EPAPER

Prudhvi shocking comments: పిఠాపురం సంగతేంటి? టెన్షన్ వద్దన్న పృథ్వీ, పేరు మార్పు ఖాయమా?

Prudhvi shocking comments: పిఠాపురం సంగతేంటి? టెన్షన్ వద్దన్న పృథ్వీ, పేరు మార్పు ఖాయమా?

Prudhvi shocking comments: జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గంపై అందరి దృష్టిపడింది. పవన్ గెలుపు ఖాయమని సర్వేలన్నీ చెబుతున్నాయి. కానీ మెజార్టీ ఎంతన్న దానిపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.


తాజాగా పిఠాపురంలో పవన్ కల్యాణ్ మెజార్టీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు నటుడు పృథ్వీరాజ్. దాదాపు లక్ష మెజార్టీతో జనసేనాని గెలుస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను ముందే చెబుతున్నానని, ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిందేమీ లేదన్నారు. కూటమి 136 సీట్లు, 21 ఎంపీ సీట్లు గెలుస్తున్నారని వ్యాఖ్యానించారు. దీంతో జనసేన అభిమానులు ఫుల్‌ఖుషీ అవుతున్నారు.

ఇదిలావుండగా పవన్ గెలుపు ఖాయం కావడంతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రెడీగా ఉన్నారా అంటూ పవన్ అభిమానులు ప్రశ్నించారు. పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ఓపెన్ ఛాలెంజ్ చేశారాయన. అన్నమాటకు కట్టుబడి ఉంటారా? రాజకీయాల్లో ఆరోపణలు సహజమేనని ఆయన సరిపెట్టుకుంటారా, లేక అన్నమాట ప్రకారం నిలబడి పేరు మార్చుకుంటారా అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు జనసేన అభిమానులు.


ALSO READ: వైసీపీకి ఝలక్, జోక్యం చేసుకోమని చెప్పేసిన సుప్రీం..

ఇదిలావుండగా కాసేపట్లో పవన్‌కల్యాణ్ అమరావతికి రానున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు సమయం కొద్ది గంటలు మాత్రమే ఉన్నాయి. మంగళవారం పార్టీ కార్యాలయంలోనే జనసేనాని ఉండనున్నారు. నాగబాబు ఇప్పటికే పిఠాపురం చేరుకున్నారు.

ఇంకోవైపు పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. సెంట్రల్ పారా మిలటరీ ఫోర్స్, రబ్బరు బుల్లెట్ పార్టీలు రంగంలోకి దిగాయి. నియోజకవర్గంలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ఐదంచెల భద్రతను పెంచారు పోలీసులు. అంతేకాదు ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది ఈసీ.

Tags

Related News

TTD: అన్నప్రసాదంలో జెర్రి.. తీవ్ర స్థాయిలో ఖండించిన టీటీడీ.. నమ్మొద్దు అంటూ ప్రకటన

Biryani Offer: రండి బాబు రండి.. రూ.3కే చికెన్ బిర్యానీ, ఎక్కడో తెలుసా?

Tirumala: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారా.. టీటీడీ కీలక ప్రకటన మీకోసమే..

Trolling War: సాయంత్రం 6 దాటితే జగన్‌కు కళ్లు కనిపించవా? వైసీపీ సమాధానం ఇదే!

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు దంచుడే.. దంచుడు..

Tirumala: తిరుమలలో రివర్స్ టెండరింగ్ విధానం రద్దు – టీటీడీ మరో సంచలన నిర్ణయం

TTD: తిరుమల వెళుతున్నారా.. ఇక అసలు అస్త్రం మీ చేతిలోనే.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

×