EPAPER

AmitShah to visit Tirumala: తిరుమలకు అమిత్ షా, నైట్ ఇక్కడే.. ఎందుకు?

AmitShah to visit Tirumala: తిరుమలకు అమిత్ షా, నైట్ ఇక్కడే.. ఎందుకు?

AmitShah to visit Tirumala today(BJP news andhra Pradesh): సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి దశ ఎన్నికల పోలింగ్ జూన్ ఒకటిన జరగనుంది. రెండున్నర నెలలపాటు సభలు, సమావేశాలు, రోడ్ షోలతో నేతలు అలిసిపోయారు. ప్రచారం ముగియడంతో రెస్ట్ తీసుకోవాలని భావిస్తున్నారు. మరికొందరు నేతలతో దేవుడి సన్నిధిలో గడపాలని భావిస్తున్నారు.


తాజాగా హోంమంత్రి అమిత్ షా, గురువారం సాయంత్ర తిరుమలకు రానున్నారు. సాయంత్రం ఆరున్నర గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వెళ్లారు. తిరుమలలోని వకుళామాత అతిథి గృహంలో బస చేయనున్నారాయన. శుక్రవారం శ్రీవారి దర్శనం అనంతరం మధ్యాహ్నం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు అమిత్ షా.

వున్నట్లుండి సడన్‌గా ఆయన తిరుమలకు రావడంపై రకరకాల అనుమానాలు రాజకీయ పార్టీల నేతల్లో మొదలయ్యాయి. ఈసారి బీజేపీ అనుకున్న సీట్లు రావని, పూర్తి మెజార్టీ రావడం కష్టమని కాంగ్రెస్ బలంగా చెబుతోంది. ఉత్తర భారతంలో కమలనాధులకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు సౌత్ వైపు వస్తున్నారని అంటున్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు వస్తున్నారని ఆ పార్టీలు వర్గాలు చెబుతున్నమాట.


ALSO READ: అమరావతి Vs వైజాగ్.. ఏపీ రాజధానిపై హాట్ డిబెట్

ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్రమోదీ తమిళనాడులోని కన్యాకుమారిలో బస చేయనున్నారు. అమిత్ షా ఏపీకి రావడంపై చర్చించుకోవడం నేతల వంతైంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. గడిచిన వారంలో ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. బుధవారం నాడు ఒక్కరోజు రికార్డు స్థాయిలో అంటే 52 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తారు. ఈ క్రమంలో ఉపశమనం కోసం సౌత్ వైపు వస్తున్నారని అంటున్నారు. 30 తర్వాత వాతావరణ చల్లబడుతుందని ఆ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి అటు మోదీ, ఇటు అమిత్ షా ఒకేసారి సౌత్ టూర్ వేయడం రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.

Tags

Related News

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

YS Jagan: జగన్‌కు మరో భారీ షాక్… తగలనుందా..?

YV Subba Reddy: పెద్ద పాపమే చేశాడు.. చంద్రబాబుకు సుబ్బారెడ్డి కౌంటర్

Big Stories

×