EPAPER

Prajwal Revanna arrested at Bengaluru: మిడ్ నైట్ హంగామా, ఎయిర్‌పోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్, ఆపై

Prajwal Revanna arrested at Bengaluru: మిడ్ నైట్ హంగామా, ఎయిర్‌పోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్, ఆపై

Prajwal Revanna arrested at Bengaluru: ఎట్టకేలకు జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్  అయ్యారు. గురువారం అర్థరాత్రి దాటాక ఆయనను బెంగుళూరు ఎయిర్‌పోర్టులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జర్మనీ నుంచి నేరుగా బెంగుళూరు ఎయిర్‌పోర్టులో దిగారాయన. ఎయిర్‌పోర్టు నుంచి అక్కడి నుంచి నేరుగా ఆ రాష్ట్ర సీఐడీ కార్యాలయానికి తరలించారు.


మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మహిళలపై ఆయన లైంగిక దాడికి పాల్పడినట్టు కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికలు ముగియగానే వీడియోలు సోషల్‌మీడియాలో హంగామా చేశారు. ఎన్నికల అయిన మరుసటిరోజు ప్రజ్వల్ దేశం విడిచి పరారయ్యారు.

ఈ క్రమంలో పోలీసులు ఆయనపై రకరకాల కేసులు నమోదు చేశారు. ఆయన కోసం బెంగుళూరు పోలీసులు తీవ్రంగా గాలించారు. ఆయనకు నాలుగుసార్లు నోటీసులు ఇచ్చారు. అందులో బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులూ  ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన పాస్ పోర్టు రద్దు చేసేందుకు కేంద్ర విదేశాంగ చర్యలు చేపట్టింది. చివరకు ప్రజ్వల్ ఫాదర్, తాత దేవెగౌడ్ సైతం నోరు విప్పారు. మే 30న బెంగుళూరు రావాలని సూచన చేశారు.


చివరకు కర్ణాటక రాజకీయాలు ప్రజ్వల్ చుట్టూ తిరగడంతో పార్టీ డ్యామేజ్ అవుతుందని భావించారాయన. చివరకు మే 31న సిట్ ముందు హాజరు అవుతానని తొలిసారి వీడియో సందేశం ప్రజ్వల్ ఇచ్చారు. ఇదిలావుండగా ప్రజ్వల్‌కు బెంగుళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్ పిటీషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.

ప్రజ్వల్ వ్యవహారం బీజేపీ-జేడీఎస్ మధ్య బంధానికి బీటలు వారాయి. చివరకు బీజేపీ జోక్యంతో ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ మాజీ సీఎం కుమారస్వామి ప్రకటన చేశారు. దీంతో కర్ణాటక రాజకీయాల్లో ప్రజ్వల్ వ్యవహారం కాస్త శాంతించింది. ఇదిలావుండగా ప్రజ్వల్ వ్యవహారంలో సిద్ధరామయ్య సర్కార్ ఏం చేస్తుందనేది అసలు పాయింట్.

ALSO READ: ఫోన్ చేసి పరామర్శించాల్సింది పోయి.. నిందలు వేస్తావా?

ఎందుకంటే సిద్ధరామయ్య మొదట జేడీఎస్‌ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత ఆ పార్టీ గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్‌లోకి వచ్చారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య సర్కార్ కేసు దర్యాప్తులో వెనుకడుగు వేస్తుందా? అన్నదే అసలు పాయింట్. మరోవైపు ఈ కేసును సీబీఐకి అప్పగించే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేస్తున్నారు కర్ణాటక కాంగ్రెస్ నేతలు. లైంగిక ఆరోపణలు కేసు డిలే అయితే రాజకీయ విమర్శలు జోరందుకుంటాయని, అదే సీబీఐకి అప్పగిస్తే.. మోదీ సర్కార్ మెడకు చుట్టుకుంటుందని భావిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు తర్వాత ఈ కేసు వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

 

 

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×