EPAPER

Kaikalur Assembly constituency: కైకలూరులో దూలంకి షాక్ ? ఈ సారి ఓటమి తప్పదా..

Kaikalur Assembly constituency: కైకలూరులో దూలంకి షాక్ ? ఈ సారి ఓటమి తప్పదా..

Big shock to Dulam Nageswara Rao in Kaikalur Assembly Constituency: అధికారంలోకి రాకముందు ఒకలా.. వచ్చాక మరోలా మారారు అనే విమర్శలను మూటగట్టుకున్నారు ఓ నేత. కాంట్రాక్ట్ పనుల్లో డబ్బుల వసూలు నుంచి ఇష్టానుసారంగా అధికారులను బదిలీ చేయించటం తప్ప ఆయన చేసిందేమే లేదనే భావనలో ప్రజలు ఉన్నారట. నియోజకవర్గ ప్రజలకు సుపరిచితుడైన వ్యక్తి..NDA కూటమి నుంచి పోటీలో దిగటంతో.. సదరు నేత వైపే ఓటర్లు చూశారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇంతకీ.. ఏమా నియోజకవర్గం.. ఎవరా నేత?


కృష్ణాజిల్లాలో కైకలూరు నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది. గతంలో ఇక్కడ నుంచి హేమాహేమీలు పోటీ చేశారు. చిన్నస్థాయి నుంచి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎదిగినవారూ ఉన్నారు. 2019లో దూలం నాగేశ్వరరావు కూడా అదే జాబితాలోకి వస్తారు. సర్పంచ్‌గా పనిచేసి.. నియోజకవర్గంలో సుపరిచతమైన నాగేశ్వరరావుకు వ్రజలు.. 2019లో ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. జనం ఇచ్చిన అవకాశాన్ని సదరు ఎమ్మెల్యే ఉపయోగించుకుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రజలకు కొత్తగా చేసిందేమే లేకపోగా.. ఆయన వల్ల ఇబ్బంది పడ్డామని కొందరు బహిరంగంగానే చెప్పడం.. వివాదస్పదంగా మారింది. 2019లో మొదటిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసిన దూలం నాగేశ్వరరావు.. 9వేల 357 ఓట్ల మెజార్టీతో.. టీడీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. వ్యాపారవేత్తగా ఆయనకు ఉన్న పేరుతో పాటు ఫ్యాన్ హవాతో గెలిచినా.. ఆయన మార్క్ అభివృద్ధి లేదనే వాదనలు ఉన్నాయి.

కైకలూరు ఎమ్మార్వో కార్యాలయం కట్టడానికి గ్రామాల నుంచి నాగేశ్వరరావు లక్షల్లో విరాళాలు వసూలు చేశారని ఆరోపణలున్నాయి. మరోవైపు.. ఇసుక మైనింగ్‌ను.. తన అనుచరులకు కట్టబెట్టి కోట్లు దండుకున్నారని స్థానికులే చెప్పుుకోవటం.. మైనస్‌గా మారే అవకాశాలున్నాయి. అలానే.. తన సామాజిక వర్గానికి కాని ఉద్యోగులపై.. కక్ష సాధింపు చర్యలకు దిగుతూ.. తనకు కావాల్సిన వారికి బదిలీలు చేయించారనే టాక్ బలంగా వినిపిస్తోంది. జగనన్న గ్రీన్ విలేజ్‌ కింద ఇంటి స్థలాలు మంజూరు చేయించడం.. వాటి చుట్టూ ఉన్న పొలాలను ఎమ్మెల్యే కొనుగోలు చేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఆయన ఈసారి గెలిచే అవకాశాలు లేవని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు.


Also Read: రాయచోటి నియోజకవర్గంలో.. ఈసారి జెండా పాతేదెవరు?

రేషన్ బియ్యంలోనూ కుంభకోణాలు జరిగి.. కోట్లరూపాయలు ఎమ్మెల్యేకు ముడుతున్నాయనే ఆరోపణలు వినపడ్డాయి. దళితులంటే ఆయనకు చులకన భావమనే ప్రచారమూ సాగింది. జగనన్న కాలనీల కోసం భూములకు.. తాము చెప్పిన రేటే తీసుకోవాలని కొందరిని బెదిరించి మరీ లాక్కున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపించాయి. వీటిపై ఎవరైనా ప్రశ్నిస్తే.. వారిపై కేసులు పెట్టించి మరీ వేధించారని సొంత నియోజకవర్గం నేతలే కస్సుబస్సుమంటున్నారట. ఇలా నియోజకవర్గంలో చాలామందీ దూలం నాగేశ్వరావు బాధితులేనని దీంతో ఆయనకు వ్యతిరేకంగా ఈ సారి ఓట్లు వేశారనే టాక్ నడుస్తోంది. నాగేశ్వరరావు అరాచకాలపై విసుగుచెంది. NDA కూటమికే పట్టం కట్టారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

NDA అభ్యర్థిగా ఉన్న కామినేని శ్రీనివాసరావుకు మంచి పేరుంది. NDA తరుపున 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేసిన ఆయన వైపే… ప్రజలందరూ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. కామినేనికు సౌమ్యుడిగా పేరుంది. దానికి తోడు మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా శ్రీనివాసరావుకు ప్రత్యేక ఓట్‌బ్యాంక్‌ ఉందని టాక్‌. పైగా.. ఆయన వల్ల ఎవరికీ ఇబ్బంది కలిగిన దాఖలాలు కూడా లేవనే ప్రచారం ఉంది. కొల్లేరు సమస్యకు కొంతమేరకు ఆయన పరిష్కారం చూపించారని సానుభూతి జనంలో ఉంది. ఏదైనా పనిమీద ఆయన దగ్గరకు వెళ్తే.. వెనువెంటనే స్పందిస్తారనే టాక్‌ నియోజకవర్గంలో ఉంది. ఇన్ని క్వాలీటీస్ ఉన్న కామినేని వైపే.. జనాలు చూశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.

ఓవైపు.. వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నెలకొనగా.. దూలం నాగేశ్వరరావు తీరుపై జనాల్లో విరక్తి వచ్చిందని.. అందుకే ఈ సారి కూటమి అభ్యర్థి అయిన కామినేని శ్రీనివాసరావు విజయం ఖాయమనే చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓటమి తర్వాత ఐదేళ్లు గ్యాప్ అనంతరం కామినేని అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Tags

Related News

History of Naxalism: మావోయిస్టుల అంతం.. ఎందుకీ పరిస్థితి వచ్చింది?

Narsingi: నార్సింగిలో బంగారు గని..?

Sabarmati and Thames River: సబర్మతి, థేమ్స్ నదులు ఎలా బాగుపడ్డాయి?

Israel-Iran War: ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ వ్యూహం ఇదే!

Osho Rajneesh: కళ్ళకు కట్టినట్టుగా ఓషో రజనీష్ నిజస్వరూపం

YS Jagan: కడపలో జగన్ ప్లాన్ సక్సెస్.. ఎలాగంటే..

YS Jagan in Confusion: అంబటి, రజిని దెబ్బకి.. అయోమయంలో జగన్

×