EPAPER

Silent layoffs Grip Indian IT Sector: సాఫ్టుగా ఉంటే అంతే! ఐటీ ఉద్యోగ కష్టాలు

Silent layoffs Grip Indian IT Sector: సాఫ్టుగా ఉంటే అంతే! ఐటీ ఉద్యోగ కష్టాలు

రెండోది.. మూడు నెలల సాలరీ ఇస్తాం.. రిజైన్ చేయండి అని చెప్పడం. ఎవ్వరైనా సెకండ్‌ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఎందుకంటే కాస్త గౌరవంగా ఉంటుంది. అండ్.. నెక్ట్స్‌ జాబ్‌ సంపాదించుకున్నాక ఇబ్బంది ఉండదు. ఈ నిర్ణయం తీసుకోవడానికి పెద్దగా టైమ్‌ కూడా ఉండదు. వెంటనే చెప్పేయాలి. అందుకే ఇది అఫిషియల్‌గా లేఆఫ్స్‌ కిందకు రాదు. విషయం బయటికి కూడా రాదు. అందుకే సైలెంట్ లే ఆఫ్‌గా మారిపోతుంది. మరికొన్ని కంపెనీలు ఇంకో కొత్త రూల్‌ను తీసుకొచ్చాయి.

కొన్ని కంపెనీలు అదే కంపెనీలో ఉన్న ఓపెనింగ్స్‌లో జాబ్ తెచ్చుకునేందుకు.. ఓ 30 రోజుల టైమ్ ఇస్తున్నాయి. తెచ్చుకుంటే సరే లేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందే. సో ఓవరాల్‌గా రిలీవింగ్ లెటర్‌లో టెర్మినేటెడ్ అని ఉండటం కన్నా రిజైన్‌ చేసినట్లుగా ఉండటం బెటరని ఎక్కువ మంది సైలెంట్ లే ఆఫ్స్‌కు ఓకే చెప్పేస్తున్నారు. నిజానికి సైలెంట్ లేఆఫ్స్‌ ఎంప్లాయిస్‌లో స్ట్రెస్‌ను పెంచేస్తున్నాయి. లేఆఫ్స్‌ బారిన పడకుండా ఉండాలంటే.. టార్గెట్స్‌ను రీచ్‌ అవ్వాలి. అలా రీచ్ అవ్వాలంటే.. గొడ్డు చాకిరి చేయాలి. యస్.. నిజంగానే గొడ్డు చాకిరి చేయాలి. ఇప్పటికే చాలా మంది 12 నుంచి 14 గంటల పాటు కుస్తీలు పడుతున్నారు. కావాలంటే మీ చుట్టు పక్కల ఉన్న సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్‌ను కాస్త అబ్వర్వ్ చేయండి. విషయం మీకే తెలిసిపోతుంది.


Also Read: మిడ్ నైట్ హంగామా, ఎయిర్‌పోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్, ఆపై

2023-24 ఫైనాన్షియల్‌ ఇయర్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య అక్షరాలా 20 వేల మంది. ఇది కాకుండా TCS, ఇన్ఫోసిస్, LTI-మైండ్ ట్రీ, టెక్‌ మహీంద్రా, విప్రోలో ఎంప్లాయిస్ సంఖ్య తగ్గిపోవడమే కానీ.. పెరగలేదు. HCL టెక్‌ మాత్రమే.. ఎంప్లాయిస్‌ను రిక్రూట్ చేసుకుంది అంతే.. దీనికి ఈ కంపెనీలు చెప్తున్న రీజన్స్ ఏంటంటే. ఎకనామిక్ స్లో డౌన్ అంటే ఆర్థికపరిస్థితి మందగమనం,ఆటోమెషన్, రీస్ట్రక్షరింగ్ లాంటి రీజన్స్ చెబుతున్నాయి ఆ కంపెనీలు. ఇండియాలో మాత్రమే కాదు.. ఆపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, IBM, ఇంటెల్‌ లాంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నాయి. రిక్రూట్‌మెంట్స్‌ను ఫ్రీజ్ చేశాయి. ఒకవేళ కొనసాగించినా చాలా తక్కువ మాత్రమే.. కొన్ని స్టారప్ కంపెనీలు అయితే ఇప్పటికే ఎంప్లాయిస్‌ని దాదాపు 50 శాతం వరకు తగ్గించేశాయి. ఇవన్నీ కూడా ఫాలో అయ్యేది సైలెంట్ లేఆఫ్స్‌ కావడం ఇక్కడ టెన్షన్ పుట్టిస్తోంది.

ప్రస్తుతం ఇండియన్ ఐటీ ఇండస్ట్రీలో డౌన్‌ట్రెండ్‌ నడుస్తోంది. అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి స్థానిక ఐటీ కంపెనీలకు కొత్త ప్రాజెక్టులేవీ పెద్దగా రావడం లేదు. అక్కడ కూడా ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. ఈ దెబ్బకు అత్యవసరం కాని టెక్ బడ్జెట్‌లను పక్కన పెట్టేస్తున్నాయి. ఈ ఎఫెక్ట్‌ ఇప్పుడు ఇండియన్ ఐటీ సెక్టార్‌పై పడుతోంది. ఇక ఉద్యోగాలు కోల్పోయిన టెకీలకు అంత ఈజీగా మళ్లీ ఉద్యోగాలు దొరకడం లేదు. ఒకవేళ దొరికిన అరకొర జీతాలు మాత్రమే ఇస్తామంటున్నారు. ఇక ఉద్యోగాలు కోల్పోకుండా కొలువు నిలుపుకున్న ఎంప్లాయిస్ కూడా హ్యాపీగా లేరు. ఎందుకంటే ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులపై బర్డెన్ పెంచుతున్నాయి. ఇప్పుడది 16 నుంచి 18 గంటలకు పెరిగింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు ఇచ్చే వేరియబుల్‌ పేలో కోతలు కూడా పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ నచ్చకపోయినా మనసు చంపుకొని పనిచేస్తున్నారు టెకీలు.. చేయకపోతే సైలెంట్ లేఆఫ్స్‌ అస్త్రం ఉండనే ఉందిగా.

గతంలో టెకీలు మంచి జీతాల కోసం తరచూ ఉద్యోగాలు మారేవారు. కొవిడ్‌ టైమ్‌లో అయితే కొన్ని కంపెనీలు తమకు కావాల్సిన వారికి.. 100-150శాతం హైక్‌ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకున్నాయి. కానీ ఇప్పుడా సిట్యూవేషన్ కంప్లీట్‌గా రివర్స్‌ అయ్యింది. ఉన్న ఉద్యోగం ఊడకుండా ఉంటే చాలన్న ఫీల్‌లో ఉన్నారు. మరి ఈ సిట్యువేషన్‌ ఎంత కాలం ఉంటుందో చూడాలి.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×