Surya Gochar: సూర్యుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు అనే విషయం అందరికీ తెలిసిందే. సూర్యుడు ఆత్మవిశ్వాసం, శక్తికి కారణమని భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి గ్రహం నిర్దిష్ట కాలం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ తరుణంలో సూర్యదేవుడు కూడా జూన్లో తన రాశిని మార్చుకోబోతున్నాడు. జూన్ 15న వృషభం నుండి మిధునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ క్రమంలో సూర్యుని రాశిలో మార్పు 3 రాశులకు చాలా శుభప్రదం కానుంది. మరి ఆ రాశుల వివరాలు ఏంటో తెలుసుకుందాం.
1. మిథున రాశి
సూర్యుడి సంచారం వల్ల మిథున రాశి వారికి శుభప్రదం కానుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటే, అవి తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారు కూడా పెళ్లి చేసుకోవచ్చు. ఉద్యోగస్తుల జీతాలు పెరగడంతో పాటు పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కూడా ఈ తరుణంలో సమయం బాగుంటుంది.
2. సింహ రాశి
సింహ రాశి వారికి సూర్య సంచారం ప్రయోజనకరంగా ఉండనుంది. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. వ్యాపారం చేసే వ్యక్తులు తమ వ్యాపారాన్ని విస్తరించుకునే అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో పెట్టుబడులపై మంచి రాబడిని పొందవచ్చు. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి సమయం అనుకూలంగా ఉంటుంది.
3. కన్యా రాశి
కన్యా రాశి వారికి సూర్యుని రాశిలో మార్పు ఉంటుంది. ఉద్యోగ సమస్యలు కూడా తొలగిపోతాయి. జూన్ 15 తర్వాత పనిచేస్తున్న వ్యక్తులు బదిలీ అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం ఉంటుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.