EPAPER

Makeup Tips: మేకప్ ఎక్కువ సేపు ఉండటం కోసం ఈ టిప్స్ ట్రై చేయండి !

Makeup Tips: మేకప్ ఎక్కువ సేపు ఉండటం కోసం ఈ టిప్స్ ట్రై చేయండి !

Long Lasting Makeup Tips: అందంగా కనిపించాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. అందుకే పార్టీలకు, ఫంక్షన్‌లకు వెళ్లినప్పుడు అమ్మాయిలు మేకప్ వేసుకుంటారు. అయితే మేకప్ వేసిన కాసేపటికే  కొందరి ముఖం జిడ్డుగా కనిపిస్తుంది. కానీ అలా అవడానికి చాలా కారణాలున్నాయి. కొన్ని చిట్కాలు పాటిస్తే మేకప్ ఎక్కువసేపు ఉంటుంది.


ముఖం జిడ్డుగా మారడం సాధారణ సమస్యల్లో ఒకటి. వేసవిలో ముఖం తొందరగా జిడ్డుగా మారుతుంది. దీని కారణంగా ముఖంపై మేకప్ వేసినా కూడా కాసేపటికే పోతుంది. దీనిని తగ్గించడానికి సరైన చిట్కాలు పాటించడం ఎంతైనా అవసరం. మేకప్ చేయడానికి ముందు చర్మాన్ని సిద్ధం చేసుకోవాలి లేకుంటే అనేక చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అవ్వాలంటే చాలా కష్టమైన పని. అలాంటి సమయంలో ఇంటి దగ్గరే మేకప్ వేసుకుని వెళ్లాల్సి వస్తుంది. కానీ కాసేపటికే వేసుకున్న మేకప్ పోతే చాలా చిరాకుగా అనిపిస్తుంది. కొన్ని సులభమైన పద్ధతుల ద్వారా మేకప్ వేసుకుంటే ఎక్కువసేపు ఉంటుంది. మేకప్ వేసుకునేటప్పుడు పాటించాల్సిన టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


ఫేస్ వాష్ :

మేకప్ వేసుకునే ముందు ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంతో ముఖంపై ఉండే అదనపు నూనెలు తొలగిపోతాయి. ముఖం కడుక్కోకుండా మేకప్ వేస్తే అంతకు ముందే ముఖంపై ఉన్న జిడ్డు మేకప్ త్వరగా పోయేలా చేస్తుంది. అందుకే శుభ్రంగా ఫేస్‌వాష్ చేస్తే ఇలాంటి సమస్యలు ఏవీ ఉండవు. అంతే కాకుండా చాలాసేపు మేకప్ అలాగే ఉంటుంది.

ఐస్ మసాజ్ :
మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే ఐస్ మసాజ్ చేయడం ముఖ్యం. రెండు ఐస్ క్యూబ్స్ తీసుకుని ముఖానికి వాటితో బాగా మసాజ్ చేయండి. ముఖమంతటా ఐస్‌క్యూబ్స్ తో రుద్దాలి. అప్పుడే జిడ్డు చర్మ కణాలు తొలగిపోతాయి. తర్వాత మేకప్ వేసినా కూడా బాగుంటుంది.

మాయిశ్చరైజర్:

మేకప్ వేసుకోవాలి అనుకున్నప్పుడు ముఖం మీద పూర్తిగా మాయిశ్చరైజర్ అప్లై చేయండి. జిడ్డు చర్మం ఉన్నవారు లిక్విడ్ మాయిశ్చరైజర్ ఎంచుకోవడం మంచిది. వీటిని అప్లై చేయడం వల్ల ముఖంపై జిడ్డు తొలగిపోతుంది. అంతేకాకుండా చర్మంతో ఇది బాగా కలిసిపోతుంది. మాయిశ్చరైజర్‌ను ముఖంపై సరిగ్గా మసాజ్ చేయండి. దీంతో ముఖంపై రక్తప్రసరణ పెరిగి చర్మం కాంతివంతంగా ఉంటుంది.

Also Read: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి

ఈ టిప్స్ పాటిస్తే మేకప్ వేసుకున్న తర్వాత మీ చర్మం జిడ్డుగా అనిపించదు. అంతేకాకుండా మేకప్ చాలా సమయం ఉంటుంది. మేకప్ వేసుకొని బయటకు వెళ్లి వచ్చిన తర్వాత మాత్రం కచ్చితంగా మేకప్ తీసేసి నిద్రపోవాలి. లేకుంటే చర్మం పాడవుతుంది. కచ్చితంగా ముఖంపై మేకప్ తీసిన తర్వాతే బెడ్ మీదకు వెళ్లండి. లేదంటే మొటిమలతో పాటు ఇతర సమస్యలు వస్తాయి.

(Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడినది. bigtvlive.com దీన్ని ధృవీకరించడం లేదు.)

Related News

Instant Glow Facial: పండుగ వేళ.. ఇంట్లో దొరికే వస్తువులతో ఫేస్ ప్యాక్ ట్రై చేశారంటే.. ఇన్‌స్టంట్‌ గ్లో ఖాయం

Relationships: మీ మాజీ లవర్‌తో ఇప్పటికీ స్నేహంగా ఉంటున్నారా? ఇది మంచి ఆలోచనేనా?

Amla Rice: ఉసిరికాయ అన్నం ఇలా చేసుకొని తింటే లంచ్ బాక్స్‌కు బాగుంటుంది, ఇది ఎంతో ఆరోగ్యం కూడా

Youthful Glow: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలా? డైలీ, ఈ యాంటీ ఏజింగ్ ఫుడ్స్ తింటే చాలు.. వయస్సే తెలియదు

Rice Water: గంజి వచ్చేలా అన్నం వండి ఆ గంజినీళ్లను ప్రతిరోజూ తాగండి, మీరు ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి

Thyroid: వీటితో ఇంట్లోనే థైరాయిడ్‌కు చెక్ !

Hair Spa: ఇంట్లోనే హెయిర్ స్పా.. ఎలా చేసుకోవాలో తెలుసా ?

Big Stories

×