EPAPER

Telangana formation day celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, అమరులకు నివాళులతో.. పల్లెల్లో సంబరాలు

Telangana formation day celebrations: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలు, అమరులకు నివాళులతో.. పల్లెల్లో సంబరాలు

Telangana formation day celeb: తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రం లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది రేవంత్ సర్కార్. ఉదయం తొమ్మిదిన్నరకు గన్‌పార్క్‌లో అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాళులు అర్పిస్తారు.


ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుంటారు. అక్కడ జాతీయ పతాకం ఆవిష్కరిస్తారు. అనంతరం పోలీసు బలగాల పరేడ్, మార్చ్‌పాస్ట్, వందన కార్యక్రమాలు ఉంటాయి. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తారు.

సాయంత్రం ట్యాంక్‌బండ్ పై ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేశారు అధికారులు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి ట్యాంక్ బండ్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శిస్తారు. అక్కడి కార్యక్రమాల తర్వాత 13 నిమిషాల నిడివి గల జయ జయహే తెలంగాణ గీతాన్ని విడుదల చేయనున్నారు. కవి అందెశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణిలను సన్మానిస్తారు.


ALSO READ: కాకతీయులు చంపిన సమ్మక్క సారక్కలవైపే ఉంటాను: సీఎం రేవంత్ రెడ్డి

రాత్రి ఎనిమిదిన్నర నుంచి హుస్సేన్‌సాగర్‌లో బాణసంచా కాలుస్తారు. ఆదివారం కావడంతో కుటుంబాలతో పెద్దఎత్తున ఉత్సవాలకు నగరవాసులు హాజరయ్యే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాటు చేశారు అధికారులు. మరోవైపు రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాలను ముస్తాబు చేశారు. చార్మినార్, సచివాలయం, అమరజ్యోతి స్తూపం, అంబేడ్కర్ విగ్రహం, గోల్కొండ ప్రాంతాల్లో విద్యుత్ దీపాల కాంతులను ఏర్పాటు చేశారు.

 

Tags

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×