Discounts On Premium Mobiles: మీరు భారీ డిస్కౌంట్‌తో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే మీకో గుడ్‌న్యూస్. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ అద్భుతమైన డీల్స్‌లో సామ్సంగ్, గూగుల్, ఆపిల్ ఖరీదైన ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో Samsung Galaxy S23 5G, iPhone 14 Plus, Google Pixel 7 ఉన్నాయి.
Also Read: వాయమ్మో.. రూ.70వేల ఫోన్‌పై సూపర్ డిస్కౌంట్.. మాములుగా లేదు!
ఈ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ గొప్ప బ్యాంక్ డిస్కౌంట్లు అందిస్తోంది. ఇది కాకుండా క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తోంది. అలానే మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఈ ఫోన్లను మరింత తక్కువకు కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో లభించే తగ్గింపు మీ ఫోన్, బ్రాండ్ పాలసీపై ఆధారపడి ఉంటుంది.
iPhone 14 Plus
ఈ స్మార్ట్‌ఫోన్ 128 GB స్టోరేజ్‌తో మిడ్నైట్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.58,999కి అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా EMI ట్రాన్జాక్షన్ చేస్తే మీకు రూ.750 ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే కస్టమర్లు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు.
అలానే ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మీరు రూ. 50 వేల వరకు బెనిఫిట్ పొందవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్లో 6.7 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డిఆర్ డిస్ప్లేను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఇది 12-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌లో రన్ అవుతుంది.
Samsung Galaxy S23 5G
8GB RAM+256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.54,999. సేల్‌లో 750 ఫ్లాట్ తగ్గింపుతో మీరు దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు కోసం మీరు OneCard క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలి. Samsung Axis Bank Signature లేదా Infinite Card ద్వారా చెల్లించే వినియోగదారులు 10శాతం తగ్గింపు పొందుతారు.
మీకు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఉంటే మీకు 5 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లో మీరు ఈ ఫోన్ ధర రూ.51 వేలు తగ్గుతుంది. ఫీచర్ల గురించి చెప్పాలంటే Samsung ఫోన్లో 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లో Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఉంది.
Google Pixel 7
Google Pixel 7 స్మార్ట్‌ఫోన్ 8 GB RAM +128 GB ఇంటర్నల్‌లో స్టోరేజ్ Flipkartలో రూ. 48,999 ధరతో అందుబాటులో ఉంది. మీరు ఫోన్ కొనుగోలు చేయడానికి ICICI బ్యాంక్ కార్డును ఉపయోగిస్తే మీకు రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్లకు కంపెనీ 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తోంది.
Also Read: దిమ్మ తిరిగే డీల్.. మోటో కొత్త ఫోన్ ప్రైస్ డ్రాప్.. ఆఫర్ అంటే ఇలా ఉండాలి!
ఫోన్‌పై రూ.42 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. ఫీచర్ల గురించి మాట్లాడితే కంపెనీ ఫోన్లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను ఇస్తోంది. ఫోన్ 6.3 అంగుళాలు ఫుల్ HD+ డిస్ప్లేను కలిగి ఉంది.