EPAPER

The Sheep distribution Scam: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

The Sheep distribution Scam: గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరు అరెస్ట్

Sheep distribution scam Telangana(TS today news): గొర్రెల పంపిణీ అక్రమాల కేసులో మరో ఇద్దరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. పశుసంవర్థక శాఖ మాజీ సీఈ రాంచందర్, మాజీ ఓఎస్డీ కల్యాణ్ ను అరెస్ట్ చేశారు. రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో వీరిని శుక్రవారం అరెస్ట్ చేశారు.


వీరిద్దరూ కూడా ప్రైవేట్ వ్యక్తులతో కలిసి అక్రమంగా అనుచిత లబ్ధి పొంది ప్రభుత్వ ఖజానాకు అన్యాయమైన నష్టం కలిగించి రూ. 2.10 కోట్ల విలువైన ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని ఏసీబీ గుర్తించింది. దీంతో వారిద్దరినీ అరెస్ట్ చేసింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి వారికి 2 వారాల రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Also Read: ‘అమరవీరుల స్థూపం ఉంటే కేటీఆర్‌కు అభ్యంతరం ఎందుకు..?’


కాగా, గొర్రెల పంపిణీ స్కామ్ కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి పలువురిని ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో తాజాగా అరెస్ట్ చేసినవారితో కలిపి ఇప్పటివరకు మొత్తం 10 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఏసీబీ దూకుడు పెంచడంతో భవిష్యత్ లో ఇంకా ఎవరెవరిని అరెస్ట్ చేస్తారో ? అన్న అంశం పశుసంవర్ధక శాఖ వర్గాల్లో టెన్షన్ పుట్టిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×