EPAPER

AP Election Results 2024: కౌంటింగ్ టెన్షన్.. తేడా చేస్తే.. తాట తీస్తారు

AP Election Results 2024: కౌంటింగ్ టెన్షన్.. తేడా చేస్తే.. తాట తీస్తారు

AP Assembly Election Results 2024 Tough Security for Counting: ఉత్కంఠ రేపుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం అంతా రెడీ చేసింది. ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు. మూడెంచల పటిష్ట భద్రతా వలయం, సీసీ కెమెరాల నిఘా మధ్యన కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు నిబంధనల మార్పుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న పార్టీలకు ఈసీ క్లారిటీ ఇచ్చింది. అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఆర్‌వో, ఏఆర్‌వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని ప్రకటించింది. ఆ క్రమంలో ఉదయం 11 గంటల కల్లా ఫలితాల ట్రెండ్‌పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది.


ఏపీ ఎన్నికల్లో గత నెల 13న పోలింగ్ ముగిసింది. గత 50 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా 81.86 శాతం పోలింగ్ నమోదైంది. ఏపీ ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరి కొద్ది గంటల్లో ఆ టెన్షన్ వీడనుంది. అఓట్ల లెక్కింపునకు సంబంధింంచి ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్‌లో భాగంగా.. ఉదయం 8 గంటలకు ముందుగా సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాత ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. స్పాట్

ఉదయం 6 గంటలకు అభ్యర్థులు, ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్‌ అధికారుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూములు తెరవనున్నారు… కౌంటింగ్‌ ఏజెంట్లు ఉదయం 7 గంటలకు కౌంటింగ్‌ సెంటర్‌కు చేరుకోవాల్సి ఉంటుంది…అభ్యర్థుల కౌంటింగ్‌ ఏజెంట్లను ఎప్పటిలాగే ఆర్‌వో, ఏఆర్‌వోల టేబుళ్ల వద్దకు అనుమతిస్తామని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది ఉదయం 11 గంటల కల్లా ఫలితాలపై ట్రెండ్ ఎలా ఉందో ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంది.


మధ్యాహ్నానికి తుది ఫలితాలపై క్లారిటీ వచ్చేస్తుందంటున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో 111 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 2 గంటలకు కౌంటిగ్ పూర్తవుతుందని.. ఫలితాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. మరో 61 నియోజకవర్గాల్లో ఫలితాలు సాయంత్రం 4 గంటలకు పూర్తిగా క్లారిటీ వస్తుందంటున్నారు. మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలకల్లా ఫలితాలు వెల్లడికానున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఉత్కంఠకు తెర.. నేడు తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

అయితే.. తొలి ఫలితం ఏ నియోజకవర్గం.. చివరిగా ఏ నియోకవర్గాల ఫలితాలు వస్తాయనే చర్చ కూడా జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలను బట్టి చూస్తే.. తొలిఫలితం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత అదే జిల్లాలోని కొవ్వూరు, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల ఫలితాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. నరసాపురం, కొవ్వూరు నియోజకవర్గాల్లో అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తవుతుంది. అలాగే విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం, ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం, రంపచోడవరం ఫలితాల కోసం సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే.

అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరోవైపు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పోటీ చేసిన కుప్పం, వైసీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బరిలో పులివెందుల, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మధ్యాహ్నానికి వెల్లడవుతాయని చెబుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా 111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లులో కౌంటింగ్ పూర్తవుతుంది. వాటి ఫలితాలు మధ్యాహ్నం 2 గంటల్లోపే వచ్చేలా అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఆయా సెగ్మెంట్ల ఫలితాలు సాయంత్రం 4 గంటలకల్లా ప్రకటిస్తారు. మిగిలిన 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు పైబడి ఓట్ల లెక్కింపు జరగనుంది. వాటి ఫలితాలపై సాయంత్రం 6.00 గంటల్లోపు క్లారిటీ వచ్చే అవకాశముంది. రాత్రి 8 – 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రంలో తొలి ఫలితాలు వెలువడే నియోజకవర్గాలు అతి తక్కువగా .. అంటే 13 రౌండ్లలో కౌంటింగ్ పూర్తయ్యే నరసాపురం, కొవ్యూరు ఆ రెండు సెగ్మెంట్ల నుంచి రాష్ట్రంలో తొలి ఫలితాలు వెలువడనున్నాయి. తర్వాత ఆచంట, పాలకొల్లుల్లో 14 రౌండ్లలోనే కౌంటిగ్ పూర్తవుతుంది.. నిడదవోలు, పెద్దాపురం, తాడేపల్లిగూడెం, రాజోలు, మచిలీపట్నం, బాపట్లల్లో 15 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. భీమిలీ, పాణ్యంలలో 25 రౌండ్లు, రంపచోడవరంలో 29 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. మొత్తానికి రాత్రి 9కల్లా ఫైనల్ రిజల్ట్ అధికారికంగా వెలువడనుంది.

Tags

Related News

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Land Grabbing: వంశీరాం టు సోహిణి.. లిటిగేషన్స్ సో మెనీ.. కేటీఆర్ డైరెక్షన్‌లో సుబ్బారెడ్డి కబ్జా కథలు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Vegetables Price: కూరగాయల ధరలకు రెక్కలు.. జేబుకు చిల్లు.. ఇంతలా పెరగడానికి రీజనేంటి ?

Big Stories

×