EPAPER

Riyan Parag: మళ్లీ నోటి దురదను ప్రదర్శించిన పరాగ్.. ఈసారి ఏమన్నాడంటే..?

Riyan Parag: మళ్లీ నోటి దురదను ప్రదర్శించిన పరాగ్.. ఈసారి ఏమన్నాడంటే..?

Riyan Parag’s Astonishing Remark: 22 ఏళ్ల యువ క్రికెటర్ రియాన్ పరాగ్..వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు. చిన్న వయసులోనే క్రికెట్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ నోటి దురదతో కెరీర్ పాడు చేసుకుంటాడేమోననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎప్పుడూ ఏదొకటి మాట్లాడి..కొంప మీదకు తెచ్చుకుంటాడు..ట్రోల్ అవుతుంటాడు.


ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్ లో జట్టు సెమీఫైనల్ కి చేరడంలో తనవంతు పాత్ర పోషించాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో 573 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. రుతురాజ్ గైక్వాడ్ కి, తనకి కేవలం 10 పరుగులు మాత్రమే తేడా ఉంది. తను 583 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.

సరే..ఇంతకీ విషయం ఏమిటంటే..ఒకవైపు టీ 20 ప్రపంచకప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ సమయంలో రియాన్ పరాగ్ ఏమన్నాడంటే, నన్ను వరల్డ్ కప్ టీమ్ లోకి ఎంపిక చేయలేదు. అందుకే ప్రపంచకప్ పోటీలు చూడను. నాకిష్టం లేదని అన్నాడు. అంతేకాదు ఏ జట్లు సెమీ ఫైనల్ కి వస్తాయో కూడా నాకు తెలుసునని అన్నాడు. అయితే ఆ పేర్లు చెప్పనని అన్నాడు. నిజానికి నాకు ప్రపంచకప్‌లో చోటు దొరుకుతుందని ఆశించాను. కానీ కాలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.


నిజంగా జట్టులో ఉంటే, అంచనాలు వేసుకోవచ్చు. ఏమీ లేనిదానికి ఇంట్లో కూర్చుని..మ్యాచ్‌లు చూడటం దండగ అని నోటి దురుసుతో మాట్లాడాడు. అయితే చాలామంది తనింకా చిన్నవాడే. అందుకే మెచ్యూరిటీ రాలేదు. లేదంటే అలా మాట్లాడేవాడు కాదని కొందరు నెటిజన్లు పేర్కొంటున్నారు. ఎందుకిలా అన్నాడని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి క్రికెటర్లు ఎంత గొప్పగా ఆడినా సరే, ఎంత గొప్పవాళ్లయినా సరే, బీసీసీఐని విమర్శించకూడదు. అలా చేసిన చాలామంది క్రికెటర్లు కాలగర్భంలో కలిసిపోయారు. వారి భవిష్యత్తు అంధకారమైపోయింది. ఇలా నోటి దురుసు ఉన్నవాళ్లు ఎంత గొప్ప ఆటగాళ్లయినా సరే, వారిని బీసీసీఐ క్షమించదు. ఎందుకంటే వీరు ఆవేశంతో..అక్కడ జరుగుతున్న అవకతవకలను చెప్పేస్తే..పరిస్థితి ఏమిటి? అందరి నిజస్వరూపం బయటపడిపోతుంది. అందుకే గరియాన్ లాంటి మైండ్ సెట్ ఉన్నవారిని అస్సలు దరికి రానివ్వరు.

అసలే రియాన్ పరాగ్ కెరీర్ బిగినింగ్ లో ఉన్నాడు. ఐపీఎల్ లో ఇరగదీసి ఆడాడు. ఇలాంటివాడు కొంచెం కుదురుగా ఉండుంటే బాగుండేదని అంటున్నారు. ఎందుకంటే టీ 20 వరల్డ్ కప్ లో అందరూ అద్భుతంగా ఆడరు కదా..ఆ తర్వాత సిరీస్ లో కచ్చితంగా సెకండ్ చాయిస్ రుతురాజ్, రియాన్ పరాగ్ ఇద్దరే ఉన్నారని అంటున్నారు. అతి త్వరలోనే అవకాశం వచ్చేలా ఉంటుంటే రియాన్ పరాగ్ ఇలా నోటి దురదతో ఇలా చేసుకున్నాడేంటని అంటున్నారు.

ఇంతకీ తనేమన్నాడు..నేను ప్రపంచకప్ చూడననే కదా..ఎందుకంత రచ్చ అని మరికొందరు అంటున్నారు. ఇందులో చిన్న సమస్య ఉంది. అదేమిటంటే తను క్రికెట్ ఆడినా, ఆడకపోయినా ప్రతివారికి దేశం మీద ప్రేమ ఉండాలి. ముఖ్యంగా క్రికెట్ ఆడేవాళ్లకి ఆటపై ప్రేమ ఉండాలి. ఒక ఐసీసీ టోర్నమెంటుల్లో ఎవరెలా ఆడుతున్నారో గ్రహించాలి. ఇన్ని దేశాల క్రికెటర్లు ఒకచోటకి చేరుతారు. వారి బ్యాటింగ్ టెక్నిక్ ఎలా ఉందో తెలుసుకోవాలని హితబోధ చేస్తున్నారు.

Also Read: ఆ రికార్డులు బద్దలవుతాయా? : ఛాలెంజ్‌గా మారిన.. టీ 20 ప్రపంచకప్

సచిన్ టెండుల్కర్, ధోనీ, విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ ఇప్పటికి కూడా నేర్చుకుంటూనే ఉంటారు. వాళ్లు ఇంతవరకు బీసీసీఐని ఒక్క మాట అనలేదు. ఇక ఆడినా ఆడకపోయినా కొత్తదనం కోసం నిత్యం పరితపిస్తూ ఉండాలి. ఇవి రియాన్ పరాగ్ లో లేవని అంటున్నారు. అంతేకాదు 2022లో జరిగినప్పుడు సరిగ్గా ఆడలేదు. అయినా సరే అందరినీ విమర్శించి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడిలా అన్నాడు. మరి ఈ వివాదం ఎటు నుంచి ఎటు మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×