EPAPER

High BP: హైబీపీతో బాధపడే వారు తస్మాత్ జాగ్రత్త.. ఇది గుండెకే కాదు.. దానికి కూడా ప్రమాదమే

High BP: హైబీపీతో బాధపడే వారు తస్మాత్ జాగ్రత్త.. ఇది గుండెకే కాదు.. దానికి కూడా ప్రమాదమే

High BP: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకుని వయస్సు తేడా లేకుండా చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. హైబీపీ అనేది ముఖ్యంగా గుండె సంబంధింత వ్యాధులకు కారణం అవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. హైబీపీ సమస్య గురించి చాలా మందికి చాలా విషయాలు తెలిసి ఉండవు. ఇది కేవలం గుండెకు సంబంధించే అని అనుకుంటుంటారు. కానీ అధిక రక్తపోటు వల్ల కేవలం గుండె సమస్యే కాదు అంతకు మించిన పెద్ద అవయవానికే ప్రమాదం పొంచి ఉంటుంది. అధిక రక్తపోటు కారణంగా చర్మం కూడా దెబ్బతింటుంది. చర్మం ఆరోగ్యాన్ని కాపాడే పెద్ద అవయవం. అయితే రక్తపోటు వల్ల చర్మ సమస్యలు కూడా ఏర్పడతాయట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


హైబీపీ సమస్య చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హైబీపీ కారణంగా రక్త ప్రవాహం, ప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది పోషకాలు, ఆక్సిజన్ వంటి వాటిని చర్మానికి చేరకుండా అడ్డుకుంటుంది. అంతేకాదు అనేక రకాల చర్మ సమస్యలు వస్తాయి. చర్మం పొడిబారడం, నీరసంగా ఉండడం వంటివి ఏర్పడతాయి. ఎరిథీమా, పెటెచియా వంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి. దీనివల్ల శరీరంపై ఏర్పడే గాయం కూడా నయం కావడానికి టైం పడుతుంది.

హైబీపీ కారణంగా చర్మం చాలా రకాలుగా దెబ్బతింటుంది. చర్మానికి రక్తప్రసరణ తగ్గించి రోగనిరోధక కణాలను క్షీణించేలా చేస్తుంది. దీనివల్ల చర్మానికి ఏర్పడే సమస్యల నుంచి కోలుకోవడానికి సమయం పడుతుంది. హైబీపీ ఉన్న వారికి చర్మం ఎరుపు రంగులోకి మారుతుంది. దీనిని ఎరిథెమా అంటారు. ఇది ముఖాన్ని ఎరుపు రంగులోకి మారేలా చేసి ఉద్రేకంగా తయారుచేస్తుంది. ఇది కేవలం హైబీపీ కంట్రోల్ లో లేని వ్యక్తుల్లో మాత్రమే కనిపిస్తుంది.


రక్తపోటు కారణంగా చర్మం పలుచగా, బలహీనంగా మారుతుంది. దీని వల్ల చర్మంపై గాయం, పుండ్లు ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మొటిమలు, సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు వస్తాయి. మరోవైపు ఇతర అవయవాల్లోను సమస్యలు ఉంటే కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. అందువల్ల రక్తపోటుతో బాధపడే వ్యక్తులు సున్నితమైన చర్మ సంరక్షణను వాడాలి. స్కిన్ కేర్ వాడే క్రమంలో వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Tags

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండారంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×