Vivo T3 5G Price Cut: స్మార్ట్‌ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొత్తకొత్త టెక్నాలజీలో మార్కెట్లో అనేక బ్రాండెడ్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో మీరు రూ. 20 వేల లోపు గొప్ప ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే మీకోసం అద్భుతమైన డీల్‌ని ఫ్లిప్‌కార్ట్ తీసుకొచ్చింది. ఈ డీల్ Vivo T3 5G మొబైల్లో దక్కించుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆఫర్ కింద రూ. 19,999లగా ఉంది. దీనిపై రూ. 3 వేల భారీ తగ్గింపు పొందొచ్చు. అలానే స్మార్ట్‌ఫోన్‌పై రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ కూడా తగ్గింపు కూడా అందుబాటులో ఉంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Also Read: ఇటువంటి ఛాన్స్ మళ్లీ రాదు.. సామ్సంగ్ 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్ చూస్తే!
ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం 5 వేల రూపాయల తగ్గింపు అందిస్తుంది. దీని తర్వాత ఫోన్ ధర రూ. 17,999లగా మారుతుంది. ఈ ధరతతో ఈ ఫోన్ 8GB RAM +128GB వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫోన్ 8GB RAM+ 256GB స్టోరేజ్‌తో కూడా అందుబాటులో ఉంది. ఇది ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్‌పై రూ. 2,000 ప్రత్యేక బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌ను రెండు కలర్ ఆప్షన్స్‌లో కొనుగోలు చేయవచ్చు. అందులో కాస్మిక్ బ్లూ, క్రిస్టల్ ఫ్లేక్ ఉన్నాయి.
Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 8 GB RAM+ 256 GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. దీనివల్ల ఫోన్ హ్యంగ్ అవకుండా ఉంటుంది. మంచి పర్ఫామెన్స్‌ను ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల Full HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 5000 mAh పవర్ఫుల్ బ్యాటరీని కలిగి ఉంది. ఇది లాంగ్ లైఫ్ బ్యాటరీని బ్యాకప్ ఇస్తుంది.
Also Read: యవ్వారం మారిందే.. రియల్మీ నుంచి బడ్జెట్ ఫోన్.. దుమ్ములేపుడే!
Vivo T3 5G స్మార్ట్‌ఫోన్ కెమెరా విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50 MP+2 MP డ్యూయల్ బ్యాక్ కెమెరాను కలిగి ఉంది. అలానే 16 MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. దీంతో మంచి క్వాలిటీ ఫోటోలను తీయొచ్చు. చివరగా ఇది డైమెన్సిటీ 7200 ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్‌కు బెటర్ పర్ఫామెన్స్ ఇస్తుంది.