EPAPER

T20 World Cup 2024 Schedule: టీ 20 ప్రపంచకప్ పోటీల వేళలు ఇవే..

T20 World Cup 2024 Schedule: టీ 20 ప్రపంచకప్ పోటీల వేళలు ఇవే..

T20 World Cup 2024 Schedule(Cricket news today telugu): టీ 20 ప్రపంచకప్ పోటీలు అమెరికా-వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడికి-ఇక్కడికి సుమారు 10 గంటల నుంచి 12 గంటలపైనే వ్యత్యాసం ఉంటుంది. అందువల్ల అమెరికాలో ఉదయం 9.30కి, కొన్నిమ్యాచ్ లు ఉదయం 10.30కి ప్రారంభం అవుతాయి. అంటే  భారత కాలమాన ప్రకారం  అవి రాత్రి 8 గంటలకు అవి ప్రసారం అవుతాయి.


ఈ మ్యాచ్ లను మన ఇండియాలో స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్, ఇంకా డిస్నీ హాట్ స్టార్ లో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. పాకిస్తాన్ లో 10 స్పోర్ట్స్ , పీటీవీ ద్వారా ప్రసారం అవుతాయి. వివిధ దేశాలు.. వివిధ నెట్ వర్క్ ల ద్వారా మ్యాచ్ ప్రసారాలు జరగనున్నాయి.

గ్రూప్-ఏలో భారత్ తలపడే మ్యాచ్‌‌లు.. వాటి వివరాలు..
ఇండియాలో రాత్రి 8 గంటలకు ( అమెరికాలో ఉదయం 9.30కి)
జూన్ 5: భారత్ – ఐర్లాండ్, న్యూయార్క్
జూన్ 9: భారత్ – పాకిస్థాన్, న్యూయార్క్
జూన్ 12: భారత్ – అమెరికా, న్యూయార్క్
జూన్ 15: భారత్ – కెనడా, ఫ్లోరిడా


Also Read: అమెరికాలో టీమ్ ఇండియా ప్రాక్టీసు షురూ..

అప్పుడే భారత్ ఆడే అన్ని మ్యాచ్ లకు టిక్కెట్లు ఫుల్ అయిపోయాయి. భారత్-పాక్ మ్యాచ్ టికెట్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ప్రీమియం క్లాస్‌ టికెట్‌ ధర రూ. 1.86 కోట్లకు చేరింది. రీ సేల్‌ వెబ్‌‌సైట్‌లలో ఈ ధరలు చూపిస్తున్నాయి. దీంతో అందరూ తలలు పట్టుకుంటున్నారు. ముందే ఎందుకు తీసుకోలేదని ఆదుర్దా పడుతున్నారు. అప్పుడే అమెరికాలో క్రికెట్  ఫీవర్ మొదలైంది.

2023 వన్డే ప్రపంచకప్ టోర్నీలో భారత్, పాక్ చివరిసారిగా తలపడ్డాయి. న్యూయార్క్‌లో భారత్‌కు చెందిన వారు చాలా మంది ఉండటంతో ఈ మ్యాచ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌ టికెట్‌ ధరను ఐసీసీ 6 డాలర్ల నుంచి 400 డాలర్లుగా నిర్ణయించింది. భారత కరెన్సీలో ఇది రూ. 497 నుంచి రూ. 33,148గా ఉంది. అయితే బ్లాక్ మార్కెట్ లో మాత్రం టికెట్ ధరలు ఆకాశాన్నంటాయి.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×