EPAPER

USA vs CAN T20 World Cup Highlights: టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ ప‌రుగుల వ‌ర‌ద‌.. అమెరికా ఘన విజయం

USA vs CAN T20 World Cup Highlights: టీ 20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ ప‌రుగుల వ‌ర‌ద‌.. అమెరికా ఘన విజయం

USA vs Canada Highlights ICC T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ సమరం మొదలైంది. ఆతిథ్య జట్టు అమెరికా వర్సెస్ కెనడా మధ్య జరిగిన తొలి మ్యాచ్ టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ లో జరిగింది. భారతకాలమానం ప్రకారం ఈరోజు ఉదయం 5.30కి మ్యాచ్ ప్రారంభమైంది. అయితే టోర్నమెంటుకి శుభసూచకంగా ఆతిథ్య జట్టు అమెరికా విజయం సాధించింది. అయితే కెనడా కూడా తక్కువ తినలేదు. వాళ్లూ పోటాపోటీగానే ఆడటం విశేషం.


టాస్ గెలిచిన అమెరికా మొదట బౌలింగు తీసుకుంది. దీంతో బ్యాటింగ్ కి వచ్చిన కెనడా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.  లక్ష్య ఛేదనలో యూఎస్ఏ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసి విజయ దుందుభి మోగించింది.

195 పరుగుల లక్ష్యంలో బరిలో దిగిన యూఎస్ఏ.. ఎటువంటి తత్తరపాటు లేకుండా అలవోకగా విజయం సాధించింది. ఓపెనర్లు ఇద్దరు స్టీవెన్ టేలర్ (0), కెప్టెన్ మోనాంక్ పటేల్ (16) నిరాశపరిచినా ఫస్ట్ డౌన్ వచ్చిన ఆండ్రిస్ గౌస్, ఆరోన్ జోన్స్ ఇద్దరూ విజయ తీరాలకు చేర్చారు. లక్ష్యం దగ్గరలో గౌస్ అవుట్ అయినా… జోన్స్ ముందుకి నడిపించాడు.


ఆండ్రిస్ గౌస్ 46 బాల్స్ లో 3 సిక్స్ లు, 7 ఫోర్ల సాయంతో 65 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తర్వాత ఆరోన్ జోన్స్ అయితే 10 సిక్స్ లు, 4 ఫోర్ల సాయంతో 94 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. సెంచరీకి 6 పరుగుల ముందు లక్ష్యం చేరిపోవడంతో ఒకింత ఆనందం, ఒకింత విచారంతో క్రీజు వదిలాడు. చివర్లో  కోరే అండర్సన్ (3) నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 17.4 ఓవర్లలో 197 పరుగులు చేసి ఆతిథ్య అమెరికా జట్టు శభాష్ అనిపించింది. పెద్ద జట్లకి ఒక సవాల్ విసిరింది.

కెనడా బౌలింగులో కలీం సానా 1, డిల్లాన్ 1, నికిల్ దత్తా 1 వికెట్ తీశారు.

మొదట బ్యాటింగ్ చేసిన కెనడా జట్టు ఎంతో సాధికారికంగా ఆడింది. అసలు తొలి ప్రపంచకప్ లో ఆడుతున్నామనే జంకుబొంకూ లేకుండా ఆడటం విశేషం. ఓపెనర్లు ఇద్దరూ శుభారంభం అందించారనే చెప్పాలి. ఆరోన్ జాన్సన్ (23) త్వరగా అవుట్ అయినా, మరో ఓపెనర్ నవనీత్ ధాలివాల్ 44 బంతుల్లో 3 సిక్సులు, 6 ఫోర్ల సాయంతో 61 పరుగులు చేసి శభాష్ అనిపించాడు.

Also Read: రోహిత్‌శర్మకు హగ్ ఇచ్చిన అభిమాని, రంగంలోకి పోలీసులు..

ఫస్ట్ డౌన్ వచ్చిన పర్గత్ సింత్ (5) అనుకోకుండా రన్ అవుట్  అయిపోయాడు. సెకండ్ డౌన్ వచ్చిన నికోలస్ కిర్టన్ మాత్రం ఆఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో 2 సిక్సులు, 3 ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన శ్రేయాస్ మొవ్వ 16 బంతుల్లో 2 సిక్స్ లు, 2 ఫోర్ల సాయంతో 32 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇక దిల్ ప్రీత్ భజ్వా 11 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. చివర్లో డిల్లాన్ 1 పరుగుతో నాటౌట్ గా నిలిచాడు. మొత్తానికి 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసి మంచి లక్ష్యాన్నే అమెరికా ముందు ఉంచింది. అయితే ఇద్దరు ప్లేయర్లు రన్ అవుట్ కావడంతో మ్యాచ్ లో కొంత వెనుకపడ్డారు.

యూఎస్ ఏ బౌలింగులో ఆలిఖాన్ 1, హర్మీత్ సింగ్ 1, కోరీ ఆండర్సన్ 1 వికెట్ తీశారు.

ఈరోజు మరో ఆతిథ్య దేశమైన వెస్టిండీస్ తో పపువా న్యూ గినియా మ్యాచ్ గయానాలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఈరోజు సాయంత్రం 6 గంటలకు జరగనుంది.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×