EPAPER

Tattoo Effects: స్టైల్‌గా ఉంటుందని టాటూ వేసుకుంటున్నారా.. హెచ్ఐవీ, క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త

Tattoo Effects: స్టైల్‌గా ఉంటుందని టాటూ వేసుకుంటున్నారా.. హెచ్ఐవీ, క్యాన్సర్ వస్తుంది జాగ్రత్త

Tattoo Effects: ప్రస్తుత కాలంలో చేతులపై పచ్చబొట్లు పొడిపించుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఏ వ్యక్తి చేతుల మీద చూసినా కూడా టాటూలు, పచ్చబొట్లే కనిపిస్తున్నాయి. వివిధ రకాల బొమ్మలు, పేర్లు, ఇలా శరీరం అంతటా టాటూలతో నింపుకుంటున్నారు. మరి కొంతమంది అయితే నాలుక, గుండె, మణికట్టు ఇలా చాలా ప్రమాదకరమైన ప్రదేశాల్లో టాటూలను వేయించుకుంటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల క్షణం నొప్పిని భరిస్తే సరిపోతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ టాటూల కారణంగా చాలా రకాల ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉంటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఆ ప్రమాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


వైద్యుల ప్రకారం, పచ్చబొట్టు వేయించుకోవడం వల్ల హెపటైటిస్ బి, సి, హెచ్‌ఐవి వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంటుందట. ప్రధానంగా కలుషితమైన సూదులు ఉపయోగించడం వల్ల ఒకరి వ్యాధి మరొకరికి సోకుతుందని అంటున్నారు.

స్వీడన్‌లోని లండ్ యూనివర్శిటీ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. పచ్చబొట్టు పొడిపించుకున్న వ్యక్తులకు శోషరస వ్యవస్థను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్‌లో లింఫోమా అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉందని కనుగొన్నారు. టాటూ వేయించుకున్న రెండు సంవత్సరాల్లో ఈ క్యాన్సర్ శరీరంలో అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. పిఎహెచ్‌లతో కూడిన టాటూ ఇంక్‌ను చర్మంలోకి ఇంజెక్ట్ చేసినప్పుడు శరీరంలోని రోగనిరోధక ప్రతిస్పందన శోషరస కణుపులలో సిరా కణాలు పేరుకుపోయి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.


శరీరంపై అందంగా పేర్లు, బొమ్మలు కనిపించాలని చెప్పి ఆర్టిఫిషియల్ గా కనిపించే టాటూలను వేయించుకోవడం వల్ల ప్రాణాలకే ముప్పు పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో అప్రమత్తంగా ఉండాలని, ఆరోగ్యం పట్ల, శరీరం శ్రేయస్సు కోసం ఆలోచించుకుని మొదలాలని సూచిస్తున్నారు.

Tags

Related News

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Beauty Tips: ముఖంపై మచ్చలు, ముడతలు పోవాలంటే ప్రతిరోజూ కలబందతో ఇలా చేయండి

Big Stories

×