EPAPER

Telangana : వర్కవుట్ కాని డబుల్ డిజిట్ ఫార్ములా.. ఏ పార్టీకీ అందని టార్గెట్

Telangana : వర్కవుట్ కాని డబుల్ డిజిట్ ఫార్ములా.. ఏ పార్టీకీ అందని టార్గెట్

– నెరవేరని డబుల్ డిజిట్‌ ఆశ
– లక్ష్యాన్ని అందుకోలేకపోయిన మూడు పార్టీలు
– బీఆర్ఎస్‌కు ఘోర పరాభవం
– కాంగ్రెస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్
– ఉన్న ఒక్క సీటూ దక్కించుకున్న ఎంఐఎం


Telangana election results 2024 live news: తీవ్ర ఉత్కంఠ నడుమ కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. అసెంబ్లీ ఎన్నికల పరిణామాలతో అలర్ట్ అయిన పార్టీలు పార్లమెంట్ ఎలక్షన్‌లో డబుల్ డిజిట్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో 10 స్థానాలకు పైగా గెలుపే లక్ష్యంగా పని చేశాయి. కానీ, ఏ పార్టీ కూడా ఈ టార్గెట్‌ను రీచ్ కాలేదు.

14 సీట్లు గెలుస్తామన్న కాంగ్రెస్


అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే హవాను కొనసాగించాలని అనుకుంది. 14 సీట్లలో గెలుపే లక్ష్యంగా అడుగులు వేసింది. బలమైన అభ్యర్థులను ఏరికోరి బరిలో నిలిపింది. కొన్ని స్థానాల్లో గెలుపు అంచనా ముందే వేసినా, మరికొన్నిచోట్ల కష్టపడితే డబుల్ డిజిట్ కచ్చితంగా అందుకోవచ్చని అనుకుంది. ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలను పట్టుకొచ్చి విస్తృతంగా ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ తప్పులను ఎత్తిచూపుతూ, కాంగ్రెస్ గెలుపు అవసరాన్ని వివరిస్తూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎంతో ఉత్సాహంగా ప్రచారం చేసి అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడ్డారు. కానీ, అనుకున్న 14 సీట్ల టార్గెట్‌ని మాత్రం రీచ్ కాలేకపోయింది కాంగ్రెస్.

బీఆర్ఎస్ ఆశలు ఆవిరి

దెబ్బ తిన్న పులి తిరిగి పంజా విసిరితే తట్టుకోలేరంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ గురించి తెగ ఊదరగొట్టాయి బీఆర్ఎస్ వర్గాలు. పార్లమెంట్ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఇటు మీడియా ముందు, అటు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి. 12 సీట్లలో గెలుస్తామని కేసీఆర్ కూడా ధీమాగా చెప్పారు. బస్సు యాత్ర పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఏదో తిట్టామన్నట్టుగా బీజేపీపై విమర్శలు చేసి యాత్రను మమ అనిపించారు. చివరకు 12 కాదు కదా, ఘోర పరాజయాన్ని చవి చూశారు.

బీజేపీ కూడా అంతే.. కానీ!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ షేర్ పెంచుకుంది బీజేపీ. జాతీయ అంశాలే కీలకంగా ఉండే పార్లమెంట్ ఎన్నికల్లోనూ 10-12 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుని పని చేసింది. మోదీ, అమిత్ షా, నడ్డా ఇలా జాతీయ నేతలంతా తెలంగాణకు క్యూ కట్టి ప్రచారం చేశారు. ఔర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ నినదించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను తిట్టిపోశారు. కానీ, టార్గెట్‌ను మాత్రం అందుకోలేకపోయారు. డబుల్ డిజిట్‌కు తక్కువగానే సీట్లను సాధించారు. కానీ, పెరిగిన ఓట్ షేర్ బీజేపీకి బూస్టప్ అని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా మూడు ప్రధాన పార్టీల డబుల్ డిజిట్ ఆశ నెరవేరలేదు.

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×