్టిన కేసుగానే జనం నమ్మారు. ఎగ్జిట్ పోల్ సర్వేలు చేసిన సంస్థలు కూడా జనాన్ని ఈ ప్రశ్న అడిగినప్పుడు చాలా మంది ఇది రాజకీయ కక్షలో పెట్టిన కేసుగానే చెప్పారు. చంద్రబాబు విజయంలో ఇది కూడా కీలక పాత్ర పోషిస్తుందని సర్వేలు చెప్పినట్లే ఫలితం కూడా వచ్చింది.

Tags

Related News

MLA Adimulam case: ఎమ్మెల్యే ఆదిమూలం కేసు కొత్త మలుపు.. అసలేం జరుగుతోంది?

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Big Stories

×