బొప్పాయి పండ్లలోనే కాదు.. ఆ చెట్టు ఆకుల్లోనూ ఔషధ గుణాలున్నాయి.

డెంగ్యూజ్వరం బారిన పడిన వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది.

పాపైన్, చైమోపాపైన్ వంట్ ఎంజైమ్ లు పుష్కలం. విటమిన్ ఎ, సి లతో పాటు ఈ, కే, బీ కూడా ఉన్నాయి.

షుగర్ పేషంట్లకు కూడా బొప్పాయి రసం మంచి ఔషధం. బ్లడ్ షుగర్ ను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంటుంది.

గుండెల్లో మంట, జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలను జీర్ణం చేస్తుంది.

కండరాల నొప్పి, కీళ్ల నొప్పులకు బాహ్యంగా చికిత్స చేసేందుకు కూడా బొప్పాయి ఆకుల్ని వాడుతారు.

బొప్పాయి ఆకుల రసం తాగితే.. అధికస్థాయి ఆక్సీకరణ ఒత్తిడి తగ్గి.. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.

ఈ రసాన్ని చర్మానికి రాస్తే.. మృతకణాలను తొలగిస్తుంది. ఎక్స్ ఫోలియంట్ గా పనిచేసి చర్మరంధ్రాలు, మొటిమలను తగ్గిస్తుంది.