EPAPER

Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. మళ్లీ తీహార్ జైలుకే..

Delhi Liquor Scam: అరవింద్ కేజ్రీవాల్‌కు దక్కని ఊరట.. మళ్లీ తీహార్ జైలుకే..

No Relief For Arvind Kejriwal: ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ తీహార్ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేజ్రీవాల్ తరఫున ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు శనివారం తీర్పు రిజర్వ్ చేసింది. కాగా జూన్ 5న తీర్పును వెలువరించనుంది రూస్ అవెన్యూ కోర్టు.


దీంతో కేజ్రీవాల్ ఆదివారం(జూన్ 2) తిరిగి తీహార్ జైలుకు వెళ్లవలసి ఉంటుంది. వైద్య కారణాలతో వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కోర్టును ఆశ్రయించింది.

అయితే అరవింద్ కేజ్రీవాల్ చేసిన దరఖాస్తును ఈడీ వ్యతిరేకించింది. అతని ఆరోగ్యం కుదురుగానే ఉందని.. ఢిల్లీ సీఎం తన ఆరోగ్యంపై తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ పేర్కొంది. ఏదైనా వైద్య పరీక్షలు అవసరమైతే అరవింద్ కేజ్రీవాల్‌ను ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (ఎయిమ్స్) లేదా ఇతర ఆసుపత్రికి తీసుకువెళతామని కూడా దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది.


లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం అరవింద్ కేజ్రీవాల్‌కు గతంలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ గడువు జూన్ 1న ముగుస్తుంది. జూన్ 2న (ఆదివారం) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు అధికారుల ముందు లొంగిపోవాల్సి ఉంటుంది.

వైద్య పరీక్షల కోసం తన మధ్యంతర బెయిల్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలన్న అభ్యర్థనను అత్యవసరంగా జాబితా చేయడానికి సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించడంతో ఆప్ చీఫ్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు నుంచి రెగ్యులర్ బెయిల్ పొందే అవకాశం ఉన్నందున, అతని అభ్యర్థనను స్వీకరించబోమని కోర్టు స్పష్టం చేసింది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×