EPAPER

How To Make Money On Instagram: ఇన్‌స్టాగ్రామ్ ఉందా.. వద్దన్నా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. అసలు సీక్రేట్ ఇదే!

How To Make Money On Instagram: ఇన్‌స్టాగ్రామ్ ఉందా.. వద్దన్నా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.. అసలు సీక్రేట్ ఇదే!

How To Make Money On Instagram: ఈ రోజుల్లో సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఎవరూ ఉండలేరు. నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనల్లోంతా సోషల్ మీడియాలోనే ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో టైమ్‌పాస్ చేస్తుంటారు. అయితే ఇంట్లోనే కూర్చొని ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చని మీకు తెలుసా? మీరు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా? అయితే కచ్చితంగా ఈ చిట్కాలను పాటించండి. లక్షల రూపాయలు సంపాదించండి.


ఇన్‌స్టాగ్రామ్ నుండి డబ్బు సంపాదించడానికి మీరు ముందుగా ఎక్కువ ఫాలోవర్స్ లేదా ఫ్రెండ్స్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో తక్కువ ఫాలోవర్స్ ఉన్న యూజర్‌లు కూడా ఇన్‌స్టా నుండి చాలా సంపాదిస్తున్నారు. అయితే మీకు ఎక్కువ మంది ఫాలోవర్లు ఉంటే మీరు టాప్‌లో ఉంటారు. నిజానికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్న వినియోగదారులకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. ఎక్కువ మంది స్నేహితులతో మీరు పెద్ద బ్రాండ్‌ను ప్రమోట్ చేసే అవకాశాన్ని కూడా పొందవచ్చు.

Also Read: మహిళలకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు.. రూ.10 లక్షల ఉచితంగా పొందొచ్చు!


ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మీరు అనుబంధ సంస్థ నుండి కూడా డబ్బులు సంపాదించవచ్చు. దీని అర్థం మీరు మీ వీడియోలో కంపెనీ ప్రొడక్ట్స్‌కి సంబంధించి లింక్‌ను ఉంచాలి. ఎవరైనా ఈ లింక్ ద్వారా ఆ ప్రొడక్ట్ కొనుగోలు చేస్తే మీరు దాని ద్వారా డబ్బును కమీషన్‌గా పొందుతారు. మీరు మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్‌ల ద్వారా ఏదైనా బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తే మీరు డబ్బు సంపాదించవచ్చు.

బ్రాండ్ ప్రమోషన్ నుండి మంచి మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు అయితే దీని కోసం మీరు ఫాలోవర్స్‌ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. ఇది కాకుండా Instagram కొన్ని టర్మ్స్ అండ్ కమిషన్స్‌ని అనుసరించాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని కూడా చెక్ చేయండి. డబ్బు సంపాదించడానికి ఈ అవసరమైన షరతులను పాటించాల్సి ఉంటుంది.  మీరు Insta నుండి డబ్బు సంపాదించాలనుకుంటే మీరు మీ ఖాతాలో అప్‌లోడ్ చేస్తున్న ఏ వీడియో అయినా ఖచ్చితంగా ఒరిజినల్‌గా ఉండాలి. ఇది మాత్రమే కాదు మీ వీడియోలో ఉన్న సాంగ్ కూడా ఒరిజినలై ఉండాలి. ఎందుకంటే కాపీ చేసిన కంటెంట్‌కు వాల్యూ ఉండదు.

Also Read: ఇదెలా సాధ్యం.. వేలల్లో తగ్గిన ఐఫోన్ ప్రైజ్.. మిస్ కాకండి!

ఫాలోవర్స్‌ని పెంచుకోవడానికి, డబ్బు సంపాదించడానికి మీరు క్రియేట్ చేస్తున్న కంటెంట్ బ్రాండెడ్ కంటెంట్‌పై ఆధారపడి ఉండాలి. మీ రీల్‌లో ఎటువంటి తప్పుడు లాంగ్వేజ్ ఉపయోగించకూడదు. ఇది కాకుండా మీ కంటెంట్‌పై మంచి వ్యూస్ పొందడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు ఎక్కువ వ్యూస్ వస్తే మీకు ఎక్కువ డబ్బు వస్తుంది. చివరిగా ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ కంటెంట్‌ని క్రియేట్ చేస్తున్నట్లయితే అది నిజమై ఉండాలి. లేదంటే మీ ప్రొఫైల్ కూడా Insta నుండి సస్పెండ్ చేస్తారు.

Tags

Related News

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

Oppo : రియల్ మీ, సామ్ సాంగ్, వివోలను వెనక్కి నెట్టేసిన ఒప్పో..

Linkedin Jobs : డ్రీమ్ జాబ్​ కోసం ఎదురుచూస్తున్నారా? – ​ లింక్డ్ ఇన్ ప్రొఫైల్​లో ఇలా చేస్తే చాలు!

×