వనప్లస్ తన బ్రాండ్ నుంచి రాబోయే Ace 3 Pro స్మార్ట్‌ఫోన్‌ని  త్వరలో చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది.

స్మార్ట్‌ఫోన్ గ్లాస్, సిరామిక్, వేగన్ లెదర్ బ్యాక్ ప్యానెల్‌తో రావచ్చు.

OnePlus Ace 3 Proలో  6.78-అంగుళాల కర్వ్డ్ OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ ప్యానెల్ 1.5K రిజల్యూషన్‌తో వస్తుంది.

120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. అలానే ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను తీసుకురావచ్చు.

బ్యాక్ మూడు కెమెరాలు ఉంటాయి. ఇది 50-మెగాపిక్సెల్ సోనీ IMX890 సెన్సార్‌ను కలిగి ఉంటుంది.

8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2-మెగాపిక్సెల్ డెప్త్ లేదా మాక్రో సెన్సార్ చూడొచ్చు.

Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్‌ ఉంటుంది. అలానే 16GB RAM+1TB వరకు స్టోరేజ్ ఉంటుందని లీకులు ద్వారా తెలుస్తుంది.

ఫోన్ 6,100mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.